Saturday, 26 September 2026

Tag: ఎలమంచిలి

అనకాపల్లి

సమిద సంస్థ ఆధ్వర్యంలో యువ మిత్ర శిక్షణ”

నర్సీపట్నం, పున్నమి ప్రతినిధి ఆనంద్ : స్కూల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కార్యక్రమంలో భాగంగా సమిద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, యూనిసెఫ్, మహిత మరియు ఆలియన్స్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థల సహకారంతో యువ మిత్ర రాయబారులకు శిక్షణ కార్యక్రమం శనివారం నాడు బలిఘట్టం జడ్‌పీహెచ్ స్కూల్‌లో శిక్షణ అందించారు. ఈ శిక్షణలో అనకాపల్లి జిల్లాలోని 15 పాఠశాలలకు చెందిన 48 మంది ఎంపిక చేసిన విద్యార్థి, విద్యార్థినులు పాల్గొన్నారు. వారికి బాలల హక్కులు, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యం, బాల్య వివాహాల నిరోధం, బాలల అక్రమ నిరోధం, పౌష్టికాహారం మరియు జెండర్ బ్యాలెన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం పిల్లను గ్రూపులు గా విభజించి పలు అంశాలపై చర్చించుట జరిగింది. ఈ సందర్భంగా సమిద సంస్థ కార్యదర్శి డి. వీరభద్రరావు, ప్రాజెక్టు ప్రోగ్రాం మేనేజర్ ఎల్.వరాహలాబాబు, సమీద సిబ్బంది ఎస్. సంధ్యరాణి, ఏఎన్‌ఎం లక్ష్మి, కె.నాగేశ్వరరావు, బాల నాగేశ్వరరావు వివిధ పద్ధతుల ద్వారా విద్యార్థులకు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె. శ్రీదేవి, ఉపాధ్యాయులు టి.విజయలక్ష్మి, కె.జయలక్ష్మి, ఎస్.నాగేశ్వరరావు, ఎం.మోషెస్‌ పాఠశాల సిబ్బంది పాల్గొని యువమిత లతో పలు అంశాలపై చర్చించారు.

అనకాపల్లి

శారదానది నరసాపురం ఆయకట్టును పరిశీలించిన ప్రగడ నాగేశ్వరరావు

పున్నమి ప్రతినిధి ఆనంద్ : యలమంచిలి : యలమంచిలి, రాంబిల్లి మండలాలకు సాగు నీరు అందించే శారదనది నరసాపురం నాయికట్టును ఎపి రహదారుల కార్పొరేషన్ చైర్మన్, యలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు శుక్రవారం నాడు నర్సాపురం ఆయకట్టును పరిశీలించారు. పోలవరం ఎడమ కాలువ నుండి వచ్చే నీరు మీ అంత నిల్వ ఉన్నది అన్నది అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ​రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు కొరత లేకుండా చూడాలనే లక్ష్యంతో ఆయన అధికారులతో కలిసి కాలువ వద్ద నీటి మట్టాన్ని, ప్రవాహ వేగాన్ని పరిశీలించడం జరిగిందని కూటమి ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. చివరి ఆయకట్టు రైతు వరకు గోదావరి నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆడారి ఆదిమూర్తి, టిడిపి నాయకులు ఆర్ఎస్ నాగేశ్వరరావు, ఆడారి రమణ బాబు, నాయకత్తే చైర్మన్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

యలమంచిలి పురపాలక ఎన్నికలపై టీడీపీ సమీక్ష

పున్నమి ప్రతినిధి ఆనంద్ యలమంచిలిలో రాబోయే పురపాలక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుభం కళ్యాణ మండపంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. టౌన్ అధ్యక్షుడు గొర్ల శివనారాయణమూర్తి (నానాజీ) అధ్యక్షతన జరిగిన సమావేశానికి మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్సీ కొండపల్లి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ లాలం భవాని భాస్కర్ తదితరులు హాజరయ్యారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికలకు సమష్టిగా సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీలోని 32 వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే వారి జాబితాతో పాటు చైర్‌పర్సన్ పదవికి ఆసక్తి ఉన్నవారి వివరాలను పరిశీలించారు. ఎన్నికల్లో ఐక్యంగా పనిచేయాలని సూచించారు.

