Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Blog

Featured

మనుబోలు లో ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవం

మనుబోలు( పున్నమి విలేఖరి)6,ఏప్రియల్ :భారతీయ జనతా పార్టీ 38 వఆవిర్భావ దినోత్సవ వేడుకలను మనుబోలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల శాఖ అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి ,జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు ఆద్వర్యంలో మనుబోలు బైపాస్ కూడలి నందు బిజెపి రాష్ట్ర నాయకురాలు బైరెడ్డి శబరి బిజెపి జెండాను ఆవిష్కరించారు . అనంతరం నాయకులు మాట్లాడుతూ శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ ఏ ఉద్దేశంతో పార్టీని స్థాపించారో ఆయన ఆశయాలకు అనుగుణంగానే నేడు భారత ప్రధాని నేరంద్రమోడీ ముందుకు తీసుకెళ్లుతున్నట్లు పేర్కొన్నారు. దేశం కోసం ధర్మ కోసం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నట్లు వివరించారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి నేడు దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతుండటంతో పాటు ప్రపంఛంలోనే అతి ఎక్కువ సభ్యత్వం కల్గిన అతి పెద్ద పార్టీగా బిజెపి కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో నూతనంగా దేశ పరిపాలన రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, అమలు చేసిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్లి నాయకులు ప్రజలందరికీ తెలియజేయాలని అన్నారు .ఈ కార్యక్రమంలో నాయకులు వీర ప్రతాప్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు .

Featured

నవరత్నాలు పేదలపాలిట వజ్రాలు వైకాపా: ఎంపిటిసి అభ్యర్థి సుధాకర్ రెడ్డి

నవరత్నాలు పేదల పట్లవజ్రాలు:ఎంపిటిసి అభ్యర్థి అల్లంపాటి సుధాకర్ రెడ్డి అనంతసాగరం మండలం: అనసాగరం గ్రామపంచాయతీ సెగ్మెంట్ బిట్_2 వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి అల్లం పాటి సుధాకర్ రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పంచాయతీలోని ఇంటి ఇంటికి వెళ్ళి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేదల పట్ల వజ్రాలని, ప్రజలు కష్టాలు తెలిసిన నాయకుడు మన ప్రియతమ నాయకుడు సియం వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారని కొనియాడారు.

