Friday, 4 September 2026

Tag: కలెక్టర్

నంద్యాల

ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తే సహించేది లేదు: వీఆర్‌ఓను సస్పెండ్ చేసిన జేసీ సూరజ్ ధనుంజయ్

నంద్యాల : ప్రభుత్వ భూములు, గ్రామకంఠం, పోరంబోకు స్థలాల అక్రమ రిజిస్ట్రేషన్లపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. విధుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన వీఆర్‌ఓ మల్లారెడ్డిని సస్పెండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు.ప్యాపిలి మండలం మాధవరం గ్రామంలోని సర్వే నంబర్ 507లోని ప్రభుత్వ పోరంబోకు భూమిని ఎలాంటి సరైన ఆధారాలు లేకుండా ఇతరుల పేర్లకు మార్చినట్లు వచ్చిన ఫిర్యాదుపై జేసీ విచారణ చేపట్టారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో, ప్రస్తుతం డోన్-1 క్లస్టర్ వీఆర్‌ఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మల్లారెడ్డిని సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణలో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని జేసీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

నంద్యాల

మూడో రోజుకు చేరిన ఉద్యోగుల నిరసన.. కలెక్టరేట్ వద్ద ‘లంచ్ అవర్’ ధర్నా

నంద్యాల : ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీజేఏసీ అమరావతి ఇచ్చిన పిలుపులో భాగంగా నంద్యాల జిల్లాలో మూడో రోజు కూడా నిరసనలు హోరెత్తాయి. పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు ‘హ్యాండ్ టు హ్యాండ్’ ప్రచారం నిర్వహిస్తూ ఉద్యమ కార్యాచరణను వివరించారు.అనంతరం నంద్యాల కలెక్టరేట్‌తో పాటు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల (RDO) వద్ద ఉద్యోగులు భారీ ఎత్తున ‘లంచ్ అవర్’ నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు తేలేంత వరకు శాంతియుత, ప్రజాస్వామ్య పద్ధతిలో ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని ఏపీజేఏసీ సంఘ నాయకులు స్పష్టం చేశారు.

నంద్యాల

నిర్ణీత గడువులోగా ఎస్‌ఐఆర్‌ సవరణలు పూర్తి: జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా

నంద్యాల జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు లోబడి నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి గణియా తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు.జిల్లాలో ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ఇప్పటికే 85 శాతం పూర్తయిందని, మిగిలిన పనిని ఈ వారంలోనే ముగిస్తామని చెప్పారు. ఫారమ్‌లు 6, 7, 8లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సుమారు 14 వేల దరఖాస్తులను, ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం-6 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే బిఎల్‌ఓ కాల్‌బుక్, ఎన్‌జీఎస్‌పీ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పూర్తిస్థాయి పారదర్శకమైన తుది ఓటర్ల జాబితాను రూపొందిస్తామని స్పష్టం చేశారు.

నంద్యాల

ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత పెంచాలి: నంద్యాల కలెక్టర్ రాజకుమారి

నంద్యాల :ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించి, అర్జీదారుల్లో సంతృప్తి స్థాయిని పెంచాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం అనంతరం వివిధ అంశాలపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు.అర్జీదారులను నేరుగా కార్యాలయానికి పిలిపించి సమస్యలు పరిష్కరించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని, ముఖ్యంగా ఆర్‌ఓఆర్‌ (ROR) అంశాల్లో పురోగతి సాధించాలని సూచించారు. త్వరలో ముఖ్యమంత్రితో కలెక్టర్ల సదస్సు జరగనున్న నేపథ్యంలో 39 కీలక పనితీరు సూచికలను (KPIs) వెంటనే అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.అలాగే, అధికారులు మరియు సిబ్బంది పెండింగ్‌లో ఉన్న ఐ-గాట్ (i-GOT) కోర్సులను వెంటనే పూర్తి చేయాలని, జిల్లాలో అమలుచేసే ఉత్తమ విధానాలపై నివేదికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ‘నెలలో నాలుగు పర్యటనలు’ కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు మండలాల్లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో రామునాయక్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నంద్యాల

నంద్యాల కలెక్టరేట్‌లో PGRS సమీక్ష: ‘రీఓపెన్‌’ అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం

