Wednesday, 9 September 2026

Tag: ప్రవేటు కార్యక్రమం

ఖమ్మం

చదువుల తల్లి సాయి నందినికి అభినందనల వెల్లువ

పెనుబల్లి/ ఖమ్మం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండలపాడు గ్రామానికి చెందిన పడిగల మధు లక్ష్మి దంపతుల మూడో కుమార్తె సాయి నందిని MBBSలో ఉచిత సీటు సాధించడంతో గ్రామంలో అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు సాయి నందినిని కలిసి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఓరుగంటి రాము (బీజేపీ), ఓరుగంటి కిట్టు (తెలుగుదేశం), బి. మెహన్ రావు, బి. సత్యనారాయణ, బి. పుల్లారావు (కాంగ్రెస్), బి. మనోజ్, బి. హరి (వైసీపీ) పాల్గొని సాయి నందినికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె విజయం గ్రామంలోని విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఖమ్మం

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భముగా ప్రత్యేక కథనం

గురువే దేశ భవిష్యత్తుకు దిక్సూచి భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఈ రోజు భారత తొలి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించబడుతుంది. 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించిన రాధాకృష్ణన్ చిన్ననాటి నుంచే చదువుపై ఎంతో ఆసక్తి కనబరిచారు. తత్వశాస్త్రాన్ని అభ్యసించి, ఆ రంగంలో విశేషమైన పాండిత్యాన్ని సంపాదించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల, మైసూరు విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో అధ్యాపకుడిగా సేవలందించారు. అనంతరం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కూడా భారతీయ తత్వశాస్త్రాన్ని బోధించారు. విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, ఆలోచించే శక్తిని పెంపొందించడమే నిజమైన విద్య అని ఆయన విశ్వసించారు. 1962లో ఆయన భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలన్న తన విద్యార్థులు, అభిమానుల కోరికను గౌరవిస్తూ ఈ రోజును గురువులకు అంకితం చేశారు. గురువు సమాజానికి జ్ఞానాన్ని అందించే మార్గదర్శి. అందుకే డాక్టర్ రాధాకృష్ణన్ జీవితం, నేటి తరానికి కూడా ఆదర్శప్రాయమే… ఉపధ్యాయులకి ఉపాధ్యాయ దినోత్సవ. శుభాకాంక్షలు.

ఖమ్మం

కృష్ణాష్టమి వేడుకల్లో చిన్నారుల సందడి.. భక్తిసంద్రంగా ఎస్‌జేఎస్‌ హైస్కూల్

ఖమ్మం నగరము లోని శ్రీ జయ శ్లోక (SJS) హైస్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణతో అలంకరించి తీసుకురావడంతో పాఠశాల ప్రాంగణం కనువిందు చేసింది. బలి చక్రవర్తి–వామనుని వృత్తాంతంపై నిర్వహించిన స్కిట్, ద్వారకలో చిన్ని కృష్ణుడు చేసిన చిలిపి చేష్టలను రూపకంగా ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు ఉత్సాహాన్ని నింపగా, ‘జై శ్రీకృష్ణ’ నామస్మరణతో పాఠశాల ఆవరణ భక్తిసంద్రంగా మారింది. పేరెంట్స్ సైతం పాటలు పాడి అలరించగా, వారికి నిర్వహించిన ఫన్‌ గేమ్స్‌ సందడిని పెంచాయి. స్కూల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా పేరెంట్స్‌ మాట్లాడుతూ సంప్రదాయ విలువలను కాపాడుతూ, పిల్లల్లో సంస్కృతి పట్ల అవగాహన కల్పిస్తున్న శ్రీ జయ శ్లోక స్కూల్‌ను అభినందించారు. స్కూల్ ప్రిన్సిపాల్ షిఫాలీ జగదీష్ శర్మ మాట్లాడుతూ, పాఠశాల ప్రాంగణం ఈరోజు ద్వారక, బృందావనాలను తలపిస్తోందన్నారు. బొమ్మలకొలువు, బృందావనం సెట్టింగ్స్‌తో శ్రీకృష్ణుడిని పాఠశాలకు రప్పించిన అనుభూతి కలిగిందన్నారు. కాళీయ మర్ధనం కథ ద్వారా అహంకారం పనికిరాదని, అమ్మ ప్రేమ వెలకట్టలేనిదని వివరించారు. ప్రతి ఒక్కరిపై శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు.

