Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: ఎలమంచిలి

అనకాపల్లి

ఏటికొప్పాకలో కూటమి విజయకేతనం.. జడ్పీటీసీతో పాటు రెండు ఎంపీటీసీ స్థానాలు సొంతం!

ఏటికొప్పాక గ్రామంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఎంపీటీసీ-1 స్థానంలో టీడీపీ అభ్యర్థి రాయి నాగేశ్వరరావు 19 ఓట్ల మెజారిటీతో, ఎంపీటీసీ-2 స్థానంలో జనసేన అభ్యర్థి అన్నం స్వరాజరావు 140 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎంపీపీ పదవికి టీడీపీ తరఫున పోటీ చేసిన ఇత్తంశెట్టి శ్రీలక్ష్మి 843 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక జడ్పీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థి రావి చలపతి 8,666 ఓట్ల భారీ మెజారిటీతో అఖండ విజయాన్ని నమోదు చేశారు. విజయం అనంతరం గెలుపొందిన అభ్యర్థులు గ్రామ ప్రజలను కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామదేవత శ్రీ బండిమాంబ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తామని హామీ ఇచ్చారు.కూటమి అభ్యర్థుల విజయంతో ఏటికొప్పాకలో కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

అనకాపల్లి

అచ్యుతాపురం జెడ్పీటీసీపై టీడీపీ విజయదుందుభి.. 7,337 ఓట్ల భారీ మెజార్టీతో పీలా హైమవతి తులసీరామ్ ఘన విజయం!

అచ్యుతాపురం జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి పీలా హైమవతి తులసీరామ్ తన ప్రత్యర్థిపై 7,337 ఓట్ల భారీ మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. ఈ భారీ విజయం మండల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఫలితాలు వెలువడగానే టీడీపీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ విజేతకు అభినందనలు తెలిపారు. భారీ మెజార్టీతో ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగిందని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.మండలంలోని గ్రామాల్లో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, రైతులు, మహిళల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు ఆశిస్తున్నారు. పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి పథంలో నడిపించాలని స్థానికులు కోరుతున్నారు.7,337 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన పీలా హైమవతి తులసీరామ్‌కు పలువురు అభినందనలు తెలియజేశారు.

అనకాపల్లి

పేట బయ్యవరం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ ఘన విజయం.. 719 ఓట్ల భారీ మెజార్టీతో యల్లపు లక్ష్మి గెలుపు!

అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం పేట బయ్యవరం ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యల్లపు లక్ష్మి 719 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. యలమంచిలి మండల టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యడ్ల చినబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేసి విజయానికి బాటలు వేశారు. ఈ సందర్భంగా యడ్ల చినబాబు మాట్లాడుతూ.. యల్లపు లక్ష్మికి భారీ విజయాన్ని అందించిన ఓటర్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానుల కృషి మరువలేనిదన్నారు.ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ విజయంతో పేట బయ్యవరంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటూ యల్లపు లక్ష్మికి అభినందనలు తెలిపారు.

అనకాపల్లి

సొంత ఖర్చులతో ప్రధాన రహదారికి మరమ్మతులు.. ప్రజల ఇబ్బందుల తొలగింపునకు పిట్టా శ్రీనివాస్ చొరవ!

యలమంచిలి: యర్రవరం, సింగవరం, ఏఎస్‌ఆర్ కాలనీ, పెద్దపల్లి గ్రామాలకు యలమంచిలి నుంచి రాకపోకలకు అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారికి కౌన్సిలర్ పిట్టా శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. రాత్రి వేళల్లో ప్రయాణించే ప్రజలు, వివిధ కంపెనీలకు వెళ్లి వచ్చే ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా రహదారి పొడవునా పెరిగిన తుప్పలు, లైటింగ్‌కు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ప్రజల సౌకర్యమే లక్ష్యంగా అభివృద్ధికి తొలి అడుగు వేశారు. అదేవిధంగా రాత్రి వేళల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు ఫోకస్ లైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వ్యక్తిగతంగా ముందుకు రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పిట్టా శ్రీనివాస్, జనసేన సీనియర్ నాయకులు గొర్లె సత్తిబాబు, కూటమి సభ్యులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ప్రధాని మోదీకి బహుమతిగా ఏటికొప్పాక లక్క కళాకృతి.. జాతీయస్థాయిలో మెరిసిన స్థానిక కళాకారుడి ప్రతిభ!

జపాన్‌లోని ఐచి–నగోయాలో జరిగిన 5వ ఆసియా పారా గేమ్స్‌లో భారత క్రీడాకారులు 114 పతకాలు సాధించడం దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత క్రీడాకారులకు విందు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆయనకు బహూకరించేందుకు దేశవ్యాప్తంగా సుమారు 100 ప్రత్యేక కళాకృతులు పంపగా, వాటిలో కేవలం ఆరు మాత్రమే ఎంపికయ్యాయి. ఈ ఆరు కళాకృతుల్లో అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకకు చెందిన లక్క కళాకృతి చోటు దక్కించుకోవడం విశేషం. ఏటికొప్పాకకు చెందిన పెదపాటి నాని (పైడికొండ), సత్తిబాబు కుమారుడు ఈ అరుదైన కళాకృతిని రూపొందించారు. ఇందులో వివిధ క్రీడలకు సంబంధించిన ఆటలను సూక్ష్మరూపంలో (మినియేచర్) అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇండియన్ బ్యాడ్మింటన్ కోచ్ శ్రీ మురళీకృష్ణ కోరిక మేరకు, జాతీయ అవార్డు గ్రహీత శ్రీశైలపు చిన్నయాచారి గారి ప్రోత్సాహంతో దీనిని తయారు చేసినట్లు నాని తెలిపారు.ప్రధానికి అందించే బహుమతుల కోసం ఎంపికైన ఆరు కళాకృతుల్లో ఏటికొప్పాక లక్క కళకు చోటు దక్కడం గ్రామానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా మారింది. ఏటికొప్పాక కళా వైభవాన్ని జాతీయస్థాయిలో చాటిన పెదపాటి నానిని గ్రామ ప్రజలు అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అనకాపల్లి

మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం ప్రతినిధి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగం!

అనకాపల్లి జిల్లా గోకివాడ గ్రామానికి చెందిన ద్వారపురెడ్డి నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రస్తుతం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు, అఖిల భారత చిరంజీవి యువత కన్వీనర్‌గా కూడా సేవలందిస్తున్నారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సందేశం ఇచ్చారు.మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా ఓటు వేయడం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అనకాపల్లి

ఓటరు స్లిప్పుల పంపిణీలో నిర్లక్ష్యం.. ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుదిరుగుతున్న ఓటర్లు!

ఓటరు స్లిప్పుల పంపిణీలో నిర్లక్ష్యం.. ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుదిరుగుతున్న ఓటర్లు! అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. పంచాయతీ సిబ్బంది ముందస్తు ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించడంతో పలువురు ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందలేదు. దీంతో పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా వచ్చిన ఓటర్లు స్లిప్పులు లేక ఇబ్బందులు పడుతూ ఓటు వేయకుండానే వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రజలకు కనీస సమాచారం, సహకారం అందకపోవడంపై అసహనం వ్యక్తమవుతోంది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఓటరు స్లిప్పుల పంపిణీ విషయంలో సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం ఎందుకు వహించారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు స్పందించి స్లిప్పులు అందని ఓటర్లకు తగిన సహకారం అందించాలని, ఓటు హక్కు వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఓటర్లు కోరుతున్నారు.

అనకాపల్లి

యలమంచిలి జడ్పీటీసీ బరిలో జనసేన అభ్యర్థి రావి చలపతి.. గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి!

అనకాపల్లి జిల్లా యలమంచిలి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఏటికొప్పాకకు చెందిన రావి చలపతి ఎన్నికల బరిలో నిలిచారు. యలమంచిలి మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజల ముందుకు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, మెరుగైన వైద్య సదుపాయాలు, తాగునీటి వసతి కల్పనకు కృషి చేస్తానని పేర్కొంటున్నారు. ఏటికొప్పాకకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన లక్క బొమ్మల పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడంతో పాటు స్థానిక కళాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, యలమంచిలి మండల అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను ఆదరించి తనకు మద్దతుగా నిలవాలని రావి చలపతి ప్రజలను కోరుతున్నారు.

అనకాపల్లి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ఎంపీటీసీ-2 బరిలో జనసేన అభ్యర్థి అన్నం స్వరజరావు!

ఏటికొప్పాక గ్రామంలో కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ-2 స్థానానికి అన్నం స్వరజరావు పోటీ చేస్తున్నారు. గ్రామ ప్రజల కష్టాలు, సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఏటికొప్పాక అభివృద్ధికి తన వంతు కృషి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం, ప్రజల గొంతుకగా నిలిచే బాధ్యతాయుతమైన ప్రతినిధిగా పనిచేయాలన్నదే తన ఆశయమని పేర్కొంటున్నారు. గ్రామ భవిష్యత్తు, అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన అంశాలుగా తన ఆలోచనలను ప్రజల ముందుంచుతున్నారు. తనకు ఒక అవకాశం కల్పించి ఎంపీటీసీగా సేవ చేసే బాధ్యతను అప్పగించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి సంబంధించి అభ్యర్థి హామీలు, ఆలోచనలను పరిశీలించి ఓటర్లు తమ అమూల్యమైన ఓటుతో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

అనకాపల్లి

ఏటికొప్పాక అభివృద్ధే లక్ష్యంగా బగుడు గోవిందు పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం!

ఏటికొప్పాక గ్రామంలో వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ-2 అభ్యర్థిగా బగుడు గోవిందు పోటీ చేస్తున్నారు. యువ నాయకుడిగా గ్రామ ప్రజల సమస్యలు, స్థానిక అవసరాలపై దృష్టి సారిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతున్నారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచారు. యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, తనకు అవకాశం కల్పించాలని ఓటర్లను కోరుతున్నారు. అభ్యర్థి ఆలోచనలు, గ్రామ అభివృద్ధిపై ఆయన ప్రతిపాదనలను పరిశీలించి ఓటర్లు తమ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.