Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Blog

Featured

ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలి” — ప్రజారోగ్య వేదిక డిమాండ్. Dr MVR

“ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలి” — ప్రజారోగ్య వేదిక డిమాండ్ ———————————————- భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73యేళ్ళు నిండుతున్నాయి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్లు దాటింది. కానీ రాజ్యాంగం లోని ఆర్టికల్ 47 ప్రకారం దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యాన్ని నిషేధించాలి. మన రాష్ట్రంలోని 5 కోట్లు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రంలో “సంపూర్ణ మద్య నిషేధం” అమలు చేయాలి. కానీ ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చేసుకుని ప్రోత్సహిస్తున్నాయి. మద్య నిషేధం అంశాన్ని అత్యంత నిర్లక్ష్యం చేస్తున్నాయి. 1991- 1992లో రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగసిన సారా వ్యతిరేక ఉద్యమ సెగతో ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం 1993 అక్టోబర్ 1 న “సారా నిషేధం” ప్రకటించింది. కానీ ఆ నిషేధాన్ని అమలు చేయడంలో మాత్రం ఘోరం గా విఫలమైంది. 1994 లో అధికారంలోకి వచ్చిన ఎన్.టి.రామారావు (తెలుగు దేశం పార్టీ) ప్రభుత్వం “సంపూర్ణ మద్య నిషేధం” అమలులోకి తెచ్చింది. కానీ 1996లో అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందనే సాకు చెప్పి 1997లో మద్య నిషేధం ఎత్తివేశారు. ఇలా గత ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ పరిపాలన సాగించాయి. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వై.యస్. జగన్మోహన్ రెడ్డి (వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ) “నవ రత్నాలు” అనే 9 రంగాలను పరిపాలనాంశాలుగా నిర్ణయించింది. అందులో దశలవారీగా “సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయడం” అనేది కూడా ఒక అంశం. పైగా 2017 జూలైలో అమరావతి లో జరిగిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కూడా అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని తీర్మానించారు. అందులో భాగంగానే మద్య విమోచన ప్రచార కమిటీ అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి రూపొందించిన “నూతన మద్యం పాలసీ”ని అమలులోకి తేవడం ఒక ముందడుగు. * రాష్ట్రంలోని మొత్తం లైసెన్స్ గల 4380 మద్యం షాపులను సుమారు 3000కు తగ్గించడం. * గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బెల్ట్ షాపులను తొలగించడం. * ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టడం. అందుకోసం ఉద్యోగులను నియమించుకోవడం. * గతంలో మద్యం అమ్మకాల సమయం ఉదయం 10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకు ఉండగా ప్రస్తుతం ఉదయం 11గం.ల నుండి రాత్రి 7 గం.ల వరకు మాత్రమే అమ్మకాలు నిర్వహించడం లాంటి చర్యలు తీసుకున్నందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అభినందనలు. కానీ నేడు మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా భావిస్తున్నారు తప్ప ప్రజల ఆరోగ్య వినాశకారిగా పరిగణించడం లేదు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం రూ. 2.5 లక్షల కోట్లు. కాగా అందులో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.17,340 కోట్లు. కానీ మద్యపానం ద్వారా సంభవించిన జబ్బులు లివర్ క్యాన్సర్, గుండె జబ్బులు, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు, ఊపిరి తిత్తుల క్యాన్సర్లు, చర్మవ్యాధులు, ఒబేసిటీ, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు లాంటి మరెన్నో ప్రమాదకరమైన జబ్బులకు ప్రైవేటు కార్పొరేట్ వైద్యశాలలకు ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారాను మరియు ప్రజలు నేరుగాను ఏడాదికి చెల్లించిన మొత్తం దాదాపు అక్షరాలా రూ. 