Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: ఎలమంచిలి

అనకాపల్లి

మరిడిమాంబ అమ్మవారిని దర్శించుకున్న నేతలు

యలమంచిలి మండలం జంపపాలెం గ్రామంలో శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండగ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ గొంతిన వెంకట హరీష్ గారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యలమంచిలి మండల పార్టీ అధ్యక్షులు ఇత్తంశెట్టి నాయుడు గారు, గ్రామ సర్పంచ్ శిల్పరశెట్టి నాయుడు గారు, కర్రీ అప్పన్న గారు, కర్రీ శ్రీను గారు, శిల్పరశెట్టి రామచంద్ర గారు, దాడి లోకేష్ గారు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పండగ మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయ పరిసరాల్లో భక్తులతో సందడి నెలకొంది. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

అనకాపల్లి

సేవలకు వీడ్కోలు.. సత్యనారాయణకు ఘన సత్కారం

మునగపాకలో ఘనంగా పదవీ విరమణ కార్యక్రమం మునగపాక: యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం మునగపాక గ్రామంలో గురువారం జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు గారి భర్త ఆడారి సత్యనారాయణ గారి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సుదీర్ఘకాలం విధుల్లో బాధ్యతాయుతంగా సేవలందించిన సత్యనారాయణ గారిని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందించారు. మాజీ శాసనసభ్యులు శ్రీ పప్పల చలపతిరావు గారు, గొంతిన వెంకట హరీష్ గారు తదితరులు కార్యక్రమానికి హాజరై సత్యనారాయణ గారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో ఆయన అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కుటుంబంతో ఆనందంగా గడుపుతూ సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

టీబీపై పోరులో లైనకొత్తూరు విజయం.. ‘టీబీ ఫ్రీ’ బ్లాక్‌గా ఎంపిక

యలమంచిలి మండలంలోని లైనకొత్తూరు గ్రామపంచాయతీ టీబీ రహిత ప్రాంతంగా (TB Free Block) ఎంపికైంది. 2030 నాటికి దేశంలో టీబీని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా లైనకొత్తూరుకు ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా యలమంచిలి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీవో, రేగుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి, ఏఓ శ్రీనివాసరావు చేతుల మీదుగా టీబీ ఫ్రీ అవార్డును అందజేశారు. గ్రామస్థాయిలో టీబీ కేసులను ముందుగానే గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం, బాధితులకు నిరంతరం చికిత్స అందించడం వంటి చర్యలతో ఈ గుర్తింపు సాధ్యమైందని అధికారులు తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీని టీబీ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డీవై ఎంపీడీవో అనంతనాగు, పంచాయతీ కార్యదర్శి గిరిప్రసాద్, టీబీ సూపర్‌వైజర్ సత్యనారాయణ, రాధిక, ఎంఎల్‌హెచ్‌పీ ఝాన్సీరాణి, ఏఎన్‌ఎం కుమారి, ఆశా కార్యకర్తలు లక్ష్మీ, రమణకుమారి పాల్గొన్నారు.

అనకాపల్లి

మూలజంపలో రూ.14 లక్షలతో సీసీ రోడ్డు.. శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

రాంబిల్లి మండలం మూలజంప గ్రామంలో పల్లె పండగ 3.0లో భాగంగా శివాలయానికి వెళ్లే సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. సుమారు రూ.14 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ రోడ్డు నిర్మాణంతో శివాలయానికి వెళ్లే భక్తులతో పాటు గ్రామస్థుల రాకపోకలకు మరింత సౌకర్యం కలగనుంది. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన రహదారులు, ఇతర మౌలిక వసతులను దశలవారీగా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాంబిల్లి మండల టీడీపీ మాజీ అధ్యక్షులు వసంతవాడ దిన్ బాబు, జనసేన మండల అధ్యక్షులు పప్పల నూకన్నదొర, బీజేపీ మండల అధ్యక్షులు కారే దేవుడు, గోవిందరెడ్డి, మూలజంప మాజీ సర్పంచ్ వేగిరాము, యూనిట్ ఇన్‌చార్జ్ అందుకూరి ప్రసాద్, వేగి నాయుడు, శ్రీను, సత్యరావు, నూకరాజు, జనసేన నాయకులు షేక్ నాగూర్, పండూరి రాజు, పంచాయతీ కార్యదర్శి దొరబాబు, వీఆర్పీ పిల్లా రూప, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

