Thursday, 9 July 2026

Blog

Featured

బొడిచెర్ల వారి దాతృత్వం

పున్నమి ప్రతినిధి షేక్.రసూల్ అహమద్ : గత నలభై ఒక్క రోజులుగా ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా వెంకటగిరి పరిసర గ్రామాల్లోని జీవనోపాధి లేని నిరుపేదల ఆకలిని గుర్తించిన శ్రీ పరమేశ్వర వస్త్రాలయం అధినేత,ఘంటసాల కళాక్షేత్రం అధ్యక్షులు, ప్రణతి సంస్థ గౌరవాధ్యక్షులు అయిన బొడిచర్ల సుబ్బయ్య వారి ధర్మపత్ని సరస్వతమ్మ దంపతుల దాతృత్వంతో ప్రణతి సంస్థ ఆధ్వర్యంలో 13వేల రూపాయలు పేదప్రజల భోజనాదులకు కోసం అందించడం జరిగింది. ఈ సందర్బంగా సత్యవాది, గాంధేయవాదులు అయిన బొడిచెర్ల సుబ్బయ్య గారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా పేదవారిని ఆదుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. స్వీయనిర్బంధం, క్రమశిక్షణతో ఉంటూ కరోనాను తరమికొట్టవచ్చునని ఆయన చెప్పారు. ప్రకృతి పరిరక్షణే అన్ని ధర్మాల్లోకెల్లా ఉత్తమమైనదని, దీనికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. కరోనా లాంటి మహా విపత్తులోనుంచి బయటపడేందుకు భౌతికదూరంతో పాటు శుచి శుభ్రతను పాటించాల్సిన అవసరం ఉందని సుబ్బయ్యగారు పేర్కొన్నారు. ఈ ఆహార కార్యక్రమ పర్యవేక్షకులుగా ప్రణతి సభ్యులు సుంకర రవికుమార్, చేబ్రోలు రవీంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది.

Featured

బండి వేణుగోపాల్ రెడ్డి దాతృత్వం పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో మండలంలో 3 లక్షల కోడిగుడ్లు లు పంపిణీ

రాపూరు, మే 12, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలంలో 3 లక్షల కోడిగుడ్లు లు పంపిణీలో భాగంగా మండల ప్రజలకు మంచి పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ఒకొక్క కుటుంబానికి డజన్ గుడ్లు లెక్కన మండలంలోని తెగచర్ల లో 6600,గరిమెన పెంట లో4200,గోనుపల్లి లో6920, రాంకురు లో 1680,తూమాయి లో 2880, రెగడపల్లి లో 2180, ఓబులాయపల్లి లో 4380, గుండవోలు లో 6000, నెల్లేపల్లి లో1440,పెనుబర్తి లో 6600, ఏపూరు లో 4320,బొజ్జనపల్లి లో 1380,వెలుగోను లో 2640 గుడ్లు పంపిణీ చేయగా నేడు కంభాలపల్లి, అదురుపల్లి పంచాయతీ, తాతిపల్లి, ఎం.వీ.పురం,శానాయపాలెం, రాపూరు పంచాయతీ పరిధిలో గల అన్ని గ్రామాల్లోని ప్రజలకు లక్ష కోడి గుడ్డులు పంపిణీ కార్యక్రమాని రాపూరు వైస్సార్సీపీ నేత వైకాపా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బత్తిన పట్టాభిరామిరెడ్డి నివాసం వద్ద ఆయనతో కలసి రాపూరు మాజీ ఎంపీపీ, వైకాపా మండల కన్వీనర్ దివంగత నేత బండి క్రిష్ణారెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి గారు రాపూరు పట్టణంలో ప్రతి కుటుంబానికి డజన్ గుడ్లు లెక్కన పంపిణీ చేసారు.ఇప్పటికే మండలంలో పలు పంచాయతీల్లో ఉద్యమంలా ప్రారంభించి పంపిణీ చేసిన బండి వేణుగోపాల్ రెడ్డి మండలంలోని పెద్ద పంచాయతీ అయిన రాపూరు ప్రజలకు గుడ్లు పంపిణీ చేశారు.

