Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రతి రైతుకు ఎరువులు అందేలా చర్యలు: ఉదయగిరి ఏడీఏ చెన్నారెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రతి రైతుకు ఎరువులు అందేలా చర్యలు: ఉదయగిరి ఏడీఏ చెన్నారెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • ప్రతి రైతుకు ఎరువులు అందేలా చర్యలు: ఉదయగిరి ఏడీఏ చెన్నారెడ్డి ఉదయగిరి అక్టోబర్ 9: ఉదయగిరి: పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఉదయగిరి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు (ఏడీఏ) చెన్నారెడ్డి తెలిపారు.
  • శుక్రవారం ఉదయగిరి ఏడీఏ కార్యాలయంలో ఎరువుల దుకాణదారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు (VAAలు), గ్రామ ఉద్యానవన సహాయకులతో (VHAలు) ఎరువుల పంపిణీపై సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు సాగు చేసిన రైతులు రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి విధిగా పంట నమోదు చేయించుకోవాలని సూచించారు.

ప్రతి రైతుకు ఎరువులు అందేలా చర్యలు: ఉదయగిరి ఏడీఏ చెన్నారెడ్డి

ఉదయగిరి అక్టోబర్ 9:

ఉదయగిరి: పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఉదయగిరి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు (ఏడీఏ) చెన్నారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయగిరి ఏడీఏ కార్యాలయంలో ఎరువుల దుకాణదారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు (VAAలు), గ్రామ ఉద్యానవన సహాయకులతో (VHAలు) ఎరువుల పంపిణీపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు సాగు చేసిన రైతులు రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి విధిగా పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. ఎరువుల పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. గ్రామాల్లో ఎరువుల పంపిణీ విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏవోలు వెంకటసుబ్బారెడ్డి, మదన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *