Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Blog

Featured

నాయీ బ్రాహ్మణులకు రూ.1000 నగదు

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ నెల్లూరు:ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితులలో నాయీ బ్రాహ్మణులను ఆదుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వినుకొండ వెంకటేశ్వర్లు విజ్ఞాప్తి చేశారు.అభయహస్తం అధినేత డాక్టర్ చేరుకుపల్లి భాస్కర్ రెడ్డి,డాక్టర్ మధులత దాతృత్వంతో నాయీ బ్రాహ్మణ వృత్తిదారులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున నగదు అందించారు. ఈ కార్యక్రమంలో పాకాల లక్ష్మీ నారాయణ,చేరుకూరు శ్రీనివాసులు పాల్గొన్నారు.

Featured

క్యాన్సర్ ఆసుపత్రికి రూ.5 లక్షల విరాళం

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ నెల్లూరు పొదలకూరు రోడ్డులో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ క్యాన్సర్ ఆస్పత్రికి వీఆర్ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు టీవీ కృష్ణా రెడ్డి రూ.5 లక్షల విరాళ్ళని అందించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని పోర్దాలో ఉండటంతో సమీప బంధువు ద్వారా ఈ విరాళ్ళని అందచేశారు. మానవతా దృక్పథంతో క్యాన్సర్ రోగులకు అండగా నిలిచిన దాతకు ఆసుపత్రి కన్వీనర్ తుంగాశివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతతో తెలిపారు.

Featured

రైతులకు రూ.100 కోట్ల రుణాలు ఇవ్వనున్న నాబార్డ్

నెల్లూరు పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ అలీ ✍️✍️ రైతులకు కరోనా కష్టాలు తీర్చేందుకు నాబార్డ్ సహకారంతో రైతాంగానికి రూ.100 కోట్లు రుణాలు ఇవ్వనున్నట్లు సహకార బ్యాంక్ ఛైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.సంవత్సరం లోపు అయితే సున్నా వడ్డీ,ఆ పైన అయితే 25 పైసలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు.రైతులందరూ జిల్లాలోని ఆయా బ్యాంక్ కేంద్రాల వద్ద రుణాలు కొరకు సంప్రదించాలన్నారు.బ్యాంక్ లావాదేవీలను మొబైల్ బ్యాంక్ యాప్ ద్వారా చేసుకోవచ్చని ఆయన వివరించారు.

Featured

నెల్లూరులో సిఐడి ఎస్సై అనుమానస్పద మృతి – కేసు నమోదు చేసిన పోలీసులు

పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ అలీ ✍️✍️ నెల్లూరు సిఐడి విభాగంలో ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాలేపాటి బ్రహ్మానందం అనుమానస్పదంగా మృతి చెందారు. మంగళవారం ఉదయం యూనిఫాం ధరించి విగతజీవిగా ఇంట్లోని బెడ్ రూంలో మంచంపై పడి ఉండగా బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. నెల్లూరు రూరల్ మండలం, 3వ మైలు వద్ద నివాసం ఉండే బ్రహ్మానందం ప్రస్తుతం లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య, కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. కుమారుడు హైదరాబాద్ లో ఉన్నారు. ప్రస్తుతం ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బ్రహ్మానందం మంగళవారం ఉదయం డ్యూటీ వెళ్లేందుకని యూనిఫాం ధరించిన తర్వాత అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. దీనిపై వారి కుటుంబసభ్యులు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. 