Featured

శ్రీసిటీలో కరోనా అవగాహన పోస్టర్ల విడుదల 

శ్రీసిటీలో కరోనా అవగాహన పోస్టర్ల విడుదల శ్రీసిటీ, మే 11, 2020: పరిశ్రమల ఉత్పత్తుల పునః ప్రారంభాన్ని పురస్కరించుకుని, కరోనావైరస్ వ్యాప్తి నివారణపై పరిశ్రమల ఎగ్జిక్యూటివ్ లు, కార్మికుల మధ్య అహగాహన కల్పించేందుకు, స్థానిక వైటల్ పేపర్స్ పరిశ్రమ యాజమాన్యం సహకారంతో శ్రీసిటీ కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన సమాచార పోస్టర్లను విడుదల చేసింది. సోమవారం ఉదయం స్థానిక బిజినెస్ సెంటర్లో శ్రీసిటీ డెవలప్మెంట్ కమిషనర్ ఆర్.ముత్తురాజ్, డీఎస్పీ విమలకుమారి లాంఛనంగా పోస్టర్లను విడుదల చేశారు. పరిశ్రమ వర్గాలకు సరైన సమాచారంతో అవగాహన కల్పించడం, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీ చేస్తున్న సలహాల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవడం ఈ వైరస్ వ్యాప్తిని నివారించడంలో ఇందులో ముఖ్యమైన అంశాలుగా పేర్కొన్నారు. కోవిడ్ లక్షణాలు, దాని వ్యాప్తిని నివారించే పద్ధతులు, సామాజిక దూరం ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడటం వంటి సమాచారాన్ని పోస్టర్లలో వివరించారు.  శ్రీసిటీలోని అన్ని యూనిట్లకు దీనిని పంపిణీ చేయడంతో పాటు పలు ముఖ్యమైన ప్రదేశాలలో దీనిని ప్రదర్శించనున్నట్లు శ్రీసిటీ ప్రతినిధులు తెలిపారు.

Featured గూడూరు

గూడూరు శ్రీమంతులు

పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ : కోట్ల రూపాయల ఆస్తి పరులు వెయ్యి రూపాయలు సహాయం చేయడం గొప్పకాదు. వెయ్యిరూపాయలు జేబులో ఉన్నప్పుడు అది పూర్తిగా పేదలకు ఖర్చు పెట్టడం చాలా గొప్ప విషయం. ఇలాంటి దాతృత్వం కేవలం మహానుభావులకు మాత్రమే సాధ్యమవుతుంది. మన గూడూరులో ఇలాంటి మహానుభావులకు కొదవేలేదు. ఉదాహరణకు మిత్ర ఫౌండేషన్, మై ఫ్రెండ్స్ అసోసియేషన్, స్వాంతన, ఈద్గా యూత్ కమిటీ, ఆల్ ఇస్లాం, మఖ్దూమ్ చారిటీ లాంటివి పేదప్రజల అభ్యున్నతికి ఎదో ఒక రూపేణా తమ వంతు సహాయం చేస్తున్నాయి. ఈ కోవకు చెందినదే గూడూరికి చెందిన హార్ట్ టూ హాండ్ (H2H) ఫౌండేషన్ సంస్థ. ఈ సంస్థ గత రెండు నెలల నుంచి నిరంతరంగా పేదప్రజల అవసరాలకు తమ తోడ్పాటు అందిస్తున్నది. ఈ సంస్థ అధ్యక్షుడు వాకా నిరంజన్ వారి మిత్రులు తమ శక్తికి మించి చేస్తున్న సహాయకార్యక్రమాలు శ్రీమంతులను సైతం సిగ్గుపడేలా చేస్తున్నాయి. నేడు దేశంవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ సామాన్యులను తీవ్ర కష్టాల్లోకి నెట్టివేయబడిందని అందరికి తెలిసిన విషయమే. ఇలాంటి సందర్భంలో పేదప్రజలను ఆదుకోవడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని, అందులో భాగంగా గూడూరులోని గాంధీనగర్ కు చెందిన కార్మికులు మరియు పేదవారికి నిత్యావసర సరుకులను పంచడం జరిగిందని వాకా నిరంజన్ తెలియచేసారు. అలాగే నెల్లటూరు దగ్గర ఉన్న నిమ్మకాయల మార్కెట్టుకు సమీపంలోని నిరుపేదలకు మొత్తం దాదాపు 80 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణి చేశామని నిరంజన్ చెప్పారు. చిన్నపిల్లలకు తినుబండారాలతో పాటు మాస్కులు సైతం పంచినట్టు నిరంజన్ పేర్కొన్నారు. కరోనా వ్యాధి దరి చేరకుండా భౌతిక దూరం, పరిశుభ్రత లాంటి విధానాలు యొక్క అవసరాన్ని ప్రజలకు వివరిస్తున్నట్టు హార్ట్ టూ హాండ్ (H2H) సంస్థ తెలిపారు. ఈ కార్యక్రమంలో H2H ఫౌండేషన్ సభ్యులు వరప్రసాద్ ,ప్రభాకర్, రమేష్, కార్తిక్, వంశీ, ముని దయాకర్ తో పాటు స్థానికులు పాల్గొన్నట్టు వాకా నిరంజన్ వివరించారు.

రాపూరు మండల సమితి ఆధ్వర్యంలో 42వ రోజు అన్నదానం

రాపూరు, మే 11, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా లాక్ డౌన్ సందర్భంగా రాపూరు మండలం సేవాసమితి ఆధ్వర్యంలో ఈరోజు రాపూరు వాటర్ ట్యాంక్ సెంటర్, లిప్రసి కాలనీ, సిద్దల్య సెంటర్ st లకు నవాబు పేట ST లకు 500 మంది నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగిందని, ఈ కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు అండగా ఉంటామని మండల సేవ సమితి సబ్యులు తెలిపారు. ఈ రోజు కారయక్రమానికి డాక్టర్ మతార్ సహీబ్ గారు పేదలకు 500 మందికి స్వీట్లు మరియు హాట్ పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాపూరు మండల సేవ సమితి సభ్యులు మదమాల పిచ్చిరెడ్డి, దామిశెట్టి సురేష్ (గోల్డ్) కొత్త హజరత్తయ్య, కంభాల వెంకటరత్నం, సయ్యద్ జలీల్ అహ్మద్,పిట్టబోయిన వెంకటసుబ్బయ్య , పాలవల్లి హరినాధ్, దందోలు తిలక్ రెడ్డి,శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి,కేతా అమర్ నాద్ధ్ రెడ్డి, బులాగాకుల మునీంద్రా రెడ్డి,బులాగాకుల మనోహర్ రెడ్డి,దామిశెట్టి సురేష్ (మినుములు),ఏటూరి మురళీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాపూరు మండల సేవ సమితి వారు డాక్టర్ మతర్ సాహెబ్ గారిని అభినందించడం జరిగింది.

Featured గూడూరు

నిరాశ్రయులకు నిత్యఅవసర సరుకులు.H2H

గూడూరు లోని ఇందిరానగర్ కాలనీ నిరాశ్రయులకు నిత్యఅవసర సరుకులు హార్ట్ టు హ్యాండ్ (H2H) ఫౌండేషన్ సభ్యులు ఇవ్వడం జరిగింది దీనిలో వకానిరంజన్, వరప్రసాద,ప్రభాకర్, రమేష్, కార్తిక్, వంశీ, మరియు ముని దయాకర్ మరియు స్థానికులు పాల్గొన్నారు భవిష్యత్తు లో చాలా కార్యాక్రమాలు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు

Featured

చిల్డ్రన్స్ పార్కు రోడ్డు -లో రత్నమ్మ ఛారిటబుల్ సొసైటీ నెల్లూరు వారిద్వారా సహాయం

ప్రచురణార్దం. ——————— నెల్లూరు – చిల్డ్రన్స్ పార్కు రోడ్డు – రాంజీ నగర్ 9వ వీధిలో ఇల్లు వాకిలి లేక చెట్ల క్రింద నివాసముంటున్న 25 కుటుంబాల నిరుపేదలకు శ్రీ D. రామచంద్రయ్య అటవీశాఖాధికారి మరియు రత్నమ్మ ఛారిటబుల్ సొసైటీ నెల్లూరు వారిసౌజన్యంతో ఒక్కో కుటుంబానికి 5 కేజీలు బియ్యం +5 కేజీలు కూరగాయలు + 10 కోడి గుడ్లు + శానిటైజర్స్ 16 వ వార్డు YSRCP నాయకులు శ్రీ వేనాటి శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడమైనది. భౌతిక దూరం పాటిస్తూ లబ్ధిదారులకు సూచనలు చేయడమైనది. పద్మనాభ రెడ్డి, నాగేశ్వరరావు మొదలగు వారు సహకారమందించారు. ఇట్లు డా : రాచపాళెం రఘు రత్నమ్మ ఛారిటబుల్ సొసైటీ నెల్లూరు తేది : 07-5-2020 స్థలం : రాంజీ నగర్ నెల్లూరు

ఆంధ్రప్రదేశ్

26 నుండి కోర్టులకు సెలవులు

ఏపీ కోర్టులకు వేసవి సెలవులు ఖరారు అయ్యాయి. హైకోర్టుతో పాటు రాష్ట్రంలోని దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లు,లేబర్ కోర్టులకు సేలవులు ప్రకటించారు. ఈ నెల 26 నుండి జూన్ 12వ తేదీ వరకు హైకోర్టు, అన్ని జిల్లా కోర్టులు,సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు జూన్ 1 నుండి 12వ తేదీ వరకు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు,రెంట్ కంట్రోలర్స్ కోర్టులకు వేసవి సెలవులు మంజూరయ్యాయి.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో 43 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు సంఖ్య 1,930 కు చేరింది.999 మంది చికిత్స పొదుతుండగా,ఇప్పటివరకు 887 మంది డిశ్చార్జ్ అయ్యారు.గత 24 గంటల్లో ముగ్గురు మరణించడంతో కరోనా మరణాలు 44కి చేరాయి.తాజా కేసుల్లో అనంతపురం జిల్లాలో 3,విశాఖ జిల్లాలో 5,గుంటూరు జిల్లాలో 2,చిత్తూరులో 11,కర్నూలులో 6,కృష్ణాజిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.