Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

Punnami Newsroom Published:
నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

Story highlights

  • నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు: రూరల్ సీఐ వెంకటరెడ్డి నెల్లూరు రూరల్, నవంబరు: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో నెల్లూరు రూరల్ మండల పరిధిలోని నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
  • ఈ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రూరల్ సీఐ వెంకటరెడ్డి వెల్లడించారు.శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ..
  • మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆరు ప్రాంతాల్లో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు: రూరల్ సీఐ వెంకటరెడ్డి

నెల్లూరు రూరల్, నవంబరు: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో నెల్లూరు రూరల్ మండల పరిధిలోని నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రూరల్ సీఐ వెంకటరెడ్డి వెల్లడించారు.శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆరు ప్రాంతాల్లో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించవచ్చని వివరించారు.

నామినేషన్ కేంద్రాల వద్ద అనవసరంగా గుమిగూడటం, నినాదాలు చేయడం, వాగ్వాదాలు, ఘర్షణలకు దిగడం వంటి చర్యలకు ఎవరూ పాల్పడరాదని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద ఒక ఎస్‌ఐతో పాటు పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. తాను మరో సీఐతో కలిసి ఆరు కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా సాగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని సీఐ వెంకటరెడ్డి కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *