ఇంకా చక్కగా, పత్రికా శైలిలో పూర్తి వార్తను “పున్నమి” పత్రికకు అనువుగా సరిచూస పొదలకూరు (పున్నమి, జూలై 21): పొదలకూరు మండలం నరసింహ కండ్రిగ గిరిజన కాలనీలో గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలలో ముఖ్యంగా మురుగు కాలువలు మూసుకుపోవడం వల్ల దోమలు పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి మాట్లాడుతూ – “గతంలో ఈ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పేద గిరిజనులకు ఏమాత్రం న్యాయం చేయలేదు. అయితే కోట్ల రూపాయల అవినీతి చేసి, భారీ భవనాలు కట్టించుకుని, ఇప్పుడు అదే అవినీతికి శిక్ష అనుభవిస్తూ జైలులో గడుపుతున్నారు. ఇది కలియుగం న్యాయమే” అని విమర్శించారు. జనసేన కూటమి తరఫున పేదలతో పాటు గిరిజనులకు అండగా నిలుస్తామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాము నర్సింహ కండ్రిగ కాలనీలో సందర్శించిన సమయంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ గమ్మినేని వాణి భవాని నాయుడు, సందూరి శ్రీహరి, సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకులు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిద్దయ్య భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో గొర్రెల మేకల పెంపకం దారుల జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ జిఎంపిఎస్ మండల కమిటీ సభ్యులు కూకుట్ల కృష్ణ ఆధ్వర్యంలో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయగిరిలోని లింగభాసవ గార్డెన్ లో జరిగే గొర్రెల మేకల పెంపకం దారుల మహాసభలలో గొర్రెల కాపరుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు జక్కుల మల్లేష్, శెట్టి నరసింహ, జక్కుల కిష్టయ్య, మాకోల్ సత్తయ్య, నోముల కొమురయ్య, జక్కుల నరసింహ, కుకుట్ల పరమేష్, జక్కుల పెద్ద మల్లేష్, నోముల శంకర్, జక్కుల చిన్న మల్లేష్, బొడ్డు రాజు, చిట్టి సిరిసిల్ల, జక్కుల మహేష్, శివ, సందీప్ లు పాల్గొన్నారు.
రైల్వే కోడూరు నియోజకవర్గం:– *రైల్వే కోడూరు పట్టణ సమస్యలపై ప్రత్యక్ష పరిశీలన – అభివృద్ధి చర్యలకు హామీ ఇచ్చిన ఇంచార్జ్; kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి *వర్షాలకు అస్సలు రోడ్లు లేక అవస్థలు పడుతున్న ప్రాంతాలను స్వయంగా వెళ్లి పరిశీలించిన ముక్కా రూపానంద రెడ్డి త్వరలో పరిష్కారం అందించనున్నట్లు హామీ ఇచ్చారు.* . *గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక, రోడ్డు వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలను ముక్కా రూపానంద రెడ్డి వెంటనే పరిష్కారం అందిస్తామన్న హామీ ఇచ్చారు.* *రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టిసారించిన టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఈ రోజు కోడూరు పట్టణ పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.* వారు రోడ్డు వసతి, భూగర్భ డ్రైనేజ్, మంచినీటి సమస్యలు వంటి అంశాలపై స్థానికులు చేసిన విన్నపాలను పరిశీలించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అవసరాలను గమనించిన నేత , అనంతరం ఆ ప్రాంతాలను పర్యవేక్షించారు. ఈ సమస్యలను ప్రభుత్వానికి నివేదించి తగిన అభివృద్ధి చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. *ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ –* “ప్రతి సమస్యపై సత్వర స్పందన ఇవ్వడమే మా బాధ్యత. ప్రజల అభిప్రాయాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడానికి కుటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని ” తెలిపారు. ఈ పర్యటనలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారాలొచ్చేలా స్పందించిన తీరుకు హర్షం వ్యక్తం చేశారు.
9 మంది స్మగ్లర్లు అరెస్ట్ రైల్వే కోడూరు పున్నమి ప్రతినిధి జూలై 21 అన్నమయ్య జిల్లా బాలపల్లి ఫారెస్ట్ రేంజ్ లో 9 మంది ఎర్రచందనం అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. సోమవారం వారు మీడియాకు వివరాలను కలిగించారు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ డిఎస్పి బాలిరెడ్డి టీం శెట్టిపల్లి బాలపల్లి బిట్ లో ఉదయం క్యూబింగ్ నిర్వహించగా 16 దుంగలు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నా రు.
రైల్వే కోడూరు నియోజకవర్గం:– ఓబులువారిపల్లి మండలం చెన్న రాజుపాడు గ్రామానికి చెంది మహ్మద్ మరియు రెడ్డి భాష గారి ఆహ్వానంతో రైల్వే కోడూరు మండలం వై కోట క్రాస్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మూన్ బేకరి ప్రారంభ కార్యక్రమం ఈ రోజు జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరై రిబ్బన్ కటింగ్ చేసి షాప్ ను ప్రారంభించారు.* ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ – “ప్రతి గ్రామంలో చిన్న పరిశ్రమలు, వ్యాపారాల అభివృద్ధి కోసం మనం కలిసి ముందుకు సాగాలి. ఈ నూతన షాప్ గ్రామ ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని విశ్వసిస్తున్నాను” అని అన్నారు.i అరవ శ్రీధర్ మాట్లాడుతూ – “స్థానిక యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం సంతోషకరం. ఈ షాప్ ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం” అని చెప్పారు.
రైల్వేకోడూరు జూలై 21 పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లి మండలం, రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద గత ఆదివారం 13వ తేదీ మామిడికాయ లారీ, ప్రమాదంలో మృతి చెందిన తొమ్మిది మంది వ్యవసాయ కూలీలకు, ప్రభుత్వం కుటుంబానికి 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి, 10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం తాసిల్దార్ కార్యాలయం వద్ద, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతి పత్రం, ఎమ్మార్వో అమర్నాథ్ గారికి , సమర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, పి శ్రీనివాసులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ. ప్రమోదం జరిగి, వారం రోజులు దాటిన, సెట్టిగుంట వ్యవసాయ కూలీలు , వారి బంధువులు, కాళహస్తి ,వెంకటగిరి 9 మంది అక్కడికక్కడే మృతి చెందడం, మరో పదిమంది, తీవ్రంగా గాయపడటం జరిగిందన్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించకుండా, గిరిజనులు యానాదులు, పట్ల వివక్షత చూపుతోందని ఆరోపించారు. సెట్టిగుంటలో రెండు కుటుంబాలు తల్లిదండ్రులు, కోల్పోయిన పిల్లలు నలుగురు, మైనర్ పిల్లలు అనాధలుగా మిగిలారన్నారు, ఇప్పటివరకు, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం గానీ,దాతలు గాని, ఒక్క రూపాయి కూడా సహాయం అందలేదన్నారు. ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాజంపేట హాస్పిటల్ లో, క్షతగాత్రులను, పరామర్శించినప్పుడు, సిఐటియు నాయకులు వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేయగా, ముఖ్యమంత్రి చంద్రబాబు తో మాట్లాడి, సహాయం ప్రకటిస్తామని, చెప్పి వారం అయినా, ఒక్క రూపాయి ప్రకటించలేదన్నారు. దీన్నిబట్టి కూటమి ప్రభుత్వం, గిరిజనుల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది అన్నారు. ఈ ఘటనకు ప్రధానంగా, నేషనల్ హైవే రోడ్, చెరువు కట్ట పైన, రక్షణ గోడ లేకపోవడమే, ప్రమాదానికి ప్రధాన, కారణమన్నారు. దీనికి, రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాధ్యత వహించాలన్నారు. ఆ గిరిజనులకు ఇంటినిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు.