Saturday, 12 September 2026

Tag: భక్తి

నంద్యాల

మట్టి వినాయకుని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: DYFI

నంద్యాల: పర్యావరణ పరిరక్షణ, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 14న జరుపుకునే వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని DYFI నంద్యాల పట్టణ కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో డాక్టర్ కార్తికేయన్ చేతుల మీదుగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. రసాయనాలతో తయారుచేసే విగ్రహాల వల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని, అందుకే భక్తిశ్రద్ధలతో మట్టి విగ్రహాలను పూజించాలని డాక్టర్ కార్తికేయన్, DYFI పట్టణ కార్యదర్శి శివ సూచించారు.పండుగ ఐదు రోజులు వార్డుల్లో ఉత్సాహంగా సేవా కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు నీటి సదుపాయం, నిమజ్జన ఏర్పాట్లు మరియు భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో DYFI సహాయ కార్యదర్శి సాయి, నాయకులు తేజ, హరీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణకు బాల అకాడమీ విద్యార్థుల ప్రతిజ్ఞ

నంద్యాల: పర్యావరణహితంగా వినాయక చవితిని జరుపుకోవాలనే సందేశంతో బాల అకాడమీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యావరణ ఇంజనీర్ పి.వి. కిషోర్ రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధి రామకృష్ణ, ప్రిన్సిపాల్ మాధవి లత హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి, పర్యావరణాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, రసాయన రంగుల వల్ల నీరు, జలచరాలు కలుషితమవుతాయని, ప్రతీ ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని అధికారులు అవగాహన కల్పించారు. చిన్నతనం నుంచే పర్యావరణ స్పృహ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. “మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే సందేశంతో ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా ముగిసింది.

నంద్యాల

మట్టి వినాయకుల ఉచిత పంపిణీ : గోళ్ళ రాజేష్

నంద్యాల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితిని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ళ రాజేష్ 3,000 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు కల్పనా సెంటర్‌లోని టెక్కె మార్కెట్ యార్డ్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతాయని, ప్రతీ ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని గోళ్ళ రాజేష్ పిలుపునిచ్చారు. గత రెండేళ్లుగా వడ్డీ లేని రుణాలు అందించడమే కాకుండా, సర్వమత ప్రార్థనా మందిరాల అభివృద్ధికి సాయం అందిస్తున్న ఆయన సేవలను పలువురు అభినందించారు.

నంద్యాల

నంద్యాల: మస్జిద్-ఎ-రసూల్‌లో అలరించిన 14వ ఉర్దూ సాహిత్య కవి సమ్మేళనం

నంద్యాల: మస్జిద్-ఎ-రసూల్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన 14వ నాతియా ముషాయిరా ఉర్దూ ప్రియులను విశేషంగా అలరించింది. రాష్ట్ర ఇత్తేహాదుల్ ఉలమా వల్ ఐయిమా ఇమాముల సంఘం ఆధ్వర్యంలో, హాఫీజ్ ముహమ్మద్ సలీం పర్వేజ్ అధ్యక్షతన ఈ కవి సమ్మేళనం జరిగింది.ఈ కార్యక్రమానికి ముంబై, హైదరాబాద్, యూపీ తదితర ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రముఖ జాతీయ స్థాయి ఉర్దూ కవులు ప్రవక్త ముహమ్మద్ (స) గుణగణాలు, జీవిత ఘట్టాలను తమ మధుర స్వరంతో గానం చేశారు. అనంతరం పాల్గొన్న కవులను శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఉర్దూ భాషా ప్రోత్సాహానికి ప్రతి ఏటా ఈ ముషాయిరా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

నంద్యాల

మహానందీశ్వరుని సేవలో ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్

మహానంది:నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరీ దేవీ సమేత మహానందీశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. అనంతరం వేదపండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు. శ్రీకాంత్‌ను చూసేందుకు స్థానికులు, అభిమానులు పోటీపడ్డారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా శ్రీకాంత్ పేర్కొన్నారు.

నంద్యాల

మహానందీశ్వరుని సేవలో రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము (IAS)

మహానంది:నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరీ దేవీ సమేత మహానందీశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము (IAS) దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. అనంతరం వేదపండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు. ఆలయ ప్రాశస్త్యాన్ని, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులు ఆయనకు వివరించారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

నంద్యాల

అచీవర్స్ స్కూల్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

నంద్యాల: స్థానిక అచీవర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ అపుస్మా యూనిట్ ప్రెసిడెంట్ టి. అమీర్ భాషా హాజరై, శ్రీకృష్ణుడి జీవితం, ఆయన బోధించిన నీతి, ధర్మాలు విద్యార్థులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.పాఠశాల కరస్పాండెంట్ వై. శ్రీనివాస్, ప్రిన్సిపల్ ఎం.పీ. లావణ్య, డైరెక్టర్ ఈశ్వర్ చంద్ర, ఏఓ మానస మాట్లాడూతూ.. విద్యార్థులు చదువుతో పాటు ధైర్యం, సమయస్ఫూర్తి, మానవత్వం వంటి ఉత్తమ గుణాలను అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధికల వేషధారణలతో అలరించగా, కృష్ణుడి జీవిత విశేషాలపై ప్రదర్శించిన స్కిట్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో స్కూల్ ప్రెసిడెంట్ వరలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నంద్యాల

15 వేల గాజులతో కామేశ్వరీ అమ్మవారికి వైభవంగా పూజలు

మహానంది: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరీ అమ్మవారికి శ్రావణమాస నాలుగో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లోకకళ్యాణార్థం అమ్మవారిని ఏకంగా 15 వేల గాజులతో సుందరంగా అలంకరించారు.ఈ గాజుల అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయ వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, మంగళహారతులు సమర్పించారు. శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కామేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నంద్యాల

6గాజుల అలంకారంలో శ్రీ కామేశ్వరీ అమ్మవారు: ‘శ్రీదేవి సేవా సంఘం’ విశేష సేవలు

మహానంది పుణ్యక్షేత్రంలో రేపు 4వ శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ కామేశ్వరీ అమ్మవారికి అత్యంత వైభవంగా గాజుల అలంకారాన్ని నిర్వహించనున్నారు. ఈ పూజకు అవసరమైన పూలమాలలను తయారు చేసేందుకు ‘శ్రీదేవి సేవా సంఘం’ నుండి 40 మందికి పైగా సేవకులు విచ్చేసి అమ్మవారి సేవలో భాగస్వాములవుతున్నారు. భక్తిశ్రద్ధలతో సేవకులు తయారు చేసిన విశేష మాలలతో అమ్మవారిని అలంకరించనుండటంతో, ఆలయంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ భక్తులను కోరింది.

నంద్యాల

అర్చకుడి గృహప్రవేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి

పాణ్యం మండలం ఎస్. కొత్తూరు ఆలయ అర్చకులు నారాయణ శర్మ నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ శుభకార్యక్రమానికి నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అర్చకుడి కుటుంబ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన గృహంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం నారాయణ శర్మ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.