Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Blog

Featured

సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

(పున్నమి ప్రతినిధి, బుచ్చి) సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఛైర్‌ పర్సన్‌ మోర్ల సుప్రజ పేర్కొన్నారు. స్థానిక అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు తెలియచేయాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ఫీవర్‌ సర్వేను తప్పక చేపట్టాలని సూచించారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కౌన్సిలర్లు పమ్రీలమ్మ, షాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.wig shop cheap wigs online cheap wigs online cheap dildos cheap dildos wig shop cheap wigs online proshop nfl proshop nfl wig shop fiitg jerseys cheap wigs online wig shop cheap dildos cheap wigs online

Featured

నారా పాదయాత్ర చేయబోతున్నారా……? ` నియోజకవ్గాలకు వెళ్తేనే పార్టీపై పట్టు సాధిస్తారంటున్న నేతలు

మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో బలమైన నేతగా ఎదిగేందుకు మాజీ మంత్రి నారా లోకేష్‌ త్వరలో కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే నారా లోకేష్‌ పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసి విజయం సాధించడంతో అదే పందాలో లోకేష్‌ కూడా నడిచే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సారి సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లోకేష్‌ ఈ నిర్ణయం తీసుకున్నారేమోనన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ పాదయాత్ర చేయడంతో 175 నియోజకవర్గాల్లోని కార్యకర్తలు, నాయకులుతో సమావేశాలు నిర్వహించి ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది నాయకులు మాత్రం పాదయాత్ర కన్నా స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు , ప్రజలతో కలిసి పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలి అనేదానిపై చర్చిస్తే మంచి ఫలితాలు ఉంటాయనే భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు పార్టీ నేతలతో ఎలా కలిసిపోయారో అలాగే లోకేష్‌ కూడా పార్టీ పై పట్టు సాధించాలంటే పార్టీ నేతలు, నాయకులతో కలిసి పోవాలని పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయా…? లేదా..? అన్న విషయాన్ని పక్కన పెడితే పార్టీ నాయకులతో లోకేష్‌ కలిసి పోతే రాజకీయంగా అనుభవంతో పాటు పార్టీపై పూర్తి పట్టు సాధించుకోవచ్చని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. లోకేష్‌ పార్టీలో తిరుగులేని నేతగా ఎదగాలంటే తండ్రి చాటు బిడ్డలా కాకుండా తనకంటూ ఓ పత్య్రేకమైన మార్క్‌ను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే చందబ్రాబు రాజకీయ వారసురడిగా ఎదిగిన లోకేష్‌ నియోజకవర్గాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోగలలిగితే రాజకీయంగా అనుభవం కూడా వస్తుందన్నది కొందరు నేతల అభిప్రాయం. పాదయాత్రతో లోకేష్‌ తిరుగులేని నేతగా ఎదగడం సాధ్యపడదంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా లోకేష్‌ పాదయాత్ర చేస్తాడా… లేదా.. అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Featured

బుచ్చి పట్టణ అభివృద్ధికి సహకరిస్తా: నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

బుచ్చి పట్టణ అభివృద్ధికి సహకరిస్తా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుచ్చి పట్టణ అభివృద్ధికి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి కృషి చేస్తానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ సుప్రజ తోపాటు వార్డు కౌన్సిలర్లు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని శుక్రవారం సాయంత్రం ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చి మండలం తో తనకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలతోపాటు బుచ్చి పట్టణ అభివృద్ధికి నిధులను సైతం అందజేస్తామన్నారు. కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు వారి వార్డుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బుచ్చి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఎంపీ ఆదాలను గజమాలతో సత్కరించారు. జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పుట్ట సుబ్రమణ్యం నాయుడు, విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, సయ్యద్ ఫయాజుద్దీన్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Featured

విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

(పున్నమి ప్రతినిధి, నెల్లూరు ) ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు సూచించారు. గురువారం నగరంలోని బీవీఎస్‌ గర్ల్స్‌ హైస్కూల్లో విద్యార్థినులకు మహిళా రక్షణ చట్టాలపై శ్రీరామరాజు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యకమ్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కొన్ని చట్టాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. మహిళలు ఆపద సమయంలో ఈ చట్టాల ద్వారా రక్షణ పొందవచ్చన్నారు. ప్రతి ఒక్క మహిళ తమ సెల్‌ఫోన్‌లో ఈ చట్టాలకు సంబంధించిన యాప్‌ల అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యార్థినులకు బ్యాడ్‌ టచ్‌, గుడ్‌టచ్‌, ఈవ్‌టీజింగ్‌, దిశ యాప్‌ తదితరాలపై అవగాహన ఎంతో అవసరమన్నారు. అనంతరం దిశ యాప్‌ గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

Featured

వేదగిరి దేవస్థాన ఛైర్మన్‌గా వేమిరెడ్డి

(పున్నమి ప్రతినిధి,నెల్లూరు) ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వేదగిరి లక్ష్మినరసింహస్వామి దేవస్థాన ఛైర్మన్‌గా వేమిరెడ్డి సురేంద్రరెడ్డి నియమితులైనట్లు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయం నేడొక ప్రకటనలో పేర్కొంది. సభ్యులుగా అల్లూరు దినేష్‌కుమార్‌, పామూరు మల్లిఖార్జున్‌రెడ్డి, నెట్టెం రఘురామయ్య, రాపూరు అంజయ్య, వినుకోటి ప్రసన్న లక్ష్మి, జయమ్మ, సుంకర మస్తానమ్మ, లక్ష్మమ్మను నియమించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