అనకాపల్లి

సూర్య ప్రైవేట్ ఐటీఐలో ఏటికొప్పాక జెడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థుల విద్యా పర్యటన

ఎలమంచిలి :పున్నమి ప్రతినిధి ఆనంద్ ఏటికొప్పాక గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9, 10 తరగతుల ఒకేషనల్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు సెప్టెంబర్ 16న సూర్య ప్రైవేట్ ఐటీఐని విద్యా పర్యటనలో భాగంగా సందర్శించారు. హెచ్‌ఎం ఎం. రమణ పర్యవేక్షణలో ఒకేషనల్ ఉపాధ్యాయులు కుమార్ (ఎలక్ట్రానిక్స్), మనోజ్ ఆధ్వర్యంలో పర్యటన జరిగింది. విద్యార్థులు ఐటీఐలోని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ల్యాబ్‌లను పరిశీలించి, వివిధ రకాల సర్క్యూట్లు, టెస్టింగ్ పరికరాలు, యంత్రాల పనితీరును ఆసక్తిగా తెలుసుకున్నారు. ఐటీఐ అధ్యాపకులు పరికరాల వినియోగం, సాంకేతిక అంశాలను వివరించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న మార్కెట్‌ డిమాండ్‌, భవిష్యత్‌ ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. తరగతి గది విద్యతో పాటు ప్రాక్టికల్‌ విజ్ఞానం, పారిశ్రామిక నైపుణ్యాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు ఈ పర్యటన దోహదపడిందని హెచ్‌ఎం రమణ తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు వారికి అవసరమైన సూచనలు అందించారు.

అనకాపల్లి

ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం..

పున్నమి ప్రతినిధి ఆనంద్ : యలమంచిలి : ప్రజా సమస్యల పరిష్కారం దిశగానే కూటమి ప్రభుత్వం పని చేస్తుందనీ ఏపీ రహదారుల కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం నాడు యలమంచిలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్తాయి “స్పెషల్ గ్రీవెన్స్ – ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని నిర్వహించగా నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల నుండి విచ్చేసిన ప్రజల స్వయంగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకొని, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే ఈ ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పింఛన్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, తాగునీరు, డ్రైనేజీ వంటి పలు పౌర సమస్యలపై ప్రజల నుండి పెద్ద ఎత్తున వినతులు అందాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా సంబంధిత ప్రభుత్వ అధికారులతో మాట్లాడి, ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పప్పల చలపతిరావు, లాలం భవాని భాస్కర్ , యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ధూళి రంగనాయకులు, టౌన్ ప్రెసిడెంట్ శివ నారాయణమూర్తి, మండల టిడిపి అధ్యక్షులు ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, రాంబిల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ లాలం భరత్, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, పట్టణ కార్యదర్శి ఆడారి ఆదిమూర్తి, దాట్ల వెంకటస్వామి, యలమంచిలి నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనకాపల్లి

“వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరపాలి.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : సీఐ ధనుంజయరావు”

పున్నమి ప్రతినిధి ఆనంద్ – ఎలమంచిలి ఎలమంచిలి మండలంలోని వివిధ గ్రామాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, భద్రతా ప్రమాణాలతో నిర్వహించాలని ఎలమంచిలి సీఐ ఎస్. ధనుంజయరావు సూచించారు. వినాయక విగ్రహాల వద్ద తప్పనిసరిగా తగిన సేఫ్టీ ఎక్విప్‌మెంట్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా తక్కువ శబ్దంతో సౌండ్‌ సిస్టమ్‌ వినియోగించాలని, రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజే బాక్సులు, సౌండ్‌ స్పీకర్లు ఉపయోగించరాదని స్పష్టం చేశారు. నిమజ్జనం సమయంలో కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలకు తావులేకుండా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించి కార్యక్రమాల్లో పాల్గొనడం, అసభ్యకరమైన నృత్యాలు, కార్యకలాపాలకు పాల్పడటం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు.

అనకాపల్లి

పీహెచ్సీ వైద్యాధికారులకు డిజిటల్ హెల్త్ టూల్స్‌పై శిక్షణ..

