పున్నమి ప్రతినిధి ఆనంద్ :
యలమంచిలి : పాముకాటుకు గురై అకాల మరణం చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి స్థానిక యవకులు, స్నేహితులు అండగా నిలిచారు. యలమంచిలిలోని ధర్మవరం వీధికి చెందిన చిక్కాల సురేశ్ సెప్టెంబర్ 6న పాముకాటుకు గురై మృతి చెందారు. కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ‘మన ధర్మవరం’ గ్రూప్ సభ్యులు, స్నేహితులు ముందుకొచ్చారు. సభ్యులంతా కలిసి రూ. 30,000 ఆర్థిక సాయాన్ని సేకరించి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టసమయంలో తమవంతు సాయంగా ఈ మొత్తాన్ని సమకూర్చినట్లు గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు కొటారు దుర్గారావు, తాటిపాకల చిన్ని, కన్నూరు శేషు, కొటారు శ్యాము తదితరులు పాల్గొన్నారు.