Featured

అధిక మోతాదులో పురుగు మందులు వాడొద్దు

(పున్నమి ప్రతినిధి, విడవలూరు ) రబీ సాగులో అధిక మోతాదులో ఎరువులు,పురుగు మందులు వినియోగించవద్దని, అధికారుల సూచనల మేరకు వాడాలని ఏఓ వెంకటకృష్ణయ్య సూచించారు. గురువారం మండలంలోని వావిళ్ల గ్రామంలో పోలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ రైతులు అధికారుల సూచనల మేరకు పురుగు మందులు, ఎరువులను వాడడం ద్వారా పంట దిగుబడి బాగుటుందన్నారు. అంతేకాకుండా పెట్టుబడులను కూడా తగ్గించుకోవచ్చన్నారు. తగిన మోతాదుల్లో ఎరువులను, పురుగు మందులను వాడినట్లతే మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులను, పురుగు మందులను రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.wig shop cheap wigs online cheap wigs online cheap dildos cheap dildos wig shop cheap wigs online proshop nfl proshop nfl wig shop fiitg jerseys cheap wigs online wig shop cheap dildos cheap wigs online

Featured

37వ డివిజన్‌లో జగనన్న మాట -` కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట

(పున్నమి ప్రతినిధి) కార్యకర్తల నివాసాలకు వెళ్ల వారి కష్ట సుఖాలను తెలుసుకునేందుకు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేపట్టిన జగనన్న మాట ` కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట గురువారం 37వ డివిజన్‌లో 59వ రోజు సాగింది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డివిజన్‌లోని క్రాంతినగర్‌, రాంనగర్‌, మిలటరీ కాలనీ ప్రాంతాల్లో స్వయంగా కార్యకర్తల ఇళ్లకు వెళ్ళి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యకర్తలకు అండగా తానున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. కార్యకర్తల ఇళ్లకి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకు రావాలన్నారు.

Featured

పాత వాహనాలు వేలం

(పున్నమి పత్రినిధి, బుచ్చి) వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 23వ తేదిన వేలం పాట నిర్వహించనున్నట్లు ఎస్‌ఈబీ సీఐ సూర్యనారాయణ తెలిపారు. వాహనాల వేలంకు సంబంధించిన వివరాలను ఆయన విలేకరులకు వివరించారు. బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్‌ పరిధిలో పట్టుబడిన 14 వాహనాలు, ఆత్మకూరులో పట్టుబడిన 15 వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ కృష్ణకిషోర్‌ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదిన బుచ్చి ఎస్‌ఈబీ కార్యాలయంలో ఈ వేలం నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వారు పది శాతం రుసుమును చెల్లించడంతో పాటు ఆధార్‌, పాన్‌కార్డు దృవీకరణ పత్రాలు అందచేయాల్సి ఉంటుందన్నారు. ఇదే పద్ధతిని జిల్లా అంతా ఆచరిస్తే బాగుంటుందని జిల్లా పజ్రలు కోరుకుంటున్నారు.

Featured

ముస్లింలంతా కోటంరెడ్డికి రుణపడి ఉంటాం

నెల్లూరు జిల్లా ముస్లింలంతా రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని ముస్లిం నాయకులు సయ్యద్‌ సమీ అన్నారు. ఆధునిక భారత దేశంలో ఎక్కడా కట్టనటువంటి విధంగా ఈ ఈద్గా నిర్మాణం చేపడుతున్నామన్నారు.నగరంలోని బారాషాహీద్‌ దర్గాలో నిర్మాణంలో ఉన్న ఈద్గా పనులను మార్చి 25 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. ఆరోజు రూరల్‌ శాశసన సబ్యలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి చేతుల మీదుగా ముస్లిం జాతికి అంకితమిచ్చే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఆధునిక భారత దేశంలో ఇలాంటి ఈద్గాని ఎక్కడా కట్టలేదన్నారు. ఈ ఘనత కేవలం రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ ఈద్గాని ముస్లిం జాతికి అంకితం చేసే కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పీఠాధిపతులను పిలుస్తామని తెలిపారు. ఈ ఈద్గా నిర్మాణానికి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎంతో కృషి చేశారని ప్రసంశించారు.

Featured

సచిన్ దత్తత గ్రామం పుట్టంరాజువారి ఖండ్రిగలో తాగునీటి సమస్య పరిష్కరించండి*

*సచిన్ దత్తత గ్రామం పుట్టంరాజువారి ఖండ్రిగలో తాగునీటి సమస్య పరిష్కరించండి .సచిన్ దత్తత గ్రామం పుట్టంరాజువారి కండ్రిక లో తాగునీటి సమస్య వెంటాడుతుంది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదలకు అక్టోబర్ మాసంలో గ్రామానికి తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి తాగునీటి సౌకర్యం లేక పుట్టంరాజువారి కండ్రిక వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే సమస్యలను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేదు . దీంతో కొమ్మనేటూరు ఎంపిటిసి గడ్డం సహదేవ్ సమస్యను ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకు వచ్చారు. కొమ్మనేటూరు పంచాయతీ పరిధిలో ఓ పరిశ్రమ ప్రారంభానికి వచ్చిన ఎంపీ గురుమూర్తి సమస్యను వివరించారు. సుమారు 130 గడప ఉన్న గ్రామంలో ఆరు నెలలుగా తాగునీరు సరఫరా చేయడం లేదని చెప్పారు. దీంతో ఎంపీ గురుమూర్తి సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి తాగునీరు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి ఈ సందర్భంగా ఆదేశించారు. దీంతో క్కొమ్మనేటూరు ఎమ్ పి టి సి గడ్డం సహదేవ తో సహా గ్రామస్తులు ఎంపీ గురుమూర్తి కి కృతజ్ఞతలు చెప్పారు.