ఆంధ్రప్రదేశ్

నిజాలను నిర్భయంగా రాసే ‘పత్రికా స్వేచ్ఛ’ అవశ్యం : మంత్రి గౌతమ్ రెడ్డి

పున్నమి ప్రతినిథి  ✒️ నిత్య ప్రజా చైతన్యానికి, సమాజాన్ని సంఘటితం చేయడానికి పాటు పడే పత్రికలకు స్వేచ్ఛ అవశ్యమని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి,  ప్రపంచానికి తెలియని వాస్తవాలు వెలికి తీసి ప్రజల ముందుంచడానికి, , విపత్కర పరిస్థితుల్లో జనాన్ని మేల్కొలపడానికి, అత్యవసర సమయాల్లో అందరినీ ఒకతాటిపై నిలిపేందుకు పత్రికా స్వేచ్ఛ అత్యంత అవసరమని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వం చేపడుతోన్న చర్యలను ప్రజలకు తెలుపుతున్న పత్రికలకు, విలేకరులకు మంత్రి కృతజ్ఞతాభినందనలు తెలిపారు. ఎటువంటి సమస్య వచ్చినా దాని పరిష్కారం కోసం, ప్రజల కష్టాలను తీర్చడం కోసం తపించే పత్రికా స్వేచ్ఛ ఎప్పుడూ వెలకట్టలేనిదని మంత్రి తెలిపారు. ముఖ్యంగా, కరోనా సమయంలో అవాస్తవాలతో భయాందోళన చెందే ప్రజలకు నిజాలను నిర్భయంగా పత్రికలే గుండె ధైర్యమని మంత్రి వెల్లడించారు. ఇతర మాధ్యమాలకు పత్రికలు ఆదర్శమని అన్నారు. పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడి త్యాగాలు చేసిన కలం యోధులను స్మరించుకోవడానికి  యునెస్కో  తీర్మానం మేరకు 1993 నుంచి ప్రతి ఏటా మే 3న జరుపుకునే పత్రికా స్వేచ్ఛ   ప్రపంచంలోని ప్రతి ఒక్కరి స్వేచ్ఛ అని మంత్రి మేకపాటి పేర్కొన్నారు.

Featured

వలస కూలీల తరలింపుపై అధికారులతో చర్చ

పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️ జిల్లాలో ఉత్తర ప్రదేశ్,వెస్ట్ బెంగాల్,ఒరిస్సా,బీహార్ రాష్ట్రాలకు సంబంధించి సుమారు నాలుగు వేల మంది వలస కూలీలు ఉన్నారని,వారిని వారి స్వస్థలాలకు చేర్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లాకలెక్టర్ శేషగిరిబాబు ఆదేశించారు. ఆదివారం అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…పక్క జిల్లా అధికారులతో చర్చించి వారిని స్వస్థలాలకు పంపేటప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు

Featured

104 సర్ ప్లస్ ఉద్యోగుల జీతాలు విడుదల

పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️ నెల్లూరు జిల్లాలో ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న 104 సర్ ప్లస్ ఉద్యోగుల జీతాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల అయ్యాయని ఆ సంఘం జిల్లా నాయకులు చేజర్ల సుధాకరరావు తెలిపారు.లాక్ డౌన్ సమయంలో పెండింగ్ జీతాలు రిలీజ్ చేయడంతో ఉద్యోగులకు కొంచెం ఊరట లభించిందని వారు పేర్కొన్నారు

Featured

17 వరకు కొన్ని రైళ్లు మాత్రమే యధాతధం

పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️ కేంద్ర ప్రభుత్వం మే నెల 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించినందున అన్ని రైళ్లు రద్దు చేస్తున్నట్లు నెల్లూరు రైల్వే పీఆర్వో మడ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. గూడ్సు రైళ్లు, పార్సిల్ సర్వీసు రైళ్ళు, వలస కూలీలను తరలించే ప్రత్యేక రైళ్లు యధావిధిగా కొనసాగుతాయని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్తగా 58 కరోనా కేసులు

పున్నమి ప్రతినిథి ✒️ ఏపీలో ఇవాళ కొత్తగా 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 1583 కి చేరుకున్నాయని వెల్లడించింది. కొత్తగా కర్నూలు జిల్లాలో 30,గుంటూరు జిల్లాలో 11,అనంతపురం జిల్లాలో 7,కృష్ణా జిల్లాలో 8,చిత్తూరు జిల్లాలో 1,నెల్లూరులో 1 నమోదైనట్లు తెలిపింది. ప్రస్తుతం ఏపీలో యాక్టీవ్ కేసులు 1062 ఉన్నట్లు స్పష్టం చేసింది.

Featured

నెల్లూరు జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు

పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లాలో కరోనా కేసులు సంఖ్య 91 కి చేరింది.ఇప్పటి వరకు 44 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా…ముగ్గురు మరణించారు.మరోవైపు అధికారులు కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని వారు కోరుతున్నారు.