Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరులో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌.. 24 వాహనాలు స్వాధీనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరులో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌.. 24 వాహనాలు స్వాధీనం

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, పున్నమి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎరుకులసాని నగర్‌లో డీఎస్పీ టీ.
  • వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు.
  • సీఐ గంగాధర్‌, ఆత్మకూరు ఎస్‌ఐ జంపాని కుమార్‌, అనంతసాగరం ఎస్‌ఐ రాజేష్‌తో పాటు 40 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

ఆత్మకూరు, పున్నమి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎరుకులసాని నగర్‌లో డీఎస్పీ టీ. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. సీఐ గంగాధర్‌, ఆత్మకూరు ఎస్‌ఐ జంపాని కుమార్‌, అనంతసాగరం ఎస్‌ఐ రాజేష్‌తో పాటు 40 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళ్లను, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 20 స్కూటర్లు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రజలకు మహిళల భద్రత, సైబర్‌ నేరాల నివారణ, మొబైల్‌ ఫోన్‌ వినియోగంలో జాగ్రత్తలు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ప్రజలు చట్టాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *