వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత ఉదయగిరి: పట్టణంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ కే.
- సుధీర్ తెలిపారు.
- సబ్స్టేషన్లలో నిర్వహణ పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని పేర్కొన్నారు.
ఉదయగిరిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
ఉదయగిరి: పట్టణంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ కే. సుధీర్ తెలిపారు. సబ్స్టేషన్లలో నిర్వహణ పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని పేర్కొన్నారు. ఉదయగిరితో పాటు గండిపాలెం, బిజ్జంపల్లి, కుర్రపల్లి, దుత్తలూరు సబ్స్టేషన్ల పరిధిలో వ్యవసాయ విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలగనుంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు, రైతులు విద్యుత్ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ పనులను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. నిర్వహణ పనులు పూర్తయిన అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని ఏడీఈ కే. సుధీర్ కోరారు.