Featured

రైతు ఉత్పత్తి దారుల శ్రేయస్సే నాబార్డు లక్ష్యం :నాబార్డ్ ఏజీఎం రవి సింగ్

అనంతసాగరం మండలం: రైతు ఉత్పత్తి దారుల సంఘం యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో నాబార్డ్ ఏజీఎం రవి సింగ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని సమీక్ష సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు ఉత్పత్తి దారుల సంఘాలు వాటాధనాన్ని ఎక్కువ పెంచుకుని ని షేర్ క్యాపిటల్ మెరుగుపరుచుకోవాలని సూచించారు. వ్యవసాయానికి కావలసిన యంత్ర పరికరాలు, పనిముట్లు ,విత్తనాలు మరియు ఎరువులు సస్యరక్షణ మందులు ఎఫ్ పి ఓ ల ద్వారా తెచ్చుకుంటే ఆర్థిక భారం తగ్గుతుంది. ఎఫ్ బి ఓ లకు నాబార్డు ద్వారా ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని రైతులకు భూసార పరీక్షలు చేయిస్తామని రైతులకు కావలసిన ప్రాసెసింగ్ యూనిట్లు శీతల గిడ్డంగులు గోదాములు మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నాబార్డు వారు రైతు ఎఫ్ బి ఓ లకు బ్యాంకుల నుండి హార్టికల్చర్ అగ్రికల్చర్ తదితర శాఖల నుండి వచ్చే నిధులను ఇప్పించగలరని తెలిపారు. నాబార్డు ద్వారా కొన్ని స్కీములు 70 శాతం మరియు 50 శాతంలతో సహాయం చేయగలరు అని చెప్పినారు. ఈ సమావేశంలో అవార్డ్ ఎన్జీవో డైరెక్టర్ ఎం రమణ గారు మాట్లాడుతూ అనంతసాగరం రైతు ఉత్పత్తిదారుల సంఘం నిర్వహణకు నాబార్డు వారి ఆర్థిక సహాయంతో మరియు సంఘం యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క సహకారంతో ఎఫ్ పి ఓ అన్ని విధాల ముందుకు తీసుకుపోగలమని మరియు ఎఫ్ డి ఓ లోని రైతులకు అవసరమయ్యే అన్ని ప్రయోజనాలను చేకూర్చాలని భరోసా ఇచ్చారు. ఎఫ్ బి ఓ యొక్క అధ్యక్షులు “అక్కల రెడ్డి అంకిరెడ్డి” గారు మాట్లాడుతూ వెనుకబడిన మా ప్రాంతమునకు నాబార్డు వారి సహాయంతో అవార్డు ఎన్జీవో వారు సంఘాన్ని ఏర్పాటు చేసి మా యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది అందుకు ధన్యవాదాలు తెలియజేశారు .ఈ ఎస్ పి ఓ కు ముఖ్యంగా పండించే పంటలకు బొప్పాయి మిర్చి నిమ్మ మరియు తదితర పంటలను నిల్వ ఉంచుటకు కోల్డ్ స్టోరేజ్ లు మరియు సరుకు రవాణాకు వాహనమును మరియు పండించిన పంటకు గిట్టుబాటు ధర మరియు దళారీ వ్యవస్థ నుండి కాపాడాలని కోరారు ఈ సమావేశంలో శాఖమూరి సుబ్బారావు గారు ,నర్రా వెంకట్రామయ్య, రామానుజుల రెడ్డి , పెంచల్ రెడ్డి, తదితర బి ఓ డి ఎస్ పాల్గొన్నారు. మరియు ఎఫ్ పి ఓ సి ఈ ఓ డి.శరత్ బాబు, అవార్డ్ ఎన్జీవో స్టాఫ్ కె వాసు మరియు స్థానిక ఎన్జీవో కె. రమణయ్య తదితర రైతులు పాల్గొన్నారు.

Featured Others

అభివృద్ధి, శాంతి కోసం క్రీడల అంతర్జాతీయ దినోత్సవం

అభివృద్ధి, శాంతి కోసం క్రీడల అంతర్జాతీయ దినోత్సవం ఐక్యరాజ్య సమితి 2013లో ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 6‌వ తేదిని అభివృద్ధి శాంతి కోసం క్రీడల అంతర్జాతీయ దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది. 2014లో తొలి ఏడాది ఆ దినోత్సవం యూనెస్కో మార్గదర్శకత్వంలో విజయవంతమైంది. క్రీడలకు పోటీలుగా, శారీరక వ్యాయమంగా, వినోదంగా ఎంతో చరిత్ర వుంది. క్రీడలు మానవ హక్కులలో భాగం కాబట్టి వాటిని అందరికి అందుబాటులోకి తీసుకురావాలి. ప్రభుత్వాల మధ్య అతిస్వల్ప ఖర్చుతో మానవ సంబంధాలు, వివక్ష నిర్మూలన, అభివృద్ధి, శాంతి స్థాపన ప్రయత్నాలకు క్రీడలు దోహదపడుతున్నాయి. ఈ సందర్భముగా ప్రభుత్వాలు మానసిక, శారీరక, సామాజిక అభివృద్ధికి దోహదపడే క్రీడల్ని అన్ని స్థాయిల్లో ప్రోత్సహించాలి.

Featured

ఘనంగా బిజెపి జిల్లా నాయకులు బోలా జన్మదిన వేడుకలు

మనుబోలు (పున్నమి విలేఖరి)1,ఏప్రిల్: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కాగితాల పూర్ గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు బోలా శ్రీనివాసులు 47 జన్మ దినాన్ని పురస్కరించుకొని మనుబోలు శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆలయం వద్ద జిల్లా బిజెపి నేత బోల శ్రీనువాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలను నాటారు. జిల్లా బిజెపి నేత బోలా శ్రీనివాసులు జన్మదిన సందర్భంగా బిజెపి నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి ఎదిగిన బోలాను పలువురు బీజేపీ నేతలు అభినందించడం విశేషం .మండల వ్యాప్తంగా బిజెపి నాయకులు జిల్లా బిజెపి నేత పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ బోలా శ్రీనివాసులు వివాదరహితుడిగా అని మంచి మనిషి అని అందరినీ పార్టీలో కలుపుకొని పోయేవ్యక్తి అని దాదాపు 30 సంవత్సరాల నుంచి బిజెపి పార్టీలో పనిచేస్తూ బిజెపి పార్టీ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు దేశభక్తి భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకుఅనేక పదవులు నిర్వహించారని భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని అని తెలిపారు . ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి,ప్రతాప్, చల్ల లక్ష్మయ్య, ఆంజనేయులు కృష్ణారెడ్డి ,పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Featured