40,000/ కోట్లంటే అతిశయోక్తి కాదు. అదే సందర్భంలో రాష్ట్రంలోని మొత్తం మరణాలలో 25% వరకు మద్యపానం సంబంధిత వ్యాధుల వల్ల సంభవించే మరణాలే ఉంటున్నాయి. రాష్ట్రంలోని 40%-60% కుటుంబాలు మద్యపానం వల్ల చితికి పోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోను , పట్టణ ప్రాంతాల్లోను మద్యం మత్తులో మాటా మాటా పెరిగి పెద్ద గొడవలుగా మారి దాడులు ప్రతిదాడులు చేసుకుంటూ మృత్యువు పాలవుతున్నారు. వైవాహిక జీవితంలో పురుషులు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని కోల్పోతున్నారు. సంసారాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. భావి భారత పౌరులు 12ఏళ్ళ వయసు నుంచే మద్యపానానికి బానిసలై పోతూ నేరప్రవృత్తికి దాసోహం అయిపోతున్నారు. మొత్తం యాక్సిడెంట్ కేసుల్లో 75% డ్రంకన్ డ్రైవ్ కేసులే. యువత పెడధోరణులు తొక్కుతూ తల్లి తండ్రులు, అక్కాచెల్లెళ్ళు, రక్తసంబంధాలు అనే ఉచ్ఛ నీచాలు మరచిపోయి కుటుంబ, సామాజిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు. దేశం ఎంతో యువశక్తిని, మేథో సంపత్తిని కోల్పోతోంది. కనుక వీటన్నింటికీ సరైన పరిష్కారం “సంపూర్ణ మద్య నిషేధం” ఒక్కటే. గాంధీ గారు ఒక సందర్భంలో మద్యపానం గురించి మాట్లాడుతూ ” దొంగతనం, వ్యభిచారం కంటే మద్యపానం అత్యంత నీచమైంది. ఒక గంటసేపు నేను భారత దేశానికి నియంతనైతే ఎలాంటి నష్ట పరిహారాలు చెల్లించకుండా దేశం లోని మొత్తం మద్యం కంపెనీలను మూసేస్తాను” అని అన్నారు. ఇప్పటికే బీహార్, నాగాలాండ్, మిజోరాం, లక్షద్వీప్ రాష్ట్రాల్లో మద్య నిషేధం అమలులో ఉంది. కేరళలో కరోనా వైరస్ పూర్తిగా తగ్గేంతవరకు మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకే అక్కడ ప్రజల ఆరోగ్య స్థాయిలు మెరుగ్గానే ఉన్నాయి.నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణంగా ఎవరినైనా మద్య పానం మాన్పించడానికి 21 రోజుల సమయం సరిపోతుంది. కానీ కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు విధించిన 40రోజుల లాక్ డౌన్ లో మద్యం అందుబాటులో లేకుండా పోయింది. అందువల్ల దాదాపుగా 70 నుంచి 90 శాతం మంది అనివార్యంగా మద్యం మానేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగిస్తూ రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు మాత్రం అనుమతించింది. లాక్ డౌన్ సమయంలో మద్యం మానేసిన దాదాపు 70-90% మంది ఇప్పుడు తిరిగి మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది! కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మద్యపానం అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కావున ఈ లాక్ డౌన్ సమయంలో ఆహారం కోసమే ప్రయాస పడుతున్నవారు ఇప్పుడు మద్యానికి డబ్బులేక ఇళ్ళలో ఉన్న వస్తువులను, భార్య మెడలోని మంగళ సూత్రాలు కూడా అమ్మేసి తాగుడుకు ధారపోసే అవకాశం ఉంది.ఇంట్లో ఏమీ లేకపోతే ప్రక్క ఇళ్ళలోకి చొరబడి దొంగతనాలు, దోపిడీలకు ఇతర దుర్మార్గపు చర్యలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే పరిస్థితులు నెలకొన్నాయి. మద్యానికి దూరమై సాధారణ జీవితంలోకి మారిపోయినవారు కుటుంబాలతో కలిసి మెలసి సంతోషంగా గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ మద్యాన్ని ఎన్ని షరతులతో ప్రవేశపెట్టినా అది కుటుంబాలలోను, గ్రామాలలోను చిచ్చు పెట్టడానికి, కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకే దోహదం చేస్తోంది. కాబట్టి ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వై.సి.పి. పార్టీ ప్లీనరీ సమావేశాల్లోను, ఎన్నికల మేనిఫెస్టోలోనూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 5 కోట్ల ప్రజల ఆరోగ్య పరిరక్షణకోసం మరియు రాష్ట్రాన్ని కరోనా నుంచి కాపాడుకునేందుకు ఈ లాక్ డౌన్ సమయంలోనే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలులోకి తేవాలి. –డా. యం.వి.రమణయ్య, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు , టి.కామేశ్వరరావు,ప్రధానకార్యదర్శి.

Featured జాతీయ అంతర్జాతీయ

*రెడ్ క్రాస్ సేవలు* *అభినందనీయం:*అచరిత్వ ఫౌండేషన్* *చైర్మన్ కృపాల్*

**రెడ్ క్రాస్ సేవలు* *అభినందనీయం:*అచరిత్వ ఫౌండేషన్* *చైర్మన్ కృపాల్* హెన్రీ డునంట్ స్థాపించిన రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం. ఆ రోజు వ్యాపారం నిమిత్తం వెళ్ళిన హెన్రీ అక్కడ ఆస్ట్రియా యుద్ధం లో చనిపోయిన వారిని క్షతగాత్రుల యిన వారిని చూసి తట్టుకోలేక చలించి పోయాడు. తను వెళ్ళిన పని వదలి మానవత్వం తో వారికి సేవ చేయడం మొదలు పెట్టాడు. మానవత, నిష్పాక్షి త, సమతుల్యత, స్వతంత్రం, ఐక్యత, వా లంట రీ సేవ, విశ్వ జనీనత అనే ఏడు ప్రాథమిక అంశాలతో కుల మత వర్గ వర్ణ లింగ జాతి అనే వివక్షత లేకుండా సేవ లందిస్తువుంది. దాదాపు ఈ రోజు 9.7 కోట్ల మంది సభ్యులు వున్న రెడ్ క్రాస్ శాంతి కాలంలో ప్రథమ చికిత్స, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నడపడానికి శిక్షణ, పరిశుభ్రమైన నీరు ఏర్పాటు చేయడం, నర్సు లకు శిక్షణ ఇవ్వడం, రక్తం సేకరణ లాంటి కార్యక్రమాలు చేస్తూ వుంటుంది. ఈ రోజు అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా వారి సేవలు గుర్తు చేసుకుంటూ రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని కోరు తూ ఈ సంస్థ లో నేను కూడా సభ్యుని గా వుండడం చాలా సంతోషంగా ఉందని అచ రి త్వ ఫౌండేషన్ చైర్మన్ కృ పా ల్ అన్నాడు.

