Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Blog

Featured

పి ఆర్ ఉద్యోగుల నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన : ఆనం అరుణమ్మ

ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నెల్లూరు నూతన సంవత్సరం సందర్భంగా 2022 నూతన క్యాలెండర్ ను జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ  మరియు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి  శ్రీనివాసరావు  చేతుల మీదుగా గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్ష కార్యదర్శి లక్కాకుల పెంచలయ్య భోగ్యం రమేష్ బాబు జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ కుమార్ అనిల్ శ్రీధర్ శీను కరం తుల్లా దేవ ప్రసన్న కుమార్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

గూడూరు లోని శ్రీ సాయి సత్సంగం నిలయంలో మహామృత్యుంజయ హోమం

శ్రీ సాయి సత్సంగం నిలయం కోటా సునీల్ కుమార్, జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గూడూరు లోని శ్రీ సాయి సత్సంగం నిలయంలో మహామృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, రుద్ర హోమం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి  హోమం, ఆయుష్షు హోమం, దుర్గా త్రిశతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్  డాక్టర్ ఎల్. విజయ్ కృష్ణ రెడ్డి హాజరై ప్రసంగించారు. జర్నలిస్టుల కోసం విక్రమసింహపురి యూనివర్సిటీ లో అందిస్తున్న  కోర్సులను వివరించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్,  జర్నలిస్ట్ ఫ్రెండ్స్  నాగరాజు, పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం సుమారు 110 మంది జర్నలిస్టులకు రైస్ బ్యాగ్, నిత్యవసర వస్తువులను విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్టర్ విజయ్ కృష్ణా రెడ్డి అందజేశారు.. ఈ సందర్భంగా సాయి సత్సంగం నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ విక్రమ సింహపురి యూనివర్సిటీ లో జర్నలిజం కోర్స్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ ఇస్తున్న సబ్సిడీ పోను మిగిలిన  ఫీజును తాను అందజేస్తామని ప్రకటించారు.

Featured

పడమటి కంభంపాడు ఇసుక రీచ్ లో గ్రామస్తుల ఆందోళన

*పడమటి కంభంపాడు ఇసుక రిచ్ లో ఉద్రిక్తత* *భారీగా తరలివచ్చి గ్రామస్థులు* *యంత్రాలు..లారీలు అడ్డంగా కింద పడుకున్న వైనం* *నిబంధనలుకు విరుద్ధంగా.. అక్రమ రవాణా జరుగుతుందంటూ ఆందోళన* *అధికారులు మొద్దు నిద్ర పోతున్నట్టు ఆగ్రహం* *భూగర్భజలాలు అడుగంటుతున్నాయంటూ ఆవేదన* *త్రాగడానికి మంచినీళ్లు లేక అల్లాడుతున్నామంటూ ఆగ్రహం* *రాత్రి..పగలు తేడా లేకుండా జోరుగా అక్రమ రవాణా* *కన్నెర్ర చేసిన పీకే.పాడు పంచాయతీ ప్రజలు* *పోలీసులు మొహరింపు* *కూలీల నోరు కొడుతున్న బడా బాబులు* *అడిగే వారు ఎవరు* అనంతసాగరం మండలం లోని పడమటి కంభంపాడు ఇసుక రీచ్ లో శుక్రవారం పడమటి కంభంపాడు సర్పంచ్ కత్తి లావణ్య అద్వర్యం లో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ కత్తి లావణ్య మాట్లాడుతూ ఇసుక త్రావకాల ద్వారా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని తద్వారా మూడు గ్రామాలకు త్రాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు.ప్రొక్లెయిన్లతోటి విచ్చల విడిగా ఎక్కడపడితే అక్కడ లెక్కపక్క లేకుండా త్రవ్వకాలు సాగిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో కూలీల ద్వారా ఇసుక పోసేవారు.అయితే ఇప్పుడు యంత్రాలతో లోడింగ్ చేయడం తో కూలీలు ఉపాధి కోల్పోయి నానా ఇబ్బందులకు గురిఅవుతున్నారు.జిల్లా ఉన్నతాధికారులుకు ఎన్ని సార్లు పిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోక పోవడంతో ఆందోళనకు డిగామన్నారు.దీంతో లారీలు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి.దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఉన్నతాధికారులు మాకు ఉపాది కల్పించాలని కూలీలు కోరారు.ఇసుక అక్రమ రవాణాను అధికారులు అడ్డుకోవాలని పీకే.పాడు పంచాయితీ ప్రజలు కోరారు..

Featured

మనుబోలులో భాజపా మండల అధ్యక్షుడు ఓడూరు ఆధ్వర్యంలో సేవ-హి-సంఘటన

మనుబోలు (పున్నమి విలేఖరి)30,మే: ప్రధానమంత్రి గా నరేంద్రమోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం మరియు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సేవ-హి-సంఘటన్ కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ మనుబోలు మండల అధ్యక్షులు ఓడూరు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు సేవా- హి -సంఘటన్ సేవాకార్యక్రమాలుచేపడుతున్నామని తెలియజేశారు మొదటి రోజు మనుబోలు మండల ఎలక్ట్రానిక్,ప్రింట్ మీడియా విలేకరులకు మాస్కులు శానిటైజర్ పంపిణీ మరియు 108 సిబ్బందికి కూరగాయలు మరియు యాత్రికులకు ఆహార ప్యాకెట్లు ,నీళ్ల బాటిల్ లు పంపిణీ చేశారు . ఆహారం ప్యాకెట్లు మరియు నీళ్ళ బాటి ళ్లు మహత్తరమైన కార్యక్రమానికి మనందరం ఒకరికొకరు తోడై ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుదాం సామాన్యులకు సహాయ పడదాం అని అన్నారు రోజురోజుకు కొవిడ్​ పాజిటివ్​ కేసులు పెరిగిపోతున్నాయని… ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటిస్తూ.. మాస్కు ధరించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని తెలిపారు.

Featured

జర్నలిస్ట్ లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి : బిజెపి జిల్లా నేత బోలా శ్రీనివాసులు

మనుబోలు (పున్నమి విలేకరి)30,మే:కరోనా కల్లోలంలో మృత్యువాత పడిన జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బిజేపి జిల్లా నేత బోల శ్రీనివాసులు డిమాండ్ చేశారు .పారిశుద్ధ్య కార్మికులు వైద్య సిబ్బంది ఏఎన్ఎం లకు 50 లక్షలు బీమా ప్రకటించిన ప్రభుత్వం జర్నలిస్టు సేవలను కూడా గుర్తించి వారికి కూడా 50 లక్షల బీమా ప్రకటించాలని కోరారు. కుటుంబాలను వదిలేసి అంకితభావంతో ముందుకు సాగుతున్న జర్నలిస్టుల ను ఆదుకోవాలని కోరారు. వార్తలు సేకరించడం లో పని ఒత్తిడి వేగంగా వార్తలు సేకరించడం లో ఎందరో జర్నలిస్టులు కరోనా కాటుకు బలయ్యారు అని ఆయన గుర్తు చేశారు. వారి కుటుంబాలు వీధిన పడకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే తగినంత సాయం చేయాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేసే జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విలయతాండవం లో జర్నలిస్టు చేస్తున్న సేవలు మరువలేనివని సంబంధిత మంత్రి స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. పక్క రాష్ట్ర మైన తమిళనాడు ప్రభుత్వం పదిలక్షలు మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రకటించి అండగా నిలిచిందన్నారు. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలని పేర్కొన్నారు..

ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేడు నమోదైన కరోనా వివరాలు

  పున్నమి తెలుగు పత్రిక ✍️✍️ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో 865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 1,17,027కి చేరింది. వైద్యఆరోగ్యశాఖ తాజా బులిటెన్ విడుదల చేసింది. జిల్లాలో ప్రస్తుతం 14,456 మంది కోవిడ్ తో చికిత్స పొందుతుండగా ఆరుమంది మహమ్మారి కి బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 809కి చేరింది.

Featured హెల్త్ టిప్స్

శారీరకంగా కొత్త ప్రాబ్లెమ్స్ వచ్చిపడతాయి.: పారిష్కరం మీకు నచ్చిన డైటీషన్ తో మాట్లాడి పరిష్కరించు కోగలరు

కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని ఇప్పుడు మళ్లీ ఇంటికే పరిమితమవ్వాల్సి వస్తోంది. ఈ సమ్మర్ లో ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం వల్ల ఏం చేయాలో తోచకల ఇబ్బంది పడుతున్నారు చాలామంది. దాంతో పగలు కూడా నిద్రపోవడం, రాత్రిళ్లు లేట్‌గా పడుకోవడం లేదా మేల్కొని ఉండడం లాంటివి చేస్తున్నారు. కానీ నిద్ర ఎప్పుడు, ఎంత ఉండాలో అంత ఉంటేనే మంచిది. లేకపోతే మానసికంగా, శారీరకంగా కొత్త ప్రాబ్లెమ్స్ వచ్చిపడతాయి. నిద్ర ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమేనని అందరికీ తెలిసిందే.. అయితే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల చేసేదేమీ లేక పోవాల్సినదానికంటే కాస్త ఎక్కువే నిద్ర పోతున్నారు. అయితే ఎక్కువగా నిద్ర పోవడం వల్ల రక్తంలో -రియాక్టివ్ ప్రోటీన్, ఇంటర్ ల్యూకేన్-లు పెరిగిపోయి బీపీ, టైప్-2 డయాబెటీస్‌‌తో పాటు గుండె సమస్యలు కూడా వస్తాయి. నిద్ర ఎక్కువైతే.. చిరాకు, కోపం, అసహనం లాంటివి కూడా పెరుగుతాయి. ముఖ్యంగా పగటి పూట ఎక్కువగా నిద్రపోవడం వల్ల బరువు పెరగడం, అజీర్ణం, గ్యాస్ ట్రబుల్, మానసిక ఒత్తిడి లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే వయసుకు తగ్గట్టు నిద్రించే సమయాన్ని పాటించాలి. ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. వయసుల వారీగా.. వయసుని బట్టి నిద్రపోయే టైంను ప్లాన్ చేసుకోవాలి. నాలుగు నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలకు 11 నుంచి 12 గంటల వరకు నిద్ర అవసరం. ఐదు నుంచి ఎనిమిదేళ్ల వయసు పిల్లలు కనీసం పది గంటలైనా నిద్రపోవాలి. అలాగే ఎదిగే వయసులో ఉన్న పిల్లలు అంటే.. ఎనిమిది నుంచి పదేళ్ల వయసుండే పిల్లలు 9 నుంచి 10 గంటలు నిద్ర పోవాలి. టీనేజ్‌లో ఉన్న వాళ్లు 8 నుంచి 9 గంటలు, ఇరవై ఏళ్లు దాటిన వాళ్లు ఆరు నుంచి ఏడు గంటల వరకూ నిద్రపోవాలి. నిద్ర తక్కువైనా ఎక్కువైనా.. మెదడు నిలకడగా ఉండదు. ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గుతుంది. నీరసంగా, బద్ధకంగా అనిపిస్తుంది. అందుకే సరైన నిద్రకు సరైన సమయాన్ని కేటాయింకోవాలి.