ఉచిత పంటల భీమ అతెన్టికేషన్ పూర్తి

అనంతసాగరం మండలం: సచివాలయం 1గ్రామ ఉద్యాన సహాయకురాలు మై మున్నీసా గారు గత ఏడాది ఖరీఫ్ 2020సీజన్లో ఉచిత పంటల బీమా కింద వేరుశనగ, సజ్జలు, వరి పంటలు వేసిన రైతుల చేత అతెన్టీకేషన్ వేయించడం జరిగింది.

Featured

వాయిదాల పర్వం లో అనంతసాగరం ఉపసర్పంచ్ ఎన్నిక

అనంతసాగరం మండలం: అనంతసాగరం గ్రామపంచాయతీ లోని ఉప సర్పంచ్ ఎన్నిక మళ్లీ వాయిదా పడినట్టు తెలిపిన విస్తరణాధికారి జి. శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతసాగరం గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ పదవిఎన్నికకు డిసైడింగ్ అధికారిగా నియమించారని, బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశమని సభ్యులందరికీ కూడా నోటీసు ఇవ్వడం జరిగిందని అయితే 12:30 అయినా ఒక్కరు కూడా రాకపోవడంతో ఉప సర్పంచ్ అభ్యర్థి ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు పత్రికా ముఖంగా తెలిపారు. గతంలో కూడా ఒకసారి ఉప సర్పంచ్ అభ్యర్థిగా రాజారెడ్డి గారు తప్ప ఏ ఒక్కరు రాకపోవడంతో అప్పుడు కూడా వాయిదా వేసినట్లు తెలియజేశారు.

Featured ఆంధ్రప్రదేశ్

చెముడుగుంటలో ‘మనబడికి పోదాం’

చెముడుగుంటలో ‘మనబడికి పోదాం’ వెంకటాచలం, మార్చి 30 (పున్నమి విలేకరి): మండలంలోని చెముడుగుంట పంచాయతీలో ‘మనబడికి పోదాం’ కార్యక్రమాన్ని ఎంఈఓ మధుసూదన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ హెచ్ఎం ఏవి రమేష్ కుమార్, సి ఆర్ పి హరి చెముడుగుంట పంచాయతీలోని నక్కలకాలనీ, బురాన్ పూర్, కుంకుమ పూడి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. బడి బయట పిల్లలను గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వారి తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం గుర్తించిన పిల్లలను సమీపంలోని పాఠశాలలో చేర్పించి వారి వివరాలను యాప్ లో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ కే. ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.

Featured పిల్లలకు

తనశాంతమె-తనకురక్ష.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.