Featured

ఎర్రజెండా అండగా… సేవే లక్ష్యంగా కదిలిన ఎర్రసైన్యం

మేమున్నామని!_ మీకేం కాదని! ===================== _ ఎర్రజెండా అండగా… సేవే లక్ష్యంగా కదిలిన ఎర్రసైన్యం _ 21 22 డివిజన్లలో 40 రోజులపాటు నిరుపేదల ఆకలి తీర్చిన వైనం! _ ప్రతి రోజు 400 మందికి ఆహారం అందించిన సిపిఎం కార్యకర్తలు! _ లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 16 వేల మంది కార్మికులకు ఆహార పొట్లాల పంపిణీ! _ సేవే లక్ష్యంగా కృషి చేస్తున్న కార్యకర్తలకు తోడుగా నిలిచిన దాతలు దేశంలో కరోనా మహమ్మారిని నిరోధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే! దాంతో ప్రజా జీవనానికి కూడా లాక్ డౌన్ పడ్డట్లయింది. ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో ఉపాధి కోల్పోయారు ముఖ్యంగా నిరుపేదలు, కార్మికుల కు జీవనోపాధి లేక వారి కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. ఇటువంటి విపత్కర సమయంలో నైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఆదుకుంటా ఏమోనని పేదలు ఆశించారు. ప్రభుత్వం కుటుంబానికి వెయ్యి రూపాయలు, తలకు 5 కేజీల రేషన్ బియ్యం అందించి మీ కష్టం మీరు పడండి అంటూ చేతులు దులుపు కుంది. అటువంటి సమయంలో మేమున్నామంటూ సిపిఎం కార్యకర్తలు చేదోడువాదోడుగా నిలిచి గత నలభై రోజులుగా వారి ఆకలి బాధలు తీరుస్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 21 22 డివిజన్లలో శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చిన వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా ఏ పూటకాపూట సంపాదించుకొని కడుపు నింపుకునే వారే! లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూట గడవడం కష్టంగా ఉన్నా వారికి ఆ ప్రాంతంలో ఉన్న సిపిఎం కార్యకర్తలు అండగా నిలిచారు.21 22 డివిజన్ల సిపిఎం శాఖల ఆధ్వర్యంలో ఒక నిరంతర ఆహార తయారీ కేంద్రాన్ని దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కార్మికులకి, నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు అందజేసేందుకు, కార్యకర్తలే రంగంలోకి దిగి అన్నం కూరలు వండి ప్యాకెట్లు చేసేవారు. సీపీఎం రూరల్ కమిటీ సభ్యుడు, శాఖా కార్యదర్శులు, పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల కార్యకర్తలు అందరూ ఒక టీం గా ఏర్పడి క్రమశిక్షణతో పేదలకు ఆహార పొట్లాలు అందించేందుకు నిరంతరం కృషి చేశారు. పేదలకు సహాయం చేసే సందర్భంలో కార్యకర్తలు తమ కుటుంబ సమస్యలు, ఇబ్బందులను కూడా మరిచారు. కార్యకర్తలంతా అంకితభావంతో పని చేయడం ద్వారానే 40 రోజులపాటు నిరంతరంగా 16 వేల మంది ఆకలి బాధలు తీరుస్తూ అందరికీ ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచారు. మీరు చల్లగా ఉండాలని ఆ ప్రాంత ప్రజలు అందిస్తున్న దీవెనలు, కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో మరింత ఉత్సాహంగా పాల్గొనేందుకు తోడ్పడాలని కోరుకుందాం. ఇటువంటి విపత్కర సమయాల్లో ఆ ప్రాంతంలో పలువురు దాతలు సిపిఎం కార్యకర్తలు చేస్తున్న కృషిని గుర్తించి మేము మీకు తోడుగా ఉంటామని చేయూత నందించడం అభినందనీయం.

Featured

ఆశా వాలంటీర్ల సేవలు అభినందనీయం

06.05.2020, నెల్లూరు,(పున్నమి ప్రతినిధి – సి.ఎస్.రావు) *ఆశా వాలంటీర్ల సేవలు అభినందనీయం* జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం ప్రాంగణం నెల్లూరు నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు చేజర్ల సుధాకర్ రావు గారి ఆధ్వర్యంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నెల్లూరు వారి సహకారంతో జిల్లా సెక్రటరీ రామ్ కుమార్ గారి అధ్యక్షతన నెల్లూరు సిటీ 8 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిథి లోని 96 మంది ఆషా వాలంటీర్లుకు, శానిటైజర్లు, మాస్క్ లు, హెడ్ పిపి కిట్లను అందజేయడం జరిగింది. కరోనా కోవిద్ 19 విధుల్లో ఆషాల సేవలు వెలకట్టలేనివి అని,కరోనా వ్యాధిగ్రస్తులు గాని, ప్రజలు గాని ఆషా వాలంటీర్ల సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం జరిగింది అని, 17 మంది కరోనా పాజిటివ్ కేసులకు అత్యుత్తమ స్థాయిలో సేవలందించిన సాధన. కళ్యాణి ఆషా వాలంటీర్ గారిని ఎనిమిది పాజిటివ్ కేసులు మంచిగా సేవలందించిన మాధవి గారిని ఘనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు చేజర్ల సుధాకర్ రావు మరియు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ లీడర్ పి వి సుబ్బారావు గార్లు ఘనంగా అభినందించడం జరిగింది ,అనంతరం ఆశా వాలంటీర్లకు పూలు చల్లుతూ అభినందించి వారు చేసిన సేవలను కొనియాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లు ఆషా వాలంటీర్లకు సెల్యూట్ చేయడం జరిగినది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నెల్లూరు జిల్లా శాఖ శ్రీ రామ్ కుమార్ జిల్లా సెక్రెటరీ ,పి.వీ సుబ్బారావు స్టేట్ లీడర్ గారి ఆధ్వర్యంలో లాక్ డౌన్ కాలంలో తిండి తిప్పలు లేనివారికి వలస కూలీలకు, నేషనల్ హైవేపై వెళ్తున్న వేలాదిమందికి అన్నదానం చేయడంతోపాటు,కరోనా సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది ,ఆశ వాలంటీర్లకు అత్యవసర మాస్కులు అందజేస్తూ వారు సేవ చేయడం జరిగిందని, వీరి సేవలు అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు శశి ,మజారులా,పి. కిష్టయ్య, జి. సుధాకర్ రెడ్డి, యమ్. శ్రీనివాసులు డిస్టిక్ కమ్యూనిటీ మొబిలైజేషర్ సునీత ,భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతినిధులు టి కృష్ణ కుమార్ RSL,బాల బ్రహ్మయ్య , పి సాయి నిత్యా రెడ్డి ,జి .భానుతేజ 8 అర్బన్ హెల్త్ సెంటర్లో కమ్యూనిటీ ఆర్గనైజర్లు తిరుపతయ్య ,వేణు, సుభాషిణి, ఏ .విజయలక్ష్మి ,బి. వెంకటయ్య ,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Featured

