Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Anakapalli

బైక్ చోరీ కేసును ఛేదించిన టౌన్ పోలీసులు

Punnami Newsroom Published: Updated:
బైక్ చోరీ కేసును ఛేదించిన టౌన్ పోలీసులు

Story highlights

  • ఇద్దరు నిందితుల అరెస్ట్..
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ స్వాధీనం అనకాపల్లి పట్టణంలో జరిగిన బైక్ చోరీ కేసును టౌన్ పోలీసులు ఛేదించారు.
  • ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, చోరీకి గురైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు నిందితుల అరెస్ట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ స్వాధీనం

అనకాపల్లి పట్టణంలో జరిగిన బైక్ చోరీ కేసును టౌన్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, చోరీకి గురైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు సీఐ జి.ప్రేమ్ కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ ఎ.వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. గత సెప్టెంబర్ 21న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వెనుక పార్క్ చేసిన AP39 QY 5309 నంబర్ గల క్రోమ్ రెడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను సిద్ధాంతపు హరీష్ అలియాస్ హనోక్ (24), పెద్దసింగ్ రేవంత్ అలియాస్ సాయి (22) చోరీ చేసినట్లు గుర్తించారు. బుధవారం విశ్వసనీయ సమాచారంతో కొత్తూరు జంక్షన్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన ఎస్ఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *