పున్నమి ప్రతినిధి అక్టోబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల గీత నగర్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సురక్షిత్ బచ్ ఫన్ అభియాన్ సదస్సు లో సిరిసిల్ల రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు చిన్నారులపై లైంగిక వేధింపులు జరిగితే భయపడకుండా అధికారులకు తెలియజేయాలని సూచించారు పోక్సో చట్టం బాలలకు రక్షణ కల్పిస్తుందని వివరించారు బాలికలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు

News Sources
- Punnami ReportingOwn reporting