బిజినపల్లి: మండల పరిధిలోని గంగారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన సాయి అరుణ్ రెడ్డి (26) అమెరికాలో మృతి చెందాడు. గత నాలుగేళ్లుగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సాయి అరుణ్ రెడ్డి మరణవార్త వినగానే తల్లి సరళ, తండ్రి వెంకట్‌రెడ్డి కన్నీరుమున్నీరవుతున్నారు. ఇద్దరు కుమార్తెల తర్వాత ఉన్న ఒక్కగానొక్క కుమారుడు, కుటుంబ పెద్ద దిక్కు కోల్పోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పార్థివదేహాన్ని త్వరలోనే స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు


