Saturday, 26 September 2026
  • Home  
  • నక్కపల్లి డిగ్రీ కళాశాలకు సొంత భవనం!
- అనకాపల్లి

నక్కపల్లి డిగ్రీ కళాశాలకు సొంత భవనం!

వినతిపత్రంపై సానుకూలంగా స్పందించిన హోంమంత్రి అనిత.. త్వరలో నిర్మాణ పనులు పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి శ్రీ వంగలపూడి అనితకు వినతిపత్రం అందజేశారు. కళాశాలకు సొంత భవనం అవసరాన్ని, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలకు శాశ్వత భవనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రంపై హోంమంత్రి వంగలపూడి అనిత సానుకూలంగా స్పందించారు. కళాశాల భవన నిర్మాణానికి స్థలం కేటాయించామని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. దీంతో నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటుకు మార్గం సుగమమైందని కళాశాల ప్రతినిధులు తెలిపారు. కళాశాలకు సొంత భవనం ఏర్పాటు అయితే విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి, స్థలం కేటాయించి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనితకు కళాశాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

వినతిపత్రంపై సానుకూలంగా స్పందించిన హోంమంత్రి అనిత.. త్వరలో నిర్మాణ పనులు

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)

నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి శ్రీ వంగలపూడి అనితకు వినతిపత్రం అందజేశారు. కళాశాలకు సొంత భవనం అవసరాన్ని, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలకు శాశ్వత భవనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రంపై హోంమంత్రి వంగలపూడి అనిత సానుకూలంగా స్పందించారు. కళాశాల భవన నిర్మాణానికి స్థలం కేటాయించామని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. దీంతో నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటుకు మార్గం సుగమమైందని కళాశాల ప్రతినిధులు తెలిపారు.
కళాశాలకు సొంత భవనం ఏర్పాటు అయితే విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి, స్థలం కేటాయించి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనితకు కళాశాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.