యలమంచిలి: పున్నమి ప్రతినిధి ఆనంద్ : బహుళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మెరుగైన ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించేందుకు డిజిటల్ హెల్త్ టూల్స్‌ను సమర్థవంతంగా వినియోగించడంపై అనకాపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్టులో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (యమ్ వో యు) ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎంహెచ్ వో డా. అచ్యుతకుమారి సహకారం, మార్గదర్శకత్వంతో సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్ (సిసి డిసి) ఆధ్వర్యంలో శిక్షణ జరిగింది. ఈ శిక్షణలో బహుళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రాథమిక ఆరోగ్య స్థాయిలో సమగ్ర వైద్య సేవలు అందించడంలో డిజిటల్ ఆరోగ్య సాంకేతికతలను ఎలా వినియోగించాలనే అంశాలపై వైద్యాధికారులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (ఇడి యస్ యస్), అసిస్టెడ్ టెలిమెడిసిన్ తదితర డిజిటల్ హెల్త్ విధానాలపై శిక్షణ ఇచ్చారు. రోజువారీ వైద్య సేవల్లో ఈ టూల్స్‌ను ఉపయోగించే విధానం, వాటి ద్వారా రోగులకు నిరంతర వైద్య సేవలు అందించే విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డా. నిఖిల్ ఎస్.వి., సీనియర్ సైంటిస్ట్, డా. బాలాజీ గుమ్మిడి, మేనేజర్ – రీసెర్చ్ & ఆపరేషన్స్, డా. మోనల్, ఎం డి జనరల్ మెడిసిన్, గోపీ, ప్రాజెక్ట్ ఆఫీసర్, కె. శివ ప్రసాద్, రీసెర్చ్ ఫెలోతో పాటు 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యాధికారులు, జిల్లా ఎన్సిడి సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో డిజిటల్ హెల్త్ టెక్నాలజీల వినియోగాన్ని బలోపేతం చేయడం, ముఖ్యంగా బహుళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సమర్థవంతమైన, సమగ్ర, నిరంతర వైద్య సేవలు అందించేలా వైద్యాధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

అనకాపల్లి

రైల్వే స్టేషన్ జంక్షన్‌లో రైల్ ఇంజన్ నమూనా పనులకు శ్రీకారం..

అనకాపల్లి: పున్నమి ప్రతినిధి ఆనంద్ : జీవీఎంసీ 83వ వార్డులోని భీమునిగుమ్మం రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద, రైల్వే స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేయనున్న రైల్ ఇంజన్ నమూనా పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ పాల్గొని జీవీఎంసీ అధికారులకు పలు సూచనలు చేశారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్, 83వ వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్ మంగా ఈశ్వర్, వార్డు టీడీపీ అధ్యక్షుడు రామకృష్ణ, నూకాంబిక దేవస్థానం ధర్మకర్త పొలిమేర ఆనంద్, కోట్ని రామకృష్ణ, తలారి లక్ష్మీప్రసాద్, జిల్లా తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కాయల ప్రసన్న, షేక్ రియాజ్, బూత్ ఇంచార్జ్ సిమిటి రామకృష్ణ, బెల్లాన శ్రీనివాస్, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ భానుచంద్ అఖిల్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

అనకాపల్లి

యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘పరివర్తన’ అవగాహన సదస్సు

యలమంచిలి :పున్నమి ప్రతినిధి ఆనంద్ : ​యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం, అనకాపల్లికి చెందిన సీడ్ అర్గనైజేషన్ వ్యసన విముక్తి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా ‘పరివర్తన’ అనే అవగాహన సదస్సును నిర్వహించారు. ​ఈ సదస్సులో భాగంగా యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండాలని, మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అలాగే డ్రగ్స్ వ్యసనం నుండి బయటపడేందుకు చేపట్టాల్సిన డి-అడిక్షన్ చర్యలు, వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్న సేవలపై సవివరంగా అవగాహన కల్పించారు. ​మత్తు రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ వి. చిట్టిబాబు, డాక్టర్ కె. సుజాతలతో పాటు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనకాపల్లి

30 వేల ఆర్థిక సాయం అండిచిన’మన ధర్మవరం’ గ్రూప్ సభ్యులు,

పున్నమి ప్రతినిధి ఆనంద్ : ​యలమంచిలి : పాముకాటుకు గురై అకాల మరణం చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి స్థానిక యవకులు, స్నేహితులు అండగా నిలిచారు. యలమంచిలిలోని ధర్మవరం వీధికి చెందిన చిక్కాల సురేశ్ సెప్టెంబర్ 6న పాముకాటుకు గురై మృతి చెందారు. కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ‘మన ధర్మవరం’ గ్రూప్ సభ్యులు, స్నేహితులు ముందుకొచ్చారు. ​సభ్యులంతా కలిసి రూ. 30,000 ఆర్థిక సాయాన్ని సేకరించి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టసమయంలో తమవంతు సాయంగా ఈ మొత్తాన్ని సమకూర్చినట్లు గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు కొటారు దుర్గారావు, తాటిపాకల చిన్ని, కన్నూరు శేషు, కొటారు శ్యాము తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.