ముద్దనూరులో మాజీ ఎంపీపీ కె. మునిరాజ రెడ్డికి ఘన సన్మానం
ముద్దనూరు మండలం స్థానిక పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కీ.శే. గజ్జల చెన్నారెడ్డి, కీ.శే. అచ్చమ్మ గార్ల ప్రతిభా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీపీ కె. మునిరాజ రెడ్డి గారిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. అనంతరం ముద్దనూరు మండలం కొలవలి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహ, ధ్వజ, శిఖర, వాహన ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కె. మునిరాజ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఎన్. శ్రీధర్ రెడ్డి, జెట్టి సూర్య ప్రతాప్, సుబ్బారెడ్డి, సుబ్బయ్య, ప్రణీత్ రెడ్డి, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


