నంద్యాల : పిజిఆర్ఎస్లో పెండింగ్లో ఉన్న ప్రజా అర్జీలను వెంటనే పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ అధికారులను ఆదేశించారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి దరఖాస్తుపై తీసుకున్న చర్యలను పిజిఆర్ఎస్లో సక్రమంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జేసీ, పిజిఆర్ఎస్ ద్వారా 299 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అధికారుల లాగిన్లలో పరిశీలించని 135 అర్జీలను వెంటనే ఓపెన్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. రీఓపెన్ అయిన 13 అర్జీలను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 158 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. భూ సమస్యలు, అడంగల్ సవరణలు, అసైన్డ్ భూములు, సర్వే తదితర అంశాలపై వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత శాఖల సమన్వయంతో సత్వరమే పరిష్కరించాలని జేసీ ఆదేశించారు.
కార్యక్రమంలో డీఆర్వో రాము నాయక్, పిజిఆర్ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, ఆర్డీఓ విశ్వనాథ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజా అర్జీలకు సత్వర పరిష్కారం పెండింగ్ అర్జీలను వెంటనే పరిష్కరించాలి: జేసీ
నంద్యాల : పిజిఆర్ఎస్లో పెండింగ్లో ఉన్న ప్రజా అర్జీలను వెంటనే పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ అధికారులను ఆదేశించారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి దరఖాస్తుపై తీసుకున్న చర్యలను పిజిఆర్ఎస్లో సక్రమంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జేసీ, పిజిఆర్ఎస్ ద్వారా 299 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అధికారుల లాగిన్లలో పరిశీలించని 135 అర్జీలను వెంటనే ఓపెన్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. రీఓపెన్ అయిన 13 అర్జీలను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 158 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. భూ సమస్యలు, అడంగల్ సవరణలు, అసైన్డ్ భూములు, సర్వే తదితర అంశాలపై వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత శాఖల సమన్వయంతో సత్వరమే పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో రాము నాయక్, పిజిఆర్ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, ఆర్డీఓ విశ్వనాథ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

