యలమంచిలి :పున్నమి ప్రతినిధి ఆనంద్ :
యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం, అనకాపల్లికి చెందిన సీడ్ అర్గనైజేషన్ వ్యసన విముక్తి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా ‘పరివర్తన’ అనే అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండాలని, మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అలాగే డ్రగ్స్ వ్యసనం నుండి బయటపడేందుకు చేపట్టాల్సిన డి-అడిక్షన్ చర్యలు, వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్న సేవలపై సవివరంగా అవగాహన కల్పించారు. మత్తు రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ వి. చిట్టిబాబు, డాక్టర్ కె. సుజాతలతో పాటు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