శాంతము గలవారు ఎంతటి కష్టతరమైన కార్యాన్నిసాధించగలరు . శాంతమూర్తులు దయాదాక్ష్యణ్యాలు, జాలీ,సానుభూతి, సేవాభావం, ఉపకారబుధ్ధికలిగిఉంటారు.”కోపమున ఘనత కొంచమైపోవును “అన్నాడు వేమన.”తనకోపమెతనశత్రువు-తనశాంతమె తనకురక్ష” అంటాడు సుమతిశతక కర్త.”శాంతమూ లేక సౌఖ్యములేదు”అంటారు త్యాగయ్య.కలహం,కలత-కల్లోలం-దౌర్జన్యం-భయం-దురాశ- ఇవన్ని మనిషికి నెమ్మదిలేకుండాచేస్తాయి.నిరాశ,నిస్పుహ,ఆవహింపబడి నరకప్రాయమైన జీవితం లభిస్తుంది.శాంతమూర్తిఅయినవారు సమాజపరంగా ఎంతోగౌరవింపబడతారు. శాంతమె జనులను జయము నొందించును శాంతముననె గురుని జాడతెలియు శాంత భావ మహిమ చర్చింప లేమయా విశ్వదాభిరామ వినురవేమ! శాంతమూర్తిఅయిన బుధ్ధుడు దేశాటనచేస్తూ అడవిమార్గన వెళుతూ,దారిలోని ఒచెరువు గట్టున ఉన్న చెట్టునీడలో ధ్యానంచేస్తూ కూర్చున్నాడు.అదేబాటన గుర్రంపైవెళుతున్న ఆదేశరాజు, ధ్యానంలోఉన్నబుద్ధునిచూసి “ఏయ్ దొంగసన్యాసి కళ్లుతెరువు పనికి సోమరులై తేరగాదొరికే తిండి తింటూ బ్రతికేవాళ్లు సమాజానికి చీడపురుగులు నీలానేనుఉంటే ఇన్ని భయంకరయుధ్ధాలు చేసేవాడినా ఇంతసువిశాల రాజ్యంస్ధాపించేవాడినా”అంటూ పలుదుర్బాషలాడాడు. కళ్లుతెరిచిన బుద్దుడు”కూర్చోండి మహారాజా నన్ను తిట్టి అలసిపోయారు. ఈచల్లని నీరుతాగి సేదతీరండి”అన్నాడు .రాజుకు కోపంపోయింది నేను ఇంతగా తిట్టినా ఇతను యింత శాంతంగా ఎలా ఉండగలిగాడు అనుకున్నాడు. అదిగమనించినబుద్దుడు చిరునవ్వుతో”నాయనా ఇంతకుమునుపు కొందరు తీపిపదార్ధాలు తీసుకువచ్చి నన్ను స్వీకరించమన్నారు.నేను తిరస్కరించాను.వాటినివారే తిరిగితీసుకువెళ్లారు.ఇప్పుడు అలనా నే నీతిట్లను నేను స్వీకరించడంలేదు”అన్నాడు.చేతులు జోడించిన మహారాజు “అయ్యనన్నుమీశిష్యుడిగా స్వీకరించండి.కోపము,ఆశ,అసూయ,భయం మొదలైనగుణాలు అశాంతికి గురిచేస్తాయి.సంతృప్తి,శాంతి,ప్రేమ ఆనందాన్నికలిగిస్తాయి అనితెలుసుకున్నాను.అన్నాడు .ప్రేమగా అతన్ని ఆశీర్వదించాడుబుధ్ధుడు.రాజుమనసు మారింది రక్తపాతాలుజరిపిన వాడు శాంతమూర్తిగామారిపోయాడు.బాలలు ఆరాజు ఎవరోతెలుసా? అతనే ‘అశోకచక్రవర్తి’ బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.  

Featured

ఆపస్ ఆత్మీయ సన్మాన సమావేశం

అనంతసాగరం మండలం స్థానిక జె జె ఎన్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ( ఏపీ యు ఎస్) ఆధ్వర్యంలో ప్రమోషన్ పొందిన బదిలీ అయిన ఉపాధ్యాయులకు ఆత్మీయంగా సన్మాన సమావేశం నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి పి సి వి రాఘవరెడ్డి ఉపాధ్యాయ సేవలో ఆపస్ అనంతసాగరం మండల శాఖ ఎనలేని సేవ చేస్తున్నది తెలియజేశారు. సన్మాన ఉత్సవంలో ప్రమోషన్ పొందిన బదిలీ అయిన ఉపాధ్యాయులు, మహిళాఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆపస్ సీనియర్ కార్యకర్త చల్లా. సుధారాణి గారు మహిళా కార్యకర్తలు తరుపున ఆనందం వ్యక్తం చేస్తూ ఆపస్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు చంద్రగిరి. శ్రీనివాసులు ఆర్ .వెంకటరమణా రెడ్డి, వి .రామకృష్ణ రెడ్డి అధ్యక్షులు మైలి. వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి డి .వెంకు రెడ్డి, పి. శింబు కృష్ణ, ఎం .వెంకటయ్య బి. వెంకటేశ్వర్లు. ఏఎస్ పేట. మర్రిపాడు, ఆత్మకూరు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.