Friday, 10 July 2026
  • Home  
  • నూతన బాధ్యతలు చేపట్టిన రాజిరెడ్డి, గజ్జల రాజుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం
- రాజన్న సిరిసిల్ల

నూతన బాధ్యతలు చేపట్టిన రాజిరెడ్డి, గజ్జల రాజుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా పున్నమి ప్రతినిధి ముస్తాబాద్, జూలై 6: ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఆత్మ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కొండం రాజిరెడ్డి, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన గజ్జల రాజులను రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు కనిమేని చక్రధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లా బాల్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నరేష్, మధు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, మహేందర్తో పాటు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొని రాజిరెడ్డి, గజ్జల రాజులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా పున్నమి ప్రతినిధి

ముస్తాబాద్, జూలై 6: ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఆత్మ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కొండం రాజిరెడ్డి, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన గజ్జల రాజులను రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు కనిమేని చక్రధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లా బాల్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నరేష్, మధు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, మహేందర్తో పాటు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొని రాజిరెడ్డి, గజ్జల రాజులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.