డా.పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు ఎందరికో ఆదర్శం ….

డా.పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు ఎందరికో ఆదర్శం … సాధారణంగా పేద మద్యతరగతి ప్రజలకు వైద్యసేవలందించడంలో నెల్లూరులో ఉన్న ఎన్నో ఆసుపత్రులలో డా.పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఆసుపత్రి(పీపీసీ) ఒక విశిష్టత పొంది ఉంది. అయితే కొందరిలో ఈ ఆసుపత్రి పట్ల ఈకార్పొరేటు ఆసుపత్రుల మాయాజాలం చూసినోళ్ళకు వేరే అభిప్రాయం ఉంది. అందుకే ఈ ఆసుపత్రిలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి కన్నా ఎక్కువ రోగులు ఓపి..ఇన్ పేషెంట్లు గా ఉంటారు. ఒక ఆశయంతో సేవల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోకుండా సరైన, సహేతుక వైద్యాన్ని అందించడం లో అతితక్కువ ధరలలో మంచి వైద్యం అందిస్తున్నా….ఈరోజుల్లో కొన్ని మద్యతరగతి వర్గాలకు ఏ ఆసుపత్రిలో చూపించుకున్నావు అనేది ఓ స్టేటస్ సింబల్ గా కూడా ఉంది.అటువంటి అభిప్రాయాలు ఈమద్యకాలంలో ముఖ్యంగా విద్య‌,వైద్యం విషయంలో కార్పొరేటు కల్చర్ కనిపిస్తుంది. ఈ కరోనా కష్టకాలంలో కార్పొరేటు ఆసుపత్రులన్నీ ఎన్నోకారణాలతో మూసేసి జంప్ అయ్యారు. కిటకిటలాడే పొగతోట నెల్లూరు ఆసుపత్రుల హబ్ నిర్మానుష్యంగా అయింది.ఇప్పటిదాకా లేనిజబ్బులకు వైద్యం జరిగిందా అన్న వ్యాఖ్యానాలు జోకులూ వినిపించాయి. అంతలో కొంతో ఎంతో వాస్తవం లేకపోలేదు. అయితే ఈ కరోనా సమయంలో గర్భంతో ఉన్నవారు డెలివరీ డేట్ దగ్గరపడ్డావాళ్ళు వాళ్ళబంధువులూ టెన్షన్…అప్పటిదాకా చూస్తున్న డాక్టర్లు కొందరయితే ఫోన్లూ బంద్ చేశారు. ఏం చేయాలో తోచని పరిస్థితి లో విపరీతంగా ఒత్తిడి. జిల్లా యంత్రాంగం ఎంత చెప్పినా ఆచరణలో షరా మామూలే. సందట్లో సడేమియా అన్నట్లు ఓ డాక్టర్ అయితే ఏకంగా డెలివరీ కి మూడురోజులకు లకారం వసూలు చేసిందట. చాలామంది ఈసమస్యతో అల్లాడారు. అల్లాడుతున్నారు. ఇక్కడే మా పొరుగింట్లో ఓ అమ్మాయీ(భర్త ) ప్రయివేటు ఉద్యోగి…లాక్డౌను లో చెన్నైలో ఇరుక్కుపోయాడు. సలహా అడిగితే మా ఆవిడ నాకు చెప్పింది. వెంటనే పీపీసి పేరుచెప్పా…కొంత ఓరకమైన అభిప్రాయం ఉన్నా మాట్లాడమని చెప్పారు. రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల సూపరింటెండెంట్ డా.రాజేశ్వర్ రావుగారితో మాట్లాడాను. వివరాలు అడిగి సరే పంపించండి అన్నారు. వెళ్ళారు తొలుత అన్ని పరీక్షలు చేసి డెలీవరీ డేటుకు ఓ రెండురోజులు ముందు రమ్మన్నారు. డా.