అనకాపల్లి
పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : యలమంచిలి :జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని యలమంచిలి నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో అచ్యుతాపురం నుంచి యలమంచిలి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అచ్యుతాపురంలోని ఎమ్మెల్యే నివాసం నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీలో యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ యలమంచిలి గుర్రప్ప కల్యాణ మండపానికి చేరుకున్నారు. అనంతరం గుర్రప్ప కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, జనసైనికులు కలిసి పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ యువజన విభాగం నూతన లోగోతో పాటు ప్రత్యేక గీతాన్ని కూడా పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఎన్ డిఏ ప్రభుత్వం అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను అందించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. గోదావరి జలాలు జిల్లాకు రావడంతో పండగ వాతావరణం నెలకొందని తెలిపారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. అభివృద్ధి, సంపద సృష్టి ఎన్ డిఏ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో యలమంచిలి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ తెలిపారు. నియోజకవర్గాన్ని సుమారు రూ.1,500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం తదితర రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజాన శేషు, యలమంచిలి టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు బొద్దపు శ్రీనివాసరావు, కర్రీ ఝాన్సీ, రమేష్ నాయుడు, లాలం సోమనాయుడు, లోవరాజు, గోపి, కొఠారు నరేష్, భాస్కర్, చిరంజీవి, పల్లా సత్యనారాయణ, రాంబిల్లి మండలశాఖ అధ్యక్షుడు పప్పల నూకన్నదొర, నాయకులు, వీర మహిళలు, జనసైనికులు తదురులు పాల్గొన్నారు.