నంద్యాల :ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా స్వీకరించే అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని, అవి మళ్లీ ‘రీఓపెన్‌’ కాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పిజిఆర్‌ఎస్ అనంతరం అధికారులతో ఆమె ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన 5,513 రీఓపెన్‌ అర్జీలలో ఇప్పటికే 5,444 అర్జీలను పరిష్కరించామని, మిగిలిన 69 దరఖాస్తులను కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల్లోనే రీఓపెన్‌ అర్జీలు ఎక్కువగా ఉన్నందున ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ క్లినిక్స్‌ ద్వారా 137 భూ సమస్యల అర్జీలు రాగా, సోమవారం పిజిఆర్‌ఎస్‌లో మొత్తం 272 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ రామునాయక్‌, నోడల్‌ అధికారి ఉమామహేశ్వరి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నంద్యాల

ప్రజల చెంతకే పాలన: కలెక్టర్ రాజకుమారి గణియా

పాములపాడు :ప్రజలు జిల్లా కేంద్రానికి రానవసరం లేకుండా నియోజకవర్గ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. “వన్ మంత్–ఫోర్ విజిట్స్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పాములపాడు ఎంపీడీవో కార్యాలయంలో పాములపాడు, కొత్తపల్లి మండలాల ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. జయసూర్య, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి 15 రోజుల్లో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. భూ సమస్యలు, రీ-సర్వే, పింఛన్లు, తాగునీరు, గృహ నిర్మాణం, NH-340C భూసేకరణ నష్టపరిహారం సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జయసూర్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నంద్యాల

రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి: జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్

నంద్యాల:జిల్లాలో రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో 22-A జాబితా సవరణలు, రీ–సర్వే, డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, మ్యుటేషన్లపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, సర్వే అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. 5వ విడత రీ–సర్వేలో గ్రౌండ్ ట్రూథింగ్ (GT) పనులను ఆగస్టు 31 నాటికి, నిలిచిపోయిన DLR పనులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిఫెక్టెడ్ గ్రామాల్లో రీ–సర్వేను వేగవంతం చేసేందుకు తహశీల్దార్లు, సర్వేయర్లకు వర్చువల్ విధానంలో ఓరియంటేషన్ నిర్వహిస్తామన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా నివేదికలను మండల స్థాయి నుంచే జాయింట్ కలెక్టర్‌ కార్యాలయానికి పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నంద్యాల

రేపు పాములపాడులో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

నంద్యాల :ప్రజా సమస్యల క్షేత్రస్థాయి పరిష్కారం కోసం చేపట్టిన ‘వన్ మంత్‌–ఫోర్‌ విజిట్‌’లో భాగంగా ఈ నెల 28న పాములపాడు ఎంపీడీవో కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే జి. జయసూర్య పాల్గొని, పాములపాడు, కొత్తపల్లె మండలాల ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి పనులపై వచ్చే అర్జీలను జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించి పరిష్కరిస్తారని పేర్కొన్నారు. రెండు మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

నంద్యాల

అర్జీల పరిష్కారంలో ఆలస్యం వద్దు: కలెక్టర్ జి. రాజకుమారి గనియా

నంద్యాల:ప్రజా పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ… జిల్లాలో 4,543 పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండటంపై, 76 అర్జీలు పునరుద్ధరణ (రీ-ఓపెన్) కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఆత్మకూరు పరిధిలో 527, నంద్యాల పరిధిలో 591 రీ-ఓపెన్ అర్జీలు ఉన్నాయని, అధికారుల నుంచి సమగ్ర సమాధానం రాకపోవడం వల్లే ఇవి తిరిగి వస్తున్నాయని స్పష్టం చేశారు. వచ్చే వారంలోగా పెండింగ్ అర్జీలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని సూచించారు.అలాగే భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ‘రెవెన్యూ క్లినిక్స్’ ద్వారా 160 దరఖాస్తులు అందాయని, వాటిని కూడా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నంద్యాల

జలధార’ పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో చేపడుతున్న జలధార–జలహారతి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు, నంద్యాల, బండి ఆత్మకూరు, గోస్పాడు, మిత్తూర్ మండలాల్లో పనుల పురోగతి మందగించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రెండో విడత పనుల ఫొటోలను వెంటనే యాప్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.