రాధా గారు చాలా నెమ్మదిగా గర్భీణికి ధైర్యం ఇచ్చారు. సిజేరియన్ లపేర డబ్బుగుంజే కార్పొరేటు కల్చర్ కు భిన్నంగా వీలైనంతవరకు సాధారణ డెలివరీ అయ్యేందుకు ప్రయత్నించి అవసరం మేరకే కోత..అనే వైద్యప్రమాణాలను గుర్తెరిగి వైద్యం చేసే అతి కొద్ది ఆసుపత్రులలో పీపీసి అని చెప్పవచ్చు. ఆ అమ్మాయి డెలివరి మొన్న సోమవారం డెలివరీ అదీ నార్మల్ డెలివరీ.. ఆహారం కూడా అందించారట. చాలా చక్కగా ఏవిధమైన విసుగు చూపక వైద్యం ఆతిథ్యం ఇచ్చినట్లు చూచుకున్నారని…జీవితంలో మరచిపోలేమని ఆ అమ్మాయి వారి తల్లిదండ్రులు చెప్పడం…ఇప్పటిదాకా మాకున్న ఓ దురభిప్రాయం..(అనుభవంలేని) ఉండేదని అన్నారు. ఇంతకీ ఆసుపత్రి చేసిన వసూలు కేవలం రూ.ఆరువేల రూపాయలే…ఆశ్చర్యంకదా…లక్షలు గుంజే ఆసుపత్రులెక్కడ… వైద్యోనారాయణోహరి అంటే ఇదేగా…అట్లని కార్పొరేట్ ఆసుపత్రులను నిందించడం కాదు గానీ…వైద్య ప్రమాణాలు మరచి సంపాదనే ధ్యేయంగా ఉన్న కొందరి..కొన్నిఆసుపత్రులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆపద సమయంలో మూసేసుకొని వెళ్ళిపోయిన ఆసుపత్రులకు ప్రజలు ఎంత పెట్టారో…కదా… ఓపీలు బంద్ చేయమనొచ్చు…కానీ ఎంతమంది ఎన్ని కార్పొరేట్ ఆసుపత్రులు కనీసం తమ రోగీలకు టెలి ఫోన్ ద్వారానైనా ధైర్యం ఇవ్వగలిగారు..ఆలో చించాలి. అప్పుచేయించి మనచే వైద్యమందించే వాడా…లేక ఆపదలో నిఖార్సుగా సహేతుకంగా వైద్యాన్ని అందించేవారా….ప్రజలు ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ రామచంద్రారెడ్డి ఆసుపత్రితో మా ఆత్మకూరు ఆయన మా వీధి వారు మానాన్నకు మంచి స్నేహితుడు డా.చెర్లో రమణారెడ్డి గారిద్వారానే మా కుటుంబానికి ఈ ఆసుపత్రితో అనుబంధం. ఆయన నేను డిగ్రి వీఆర్సిలో చదివేపుడూ ఆర్ధిక సహాయం… ఆతిథ్యం కూడా ఇచ్చాడు. మాకు మాకుటుంబానికి ఈ ఆసుపత్రితో అనుబంధం మంచి అనుభవాలు ఉన్నాయి.తదుపరి ఈ అత్యున్నత ఆశయాలతో ఉన్న ఈ ఆసుపత్రితో కలిసి పూర్వ వృత్తిపరంగా కూడా ఉన్నాను. అందుకు గర్విస్తున్నా…. ఈ కరోనా కష్టకాలంలో అత్యున్నత సేవలందిస్తూన్న డా.పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలీ క్లినిక్ వైద్యబృందానికి…సిబ్బందికి అబివందనాలతో…. ఇటువంటి ఆశయాలతో నడిచే నడిపించే వారికి నిజమైన సహకారం అందిద్దాం…. లేట్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారి ఆశయాలను తమ అకుంఠిత దీక్షతో అమరుడిని చేసిన ఆసుపత్రి సిబ్బందికి సెల్యూట్…. జివి నాగరాజరావు, బీ.యస్సీ ఎల్లెల్బీ న్యాయవాది, హైకోర్టు ఆంధ్రప్రదేశ్

