Saturday, 4 July 2026
  • Home  
  • కోర్టు కేసులో ఉన్న భూముల్లోకి వెళ్లొద్దు.. రైతులను భయభ్రాంతులకు గురిచేయొద్దు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అలంపల్లి నరసింహ
- News

కోర్టు కేసులో ఉన్న భూముల్లోకి వెళ్లొద్దు.. రైతులను భయభ్రాంతులకు గురిచేయొద్దు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అలంపల్లి నరసింహ

కోర్టు కేసులో ఉన్న భూముల్లోకి వెళ్లొద్దు.. రైతులను భయభ్రాంతులకు గురిచేయొద్దు ఫార్మాసిటీ భూముల బాధిత రైతులకు అన్ని హక్కులు, బెనిఫిట్లు వెంటనే అందించాలి – సీపీఎం నాయకుల డిమాండ్ యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించిన ప్రాంతాల్లో రైతుల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఇబ్రహీంపట్నం ఆర్డీఓకు సీపీఎం పార్టీ నాయకులు, రైతులు, గ్రామ పెద్దలు వినతిపత్రం అందజేసి తమ సమస్యలను వివరించారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న భూముల్లో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఉండాలని, పంటలు సాగు చేస్తున్న రైతులను బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం, పంటలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం తగదని సీపీఎం పార్టీ యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ స్పష్టం చేశారు. రైతులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలను నాశనం చేస్తే వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫార్మాసిటీ కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూమి కోల్పోయిన ప్రతి రైతుకు ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు అందించడంతో పాటు రైతుల పొలాల్లో ఉన్న బోర్లు, చెట్లు, బల్ర షెడ్లు, కొల్లపారాలు మరియు ఇతర స్థిరాస్తులకు సంబంధించిన పూర్తి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన అన్ని రకాల బెనిఫిట్లు పారదర్శకంగా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. గ్రామంలో పలువురు రైతులు ఇప్పటికీ పునరావాస ప్యాకేజీలు, ఇండ్ల స్థలాలు, ఇతర పరిహారాలు అందక ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, భూములు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీపీఎం మేడిపల్లి గ్రామ శాఖ కార్యదర్శులు గడ్డం కుమార్, వడ్డమాని భూషణ్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. గ్రామ ప్రజల హక్కుల కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు, రైతులు ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అండేకార్ అనిల్, వంగూరి జంగయ్య, మనోహర్, మాజీ ఉపసర్పంచ్ సిందం కృష్ణ, మాజీ వార్డు సభ్యుడు కలకొండ కృష్ణ, రైతు నాయకుడు రవి, గ్రామ రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల పంటలు, భూములు, హక్కులను కాపాడాలని – కోర్టు కేసులో ఉన్న భూముల విషయంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని గ్రామ ప్రజలు మరియు రైతులు ప్రభుత్వాన్ని కోరారు.

కోర్టు కేసులో ఉన్న భూముల్లోకి వెళ్లొద్దు.. రైతులను భయభ్రాంతులకు గురిచేయొద్దు

ఫార్మాసిటీ భూముల బాధిత రైతులకు అన్ని హక్కులు, బెనిఫిట్లు వెంటనే అందించాలి – సీపీఎం నాయకుల డిమాండ్

యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించిన ప్రాంతాల్లో రైతుల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఇబ్రహీంపట్నం ఆర్డీఓకు సీపీఎం పార్టీ నాయకులు, రైతులు, గ్రామ పెద్దలు వినతిపత్రం అందజేసి తమ సమస్యలను వివరించారు.

ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న భూముల్లో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఉండాలని, పంటలు సాగు చేస్తున్న రైతులను బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం, పంటలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం తగదని సీపీఎం పార్టీ యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ స్పష్టం చేశారు. రైతులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలను నాశనం చేస్తే వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఫార్మాసిటీ కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూమి కోల్పోయిన ప్రతి రైతుకు ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు అందించడంతో పాటు రైతుల పొలాల్లో ఉన్న బోర్లు, చెట్లు, బల్ర షెడ్లు, కొల్లపారాలు మరియు ఇతర స్థిరాస్తులకు సంబంధించిన పూర్తి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన అన్ని రకాల బెనిఫిట్లు పారదర్శకంగా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.

గ్రామంలో పలువురు రైతులు ఇప్పటికీ పునరావాస ప్యాకేజీలు, ఇండ్ల స్థలాలు, ఇతర పరిహారాలు అందక ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, భూములు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా సీపీఎం మేడిపల్లి గ్రామ శాఖ కార్యదర్శులు గడ్డం కుమార్, వడ్డమాని భూషణ్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. గ్రామ ప్రజల హక్కుల కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు, రైతులు ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అండేకార్ అనిల్, వంగూరి జంగయ్య, మనోహర్, మాజీ ఉపసర్పంచ్ సిందం కృష్ణ, మాజీ వార్డు సభ్యుడు కలకొండ కృష్ణ, రైతు నాయకుడు రవి, గ్రామ రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రైతుల పంటలు, భూములు, హక్కులను కాపాడాలని – కోర్టు కేసులో ఉన్న భూముల విషయంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని గ్రామ ప్రజలు మరియు రైతులు ప్రభుత్వాన్ని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.