ఇంటికి తలుపు కూడా లేని దౌర్భాగ్య పరిస్థితిలో జీవిస్తున్నారన్నారు. మూడు ఎకరాలు, ప్రభుత్వం భూమి ఇచ్చిఆదుకోవాలన్నారు. తిరుపతి రొయ్య హాస్పిటల్ లో, బాధితులని ప్రవేట్ హాస్పిటల్కు పొమ్మని ఒత్తిడి తెస్తున్నారన్నారు. బాధితులు వాపోయారన్నారు. ఒక గిరిజనుడు పుత్తూరు నాటువైద్యం చేయించుకున్నారు మెరుగైన వైద్యం అందడం లేదన్నారు. ప్రభుత్వం, మృతుల పట్ల, ముసలి కన్నీరు కార్చందని,ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి, ఇన్చార్జి మంత్రి మాట నిలబెట్టుకొని, వారి కుటుంబాలను ఆదుకొని, న్యాయం చేయాలని, లేకుంటే, బాధితులతో కలిసి కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో, సిఐటియు, మండల కార్యదర్శి, పి జాన్ ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం, మండల కన్వీనర్, బొజ్జ శివయ్య, గిరిజన సంఘం, నాయకులు వెంకటరమణ, వ్యవసాయ కౌలుదారు సంఘం జిల్లా నాయకులు, రమేష్ బాబు, జిల్లా నాయకులు, వెంకటాద్రి,సిఐటియు, ఉపాధ్యక్షులు, లింగాల.యానాదయ్య, సహాయ కార్యదర్శి, నగిరిపాటి ఆనంద్, ముత్యాల శ్రీనివాసులు, బండారు రాజశేఖర్,శివ, రసూల్, హరి నారాయణ, సిఐటియు, ఓబులవారిపల్లె, మండల కార్యదర్శి, నాగి పోగు పెంచలయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు, లతీఫ్, మండల నాయకులు, విష్ణు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
July21 పున్నమి న్యూస్ *శ్రీశైలం లో ఉన్న దేవ బ్రాహ్మణ గాయత్రి పీఠం పునః ప్రారంభం కొరకు కృషి చేస్తాను ఉపాధ్యక్షులు అంబాబత్తుల అండకొండరాముడు రాముడు* బాపట్ల జిల్లా , చీరాల మండలం, ఆమోదగిరి పట్టణం లో ఆంధ్రప్రదేశ్ దేవ బ్రాహ్మణ పండిత అర్చక పురోహిత పరిషత్ చతుర్ధ వార్షిక సర్వసభ్య సమావేశం కార్యక్రమంలో కార్యవర్గ సభ్యుల ఎన్నికలో రాయలసీమ ప్రాంతం నుంచి ఉపాధ్యక్షు పదవికి అంబా బత్తుల అండకొండరాముడు నీ షణ్ముఖ ప్రతిపాదించగా దేవ బ్రాహ్మణ పండిత అర్చక పురోహిత పరిషత్ సభ్యులందరూ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఆమోదించి ఎన్నుకోవడం జరిగిందని తదనానంతరం దేవ బ్రాహ్మణ పండిత అర్చక పురోహిత పరిషత్ అధ్యక్షులు మాన్యశ్రీ చల్లా.రామారావు,శుభాకాంక్షలు ఆశీస్సులు అందజేశారు, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నా గురువర్యులు బ్రహ్మశ్రీ జన రుద్ర రామలింగేశ్వర రావు మరియు దేవా బ్రాహ్మణులు శాలువా పూలదండతో ఘనంగా సత్కరించి వేద ఆశీర్వాదం అందజేశారు. అంబాబత్తుల అండకొండ రాముడు ఆంధ్ర ప్రదేశ్ దేవబ్రాహ్మణ పండిత అర్చక పురోహితు పరిషత్ ఉపాధ్యక్షుడు గా ఎన్నికైన వెంటనే , దేవ బ్రాహ్మణుల చీరా కాల ఆశయం అయినా రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా శ్రీశైలం లో ఉన్న దేవ బ్రాహ్మణ గాయత్రి పీఠము పునః ప్రారంభం కొరకు అధ్యక్షు వర్యులైన మాన్యశ్రీ చల్లా రామారావు ఆధ్వర్యంలో ఛాయ శక్తుల పనిచేస్తానని దేవ బ్రాహ్మణ పండిత అర్చక పురోహిత పరిషత్ చతుర్ధ సర్వసభ్య సమావేశంలో తెలియపరిచారు,దేవ బ్రాహ్మణులు అందరూ సంతోషం వ్యక్తపరుస్తూ , ఎటువంటి ఆటంకాలు కలుక్కోకుండా సజావుగా అన్నిట్లో విజయం కలుగుటకు నూతన కార్యవర్గ అధికారులకు ,సభ్యులకి దేవ బ్రాహ్మణలు వేద ఆశీర్వాదం అందించడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దేవ బ్రాహ్మణులు పాల్గొని దేవ బ్రాహ్మణ పండిత అర్చక పురోహిత పరిషత్ చతుర్ద సర్వ సభ్య సమావేశం మును విజయవంతం చేశారు అని ఉపాధ్యక్షులు అంబాబత్తుల అండకొండ రాముడు, తెలుపుతూ దేవ బ్రాహ్మణ పండిత అర్చక పురోహిత పరిషత్ కి సేవ చేసుకునే భాగ్యాన్ని బాధ్యతను ఇచ్చిన అధ్యక్షవర్యులు చల్లా రామారావు కు దేవ బ్రాహ్మణ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేవ బ్రాహ్మణ ల అభివృద్ధి కొరకు అభ్యున్నతి కొరకు ఎల్లవేళలా కృషి చేస్తానని పత్రికా ముఖంగా తెలియజేశారు.