Featured

నెల్లూరు జిల్లా కరోనా హెల్త్ బులిటెన్

పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ అలీ ✍️✍️ జిల్లాలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ నుండి మంగళవారం వరకు 56 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.33 మంది ఐసోలేషన్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.ఈ మేరకు జిల్లా డి ఎం హెచ్ ఓ రాజ్యలక్ష్మి మంగళవారం రాత్రి బులిటెన్ విడుదల చేశారు. ఇప్పటి వరకు 5641మందికి కరోన నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1568 రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

అందుకే మద్యం ధరలు భారీగా పెంచం:జగన్

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ ఏపీ:మద్యపాన నిషేధంలో భాగంగానే మద్యం ధరలను 75 శాతం పెంచినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.ఇవాళ కొలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ సమావేశమయ్యారు.మద్యం విక్రయాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే పరిమితం చేశామని, మద్యపాన నియంత్రణలో భాగంగా త్వరలోనే మద్యం దుకాణాలను తగ్గిస్తామని తెలిపారు.ఇప్పటికే పర్మిట్ రూంలను రద్దు చేశామన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ ఏపీలో కొత్తగా 67 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 1,717 కు చేరింది. ఇందులో 1094 యక్టీవ్ కేసులు ఉండగా..589 మంది డిశ్చార్జ్ అయ్యారు.అటు మరణాల సంఖ్య 34 కు చేరింది.తాజాగా అనంతపురం జిల్లాలో 2,గుంటూరు 13,కడప 2,కృష్ణా 8,కర్నూలు 25,నెల్లూరు 1, విశాఖ జిల్లాలో 1,వేరే రాష్ట్రాల నుండి వచ్చిన 14 మందికి కరోనా వచ్చింది .

జాతీయ అంతర్జాతీయ

46,433 కి చేరుకున్న కరోనా కేసులు

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 46,433 కరోనా కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకు 1,568 మంది మృతి చెందారు అని వెల్లడించింది.ఇప్పటివరకు 12,727 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా..32,138 యక్టీవ్ కేసులు ఉన్నాయంది.మహారాష్ట్రలో అత్యధికంగా 14,541 కేసులు నమోదవ్వగా…గుజరాత్ లో 5,804 కేసులు,ఢిల్లీలో 4,898 కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది

ఆంధ్రప్రదేశ్

ఏపీలో మొత్తం 1,25,229 కరోనా టెస్టులు

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ ఏపీలో కరోనా టెస్టుల సంఖ్య రోజురోజుకు పరుగుతోంది.నిన్నటివరకు మొత్తం 1,25,229 కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రతీ 10 లక్షల జనాభాకు 2,345 మందికి టెస్టులు చేస్తున్నారు. రోజు వారీ సామర్ధ్యం 10 వేలకు పైగా పెరిగింది.గత 24 గంటల్లో 10,292 మందికి పరీక్షలు జరిపారు. రాష్ట్రంలో సగటున ప్రతీ 76 టెస్టులకు గానూ ఒక పాజిటివ్ కేసు నమోదవుతోంది .అదే దేశ సగటు చూస్తే ప్రతీ 26 పరీక్షలకు ఒక పాజిటివ్ కేసు వస్తోంది.