తిరుపతి ఆగస్టు 16 పున్నమి ప్రతినిధి
రాయలసీమ విద్యా సంస్థల ఫౌండర్ వై.కొండారెడ్డి ఆకస్మిక మృతి చెందారు. ఆ విషయం తెలుసుకున్న చంద్రగిరి నియోజక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆదివారం ఆయన పార్థివ దేహానికి ఘన నివాళి అర్పించారు. ఎందరో పేద విద్యార్థుల కలలు సాకారం చేయడానికి గత 40 ఏళ్లుగా రాయలసీమ విద్యా సంస్థలను నడిపిన కొండారెడ్డి మరణం విద్యార్థి లోకానికి తీరని లోటన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భగవంతున్ని ప్రార్థించారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.