ఖమ్మం

చదువుల తల్లి పడిగల సాయి నందిని..

పెనుబల్లి/ ఖమ్మం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండలపాడు గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పడిగల మధు లక్ష్మి దంపతుల మూడో కుమార్తె సాయి నందిని చదువుల్లో ప్రతిభను చాటుకుని మెడికల్ సీటు సాధించింది. చిన్నప్పటి నుంచే చదువుల్లో ప్రతిభ కనబరుస్తూ ప్రతి తరగతిలోనూ ప్రథమ స్థానంలో నిలుస్తూ వచ్చిన సాయి నందిని, పదో తరగతిని వంగముత్యాల బంజర్ అరుణోదయ స్కూల్‌లో పూర్తి చేసి 10కి 10 పాయింట్లు సాధించింది. అనంతరం హైదరాబాద్ హైటెక్ సిటీలోని నారాయణ మెడికల్ అకాడమీలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి 1000 మార్కులకు 987 మార్కులు సాధించింది. అనంతరం ప్రతిష్టాత్మక వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌లో 6118 ర్యాంక్ సాధించి తన ప్రతిభను మరోసారి నిరూపించుకుంది. ఈ ఘన విజయంతో కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించింది. సాయి నందిని పట్టుదల, కృషి, చదువుపై ఉన్న ఆసక్తి కారణంగానే ఈ విజయాన్ని అందుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి పోటీలో మెరుగైన ర్యాంక్ సాధించి ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందడం పట్ల మండలపాడు గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ సాయి నందినికి అభినందనలు తెలిపారు.

ఖమ్మం

హార్వెస్ట్ పాఠశాల లో చిన్నారుల సందడితో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ఖమ్మం హార్వెస్ట్ ప్రైమరీ పాఠశాలలో చిన్నారులచే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల సెక్రటరీ, కరస్పాండెంట్ పి. రవిమారుత్, ప్రిన్సిపల్ ఆర్. పార్వతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాలను వివిధ రకాల పూలమాలలతో అలంకరించి పండుగ వాతావరణంలో వేడుకలకు శ్రీకారం చుట్టారు. శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారులు అలరించారు. పాఠశాల మైదానంలో ఉట్టి ఏర్పాటు చేసి ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. సంప్రదాయ వేషధారణలో చిన్నారులు చూపిన సందడి ఆకట్టుకుంది. విద్యార్థుల్లో ఆసక్తి, ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఆయా సందర్భాలకు అనుగుణంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ పార్వతి రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రైమరీ హెచ్‌ఎం మానస, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ఖమ్మం

రూగ్వేదం పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ఖమ్మం నగరంలోని చెరువు బజార్‌లో గల రూగ్వేదం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో అలరించారు. పాఠశాల ఆవరణలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాఠశాల అధ్యక్షుడు భాను ప్రకాష్ బొర్రా, డైరెక్టర్ సుకృతి బొప్పిశెట్టి, కరస్పాండెంట్ డాక్టర్ లక్ష్మి ఆకుల, ప్రధానోపాధ్యాయురాలు షేక్ నజీమా, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారులు శ్రీకృష్ణుడి బాల్యలీలలను ప్రదర్శించి అందరినీ అలరించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు కృష్ణాష్టమి విశిష్టతను వివరించింది. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.

ఖమ్మం

ఖమ్మం పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ఖమ్మం రోటరీ నగర్‌లోని ఖమ్మం పబ్లిక్ స్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలను భక్తిశ్రద్ధలతో జరిపారు. విద్యార్థినీ, విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలతో అలరించారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, వేషధారణలు ఆకట్టుకున్నాయి. వేడుకల సందర్భంగా పాఠశాల ఆవరణ సందడిగా మారింది. సంప్రదాయ పండుగల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.