Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీతారామపురం మండల సమస్యలు పరిష్కరించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీతారామపురం మండల సమస్యలు పరిష్కరించాలి

వార్త ముఖ్యాంశాలు

  • సీతారామపురం మండల సమస్యలు పరిష్కరించాలి ట్రైనీ కలెక్టర్ పవన్ తేజకు మాజీ జెడ్పీటీసీ జ్యోతి వినతి సీతారామపురం: మండలంలోని రైతులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మాజీ జెడ్పీటీసీ జ్యోతి కోరారు.
  • ఈ మేరకు గురువారం ట్రైనీ కలెక్టర్ పవన్ తేజకు వినతిపత్రం అందజేశారు.
  • మండలంలో విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

సీతారామపురం మండల సమస్యలు పరిష్కరించాలి
ట్రైనీ కలెక్టర్ పవన్ తేజకు మాజీ జెడ్పీటీసీ జ్యోతి వినతి
సీతారామపురం: మండలంలోని రైతులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మాజీ జెడ్పీటీసీ జ్యోతి కోరారు. ఈ మేరకు గురువారం ట్రైనీ కలెక్టర్ పవన్ తేజకు వినతిపత్రం అందజేశారు. మండలంలో విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న ఆర్టీసీ బస్సు షెల్టర్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. విద్యార్థుల ప్రయాణ సౌకర్యార్థం సి.ఎస్.పురం, పామూరు, పోరుమామిళ్లకు బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ట్రైనీ కలెక్టర్‌ను అభ్యర్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *