Thursday, 10 September 2026
  • Home  
  • కావలి తేజ్ కు అమెరికా లో అరుదైన పదవి. ఏపీ ఎన్ ఆర్టి మిడ్ వెస్ట్ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి
- ఆంధ్రప్రదేశ్

కావలి తేజ్ కు అమెరికా లో అరుదైన పదవి. ఏపీ ఎన్ ఆర్టి మిడ్ వెస్ట్ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి

(జయప్రతాప్ రెడ్డి) అమెరికా గడ్డపై తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, అక్కడి తెలుగువారి సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్న కావలికి చెందిన ప్రముఖ నాయకుడు, APNRT మిడ్‌వెస్ట్ రీజినల్ కోఆర్డినేటర్ తేజ్ మన్నవకు స్థానిక తెదేపా సీనియర్ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించి పూల బొకేలు అందజేసి అభినందించారు.జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర కుమారుడైన మన్నవ తేజ్ బాబు అమెరికాలో తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహించిన కార్యక్రమాలలో కీలక బాధ్యతలు నిర్వహించి విశేష సేవలు అందించగా ఆయనకు టీడీపీ ఎన్ ఆర్ ఐ వింగ్ లో అత్యున్నత ప్రాతినిధ్యం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కావలి పట్టణంలోని మన్నవ నివాసంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మన్నవ తేజ్ బాబు మాట్లాడుతూ గడిచిన 3-4 ఏళ్లుగా అమెరికా నుంచి మేమంతా ఒక టీమ్‌గా ఏర్పడి తెదేపా కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని అందులో భాగంగా కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి, ప్రోత్సహించేందుకు ఈ బాధ్యతలను అప్పగించారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ మరియు APNRT చైర్మన్ రవి వేమూరు నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఎన్‌ఆర్‌ఐలకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా సమస్యలున్నా పరిష్కరించేందుకు రీజినల్ కోఆర్డినేటర్ గా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. అ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత ఉత్సాహంతో పనిచేసి పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు కు మంచి పేరు తీససుకొస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కావలి తెదేపా సీనియర్ నాయకులు, టిడిపి రాష్ట్ర కార్యా నిర్వాహక కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, ఏయంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, సీనియర్ నాయకులు బొట్లగుంట శ్రీహరి నాయుడు, మాజీ కౌన్సిలర్ లు మలిశెట్టి విజయలక్ష్మి, కుందుర్తి కిరణ్, కూరపాటి శ్రీనివాసులు, నాయకులు మంచాల ప్రసాద్, చినకోటయ్య, మహేశ్ నాయుడు,పులువర్తి రాజా,కమ్మ సేవా సమితి అధ్యక్షుడు మాకినేని మాల్యాద్రి తదితరులు హాజరు అయ్యి తేజ్ బాబును శాలువాతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.కావలిలో పుట్టి అమెరికాలో తెలుగుదేశం పార్టీకి సేవలు అందించిన మన్నవ తేజ్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి మరిన్ని పదవులు అధిరోహించాలని, అలానే ఎన్ ఆర్ ఐ వింగ్ లో రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే స్ధానాన్ని కూడా కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు.

(జయప్రతాప్ రెడ్డి)
అమెరికా గడ్డపై తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, అక్కడి తెలుగువారి సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్న కావలికి చెందిన ప్రముఖ నాయకుడు, APNRT మిడ్‌వెస్ట్ రీజినల్ కోఆర్డినేటర్ తేజ్ మన్నవకు స్థానిక తెదేపా సీనియర్ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించి పూల బొకేలు అందజేసి అభినందించారు.జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర కుమారుడైన మన్నవ తేజ్ బాబు అమెరికాలో తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహించిన కార్యక్రమాలలో కీలక బాధ్యతలు నిర్వహించి విశేష సేవలు అందించగా ఆయనకు టీడీపీ ఎన్ ఆర్ ఐ వింగ్ లో అత్యున్నత ప్రాతినిధ్యం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కావలి పట్టణంలోని మన్నవ నివాసంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మన్నవ తేజ్ బాబు మాట్లాడుతూ గడిచిన 3-4 ఏళ్లుగా అమెరికా నుంచి మేమంతా ఒక టీమ్‌గా ఏర్పడి తెదేపా కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని అందులో భాగంగా కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి, ప్రోత్సహించేందుకు ఈ బాధ్యతలను అప్పగించారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ మరియు APNRT చైర్మన్ రవి వేమూరు నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఎన్‌ఆర్‌ఐలకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా సమస్యలున్నా పరిష్కరించేందుకు రీజినల్ కోఆర్డినేటర్ గా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. అ
నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత ఉత్సాహంతో పనిచేసి పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు కు మంచి పేరు తీససుకొస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కావలి తెదేపా సీనియర్ నాయకులు, టిడిపి రాష్ట్ర కార్యా నిర్వాహక కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, ఏయంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, సీనియర్ నాయకులు బొట్లగుంట శ్రీహరి నాయుడు, మాజీ కౌన్సిలర్ లు మలిశెట్టి విజయలక్ష్మి, కుందుర్తి కిరణ్, కూరపాటి శ్రీనివాసులు, నాయకులు మంచాల ప్రసాద్, చినకోటయ్య, మహేశ్ నాయుడు,పులువర్తి రాజా,కమ్మ సేవా సమితి అధ్యక్షుడు మాకినేని మాల్యాద్రి తదితరులు హాజరు అయ్యి తేజ్ బాబును శాలువాతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.కావలిలో పుట్టి అమెరికాలో తెలుగుదేశం పార్టీకి సేవలు అందించిన మన్నవ తేజ్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి మరిన్ని పదవులు అధిరోహించాలని, అలానే ఎన్ ఆర్ ఐ వింగ్ లో రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే స్ధానాన్ని కూడా కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.