అనకాపల్లి

బైక్ చోరీ కేసును ఛేదించిన టౌన్ పోలీసులు

ఇద్దరు నిందితుల అరెస్ట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ స్వాధీనం అనకాపల్లి పట్టణంలో జరిగిన బైక్ చోరీ కేసును టౌన్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, చోరీకి గురైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు సీఐ జి.ప్రేమ్ కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ ఎ.వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. గత సెప్టెంబర్ 21న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వెనుక పార్క్ చేసిన AP39 QY 5309 నంబర్ గల క్రోమ్ రెడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను సిద్ధాంతపు హరీష్ అలియాస్ హనోక్ (24), పెద్దసింగ్ రేవంత్ అలియాస్ సాయి (22) చోరీ చేసినట్లు గుర్తించారు. బుధవారం విశ్వసనీయ సమాచారంతో కొత్తూరు జంక్షన్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన ఎస్ఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

అనకాపల్లి

ముదిరిన నారుతో నాట్లు.. రైతులకు అధికారుల సూచనలు

యలమంచిలి మండలంలో ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు నిండడంతో రైతులు సాగు పనులను వేగవంతం చేశారు. పులపర్తి గ్రామంలో మల్లపరెడ్డి గోవింద్ పొలంలో వరి నాట్లు వేసే విధానాన్ని మండల వ్యవసాయ అధికారి మోహన్‌రావు పరిశీలించారు. సుమారు 65 రోజుల ముదిరిన నారును నాటే సమయంలో మొక్కలను దగ్గరగా నాటుకోవాలని సూచించారు. ఎకరాకు అదనంగా 25 కిలోల యూరియా వినియోగించాలని తెలిపారు. దోమ, పొడ తెగుళ్ల నివారణకు ఎసిఫేట్, హెక్సాకొనజోల్ మందులను ప్రాథమిక దశలోనే పిచికారీ చేయాలన్నారు. పంట వేయని భూముల్లో రాగులు, జనుము, ఉలవల విత్తనాలను 80 శాతం రాయితీపై రైతు సేవా కేంద్రాల్లో అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకురాలు హేమ, ఏపీ సీ.ఎన్.ఎఫ్ సిబ్బంది వనజ, నాయుడు పాల్గొన్నారు.

అనకాపల్లి

పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

పల్లె పండుగ 3.0′ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం యలమంచిలి మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మండలంలోని 11 గ్రామ పంచాయతీల పరిధిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణానికి గానూ మొత్తం 40 అభివృద్ధి పనులు మంజూరయ్యాయని తెలిపారు. వీటి నిర్మాణానికి రూ. 3.82 కోట్ల అంచనా వ్యయాన్ని కేటాయించినట్లు వెల్లడించారు. ​గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం వల్ల ప్రజల రవాణా కష్టాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు. పల్లెల్లో అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా సమకూరుస్తూ, గ్రామాల సర్వాంగీణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు మరియు కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అనకాపల్లి

​కొత్తూరు గ్రామంలో బిన్ బ్యాగ్ నిర్వహణపై ఆకస్మిక తనిఖీ నిర్వహించిన అధికారులు

యలమంచిలి మండలంలోని కొత్తూరు గ్రామంలో బిన్ బ్యాగ్ నిర్వహణ తీరుపై మంగళవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎంపీడీఓ (ఎఫ్ఎసీ) వి.దీపిక, పంచాయతీ విస్తరణ అధికారి గిరిప్రసాద్‌ ల ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో ఇంటింటికీ తిరిగి బిన్ బ్యాగ్ విధానం అమలు అమలవుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ​ఈ సందర్భంగా పలువురు గృహ యజమానులతో మాట్లాడి చెత్త సేకరణ, నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులు బిన్ బ్యాగ్ విధానాన్ని క్రమం తప్పకుండా పాటిస్తుండటంపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ​ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాస్, స్థానిక సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అనకాపల్లి

ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జనవాణి కార్యక్రమం..

యలమంచిలి :ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ‘జనవాణి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ప్రజల నుంచి నేరుగా వినతులు, అర్జీలను స్వీకరించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల అర్జీలపై తక్షణమే స్పందించిన ఆయన, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

అనకాపల్లి

వైఎస్సార్ కార్డుల పంపిణీలో రాజాన సంజీవ్, మాసవరపు కాసుబాబు

అచ్యుతాపురం, అక్టోబర్ 7: అచ్యుతాపురం మండలం వైఎస్సార్ నగర్ పూడి కాలనీలో బుధవారం వైఎస్సార్ కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆదేశాల మేరకు పార్టీ నేతలు దేశం శెట్టి శంకర్రావు, లాలం రాంబాబు, కోనా బుజ్జి ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలు, సంక్షేమ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని వైఎస్సార్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజాన సంజీవ్, యూత్ ప్రెసిడెంట్ మాసవరపు కాసుబాబు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఐక్యంగా, చురుగ్గా పనిచేయాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.