చిట్వేల్ జులై 21 ( పున్నమి న్యూస్) *ముక్కా రూపానంద రెడ్డి మరియు అరవ శ్రీధర్ గారి నేతృత్వంలో రైల్వే కోడూరు లో కదం తొక్కుతున్న అభివృద్ధి..* . *కోడూరు పట్టణం లోని లక్ష్మీనగర్ నందు ₹20 లక్షల వ్యయం తో భూగర్భ డ్రైనేజ్,సీసీ రోడ్డు ను ప్రారంభించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ *ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ –* “ ప్రతి పట్టణం మరియు ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే మా సంకల్పం. ప్రజల నమ్మకానికి మేం న్యాయం చేస్తాం. రైల్వే కోడూరు ప్రజలు 20 సంవత్సరాలుగా చూడని అభివృద్ధిని కూటమిపాలన ఈ ఒక్క సంవత్సరంలో సాధించింది. రాబోయే రోజులను మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రైల్వేకోడూరును అభివృద్ధి దిశగా నడిపిస్తాం,” అని అన్నారు. *అరవ శ్రీధర్ మాట్లాడుతూ –* “రైల్వే కోడూరు నియోజకవర్గం మొత్తానికి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నాం. లక్ష్మీనగర్ వంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడడం అభినందనీయం. సీఎం చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతుంది,” అని తెలిపారు. *ఈ కార్యక్రమంలో* కూటమినేతలు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
*రైల్వే కోడూరు నియోజకవర్గం* *అన్నమయ్య జిల్లా.* 💐 *తి.తి.దే చైర్మన్ శ్రీ బి.ఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కస్తూరి* 💐 ఈరోజు అనగా 21.07.2025 వ తేదీన సోమవారం నాడు తిరుమల లోని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కార్యాలయం నందు *శ్రీ బి ఆర్ నాయుడు* గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి *శ్రీ కస్తూరి విశ్వనాధ నాయుడు గారు.* శ్రీ కస్తూరి విశ్వనాధ నాయుడు గారితో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాగులు నాయుడు, మాజీ ఎంపీటీసీ కట్టా లోకేష్, బూత్ ఇంచార్జ్ దుగ్గిన ఈశ్వరయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కేసుతో పైశాచిక ఆనందం -రెడ్ బుక్ పాలనకు భయపడం -వైసిపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి సిద్దవటం జూలై 21 అక్రమ కేసులతో వైఎస్ఆర్సిపి నాయకులను వేధిస్తూ కూటమి నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని వైయస్సార్సీపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి మండిపడ్డారు.సిద్ధవటంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్ద రెడ్డి మిధున్ రెడ్డి అక్రమ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.40 గా పెద్ద రెడ్డి కుటుంబం రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తుందన్నారు. అలాంటి కుటుంబంపై మద్యం కుంభకోణంలో వారి పాత్ర ఉందంటూ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. పెద్దిరెడ్డిపై కక్షసాన్నిపులకు చంద్రబాబు కుటీల ప్రయత్నాల్లో భాగమే మిథున్ రెడ్డి అరెస్ట్ అన్నారు.జగనన్న పాలనలో అవినీతికి తావు లేకుండా మద్యం అమ్మకాలు జరిపి ప్రభుత్వ ఆదాయం పెంచారని గుర్తు చేశారు.కేవలం రాజకీయ వేధింపుల్లో భాగంగా లేని అంశాన్ని భూతద్దంలో చూపి అరెస్టులు చేస్తుండటం పైశాచిక పాలనకు నిదర్శనం అన్నారు. వారి మాట వినని వారిని సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి బలవంతపు వాంగ్మూలాలు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు.మీ అరెస్టులతో వైసిపి శ్రేణులు భయపడే ప్రసక్తే లేదన్నారు.40 ఏళ్ళ నుంచి చంద్రబాబు పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారని,అయితే పెద్దిరెడ్డి కుటుంబం ప్రజా దీవెనలతో ప్రజా క్షేత్రంలో ఎన్నడూ ఓటమి చవి చూడలేదన్నారు.ఆయన ఎదుగుదలను ఓర్వలేక అక్రమ కేసులతో అరెస్టులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.అధికారం శాశ్వతం కాదని కూటమి నాయకులు గుర్తుపెట్టుకోవాలని ఆమె హెచ్చరించారు.
పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం. రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.