SIR తొలి దశ ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని ఓటర్లకు నోటీసులు అందజేసే ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలోని 54వ డివిజన్‌లో ఓటరు జాబితాలో పేరు కనిపించని ఓటరుకు BLO స్వప్న నోటీసు అందజేశారు. జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఓటరూ పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పేరు లేకపోతే నోటీసులో పేర్కొన్న వివరాల ఆధారంగా అవసరమైన పత్రాలను సమర్పించి, తమ అభ్యంతరాలను నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. SIR ప్రక్రియలో భాగంగా ఓటర్లందరూ సహకరించాలని అధికారులు కోరారు.