Featured

కొడుకు చేతిలో తండ్రి హతం

అనంతసాగరం మండలం ఏప్రిల్ 30 (పున్నమి విలేఖరి): రేవూరు గ్రామం నందు శుక్రవారం సాయంత్రం తండ్రి కొడుకుల మధ్య జరిగిన గొడవలో రేణంగి వెంకటసుబ్బయ్య ( 55) మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రేణంగి వెంకట సుబ్బయ్య మద్యం మత్తులో పొలం చదును చేసే విషయంలో కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండడంతోవెంకటసుబ్బయ్య కుమారుడు రేలంగి ప్రవీణ్ తండ్రికి ఎంత చెప్పినా వినకుండా దాడికి దిగడంతో కత్తిపీట తో దాడి చేయగా వెంకటసుబ్బయ్య తీవ్ర గాయాలయ్యాయి. అతనికి వైద్యం కోసం ఆత్మకూరుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు సిఐ సోమయ్య గారు అనంతసాగరం ఎస్సై ఎన్.ప్రభాకర్ సంఘటనా ప్రాంతానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Featured ఆంధ్రప్రదేశ్

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇడిమేపల్లి సర్పంచ్ యశస్విని వెంకటాచలం, ఏప్రిల్ 29 (పున్నమి విలేకరి): కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇడిమేపల్లి సర్పంచ్ యశస్విని సూచించారు. ఇడిమేపల్లి గ్రామంలో గురువారం పంచాయతీ కార్యదర్శి సుబ్బారావుతో కలిసి పాజిటివ్ కేసులు ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. పలు జాగ్రత్తలు పాటించాలని, ఇంటి వద్దనే ఉండాలని తెలియజేశారు. అదే విధంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు. ముఖ్యమైన పని ఉంటే తప్ప అనవసరంగా బయట తిరిగి వద్దన్నారు. ఇంట్లోనే ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆనంతరం గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. వీధుల్లో బ్లీచింగ్ చల్లి ప్రతి ఇంటి గేట్లకు ద్వారాల వద్ద హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ సాయి తదితరులు పాల్గొన్నారు.    

ఆంధ్రప్రదేశ్

ఈవ్ టీజర్ కి బుద్ధి చెప్పిన పోలీసులు, పోలీస్ స్టేషన్ కి తరలింపు

బుచ్చిరెడ్డిపాలెం ఏప్రిల్ 25 ( పున్నమి విలేఖరి ) బుచ్చిరెడ్డిపాలెము పట్టణంలో ఓ యువకుడు, ఓ అమ్మాయిని స్థానిక వైఎస్ఆర్ విగ్రహం సెంటర్ నుండి జొన్నవాడ సెంటర్ వరకు బైక్ పై ఫాలో చేస్తూ వచ్చి హెరైజ్ చేస్తుంటే ఆ యువతి చాలా సేపు అతనిని వారించినా లాభంలేక స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక యస్ ఐ ప్రసాద్ రెడ్డి సకాలంలో స్పందించి తన సిబ్బందిని పంపి ఆ యువకున్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఫోన్ చేసిన వెంటనే స్పందించిన పోలీసుల పనితీరుపై పలువురు ప్రజలు తమ మనో భావాలు పున్నమి విలేఖరికి తెలుపుతూ ఇంతకు ముందు కూడా ఇలానే బుచ్చి యస్ఐ ప్రసాద్ రెడ్డి వారి సిబ్బంది చాలా కేసుల విషయంలో తమదైన శైలిలో ప్రతిభ చూపించారంటూ ప్రజలందరూ హ్యట్సఫ్ టూ పోలీస్ అంటూ నినాదాలు చేశారు.