Sunday, 12 July 2026

Blog

అన్నమయ్య

బుధవారం ఓబులవారిపల్లి మండల M.D.O కార్యాలయంలో నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి

ఓబులవారిపల్లి జూలై 22 (పున్నమి ప్రతినిధి) ఉదయం 8.00 గంటలకు కోడూరు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.ఉదయం 9.00 గంటలకు మంగంపేట చెన్నకేశవ స్వామి గుడి దగ్గర ఉన్న రాజంపేట పార్లమెంట్ మాజీ ఎంపీ “స్వర్గీయ గునిపాటి రామయ్య” విగ్రహానికి నివాళులు అర్పిస్తారు.ఉదయం 10.00 గంటలకు ఓబులవారిపల్లి చేరుకుంటారు.ఉదయం 10.30 గంటలకుఎండిఓఆఫీసునందుసమావేశంలోపాల్గొంటారు.మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు మండల కార్యాలయంలో టిడిపి నాయకులు, కూటమి కార్యకర్తలు మరియు ప్రజలతో వారి సమస్యల పైన చర్చిస్తారు.

అన్నమయ్య

మంగళంపల్లి గ్రామం యల్లమ్మ తల్లి జాతర లో పాల్గొన్న ముక్కా రూపానంద రెడ్డి మరియు అరవ శ్రీధర్

శ్రీ యల్లమ్మ తల్లి జాతర సందర్భంగా ఓబులవారిపల్లి మండలంలోని మంగళంపల్లి గ్రామ ప్రజలు మరియు సర్పంచ్ ఆహ్వానం మేరకు తిరుణాల కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరై భక్తులు మరియు గ్రామ ప్రజలతో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు వీరికి ఘన స్వాగతం పలికి తమ ప్రేమాభిమానాలను వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో నాయుకులు, యువకులు, గ్రామ పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు.ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ”ఈ గ్రామానికి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. మీ అభివృద్ధికి నేను ఎప్పుడూ అంకితభావంతో పనిచేస్తాను. ఇటువంటి తిరణాల కార్యక్రమాలు మన పల్లె సాంస్కృతిని చాటి చెబుతాయి”అని అన్నారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ”జాతరల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు నిలుపుకోవచ్చు. మంగళంపల్లి ప్రజల ఆదరణ నాకు ఎంతో ఆనందం కలిగించింది. మీ ఆశీస్సులతో మరిన్ని అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తాను.” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు, కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఖమ్మం

విద్యా సంస్థ ల బంద్ ని జయ ప్రదం చేయండి

ఖమ్మం పున్నమి ప్రతి నిధి విద్యా రంగా సమస్య ల పరిష్కారం కోరుతు వామ పక్ష విద్యార్థి సంఘాలు బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తం విద్యా సంస్థ ల బంద్ కి పిలుపు ఇచ్చాయి. మంగళవారం నాడు ఖమ్మం లోని పలు విద్య సం స్థల యాజమాన్యం ని కలిసి బంద్ కి సహకరించాలి అని విజ్ఞప్తి చేశాయి

ఆంధ్రప్రదేశ్

మంగళంపల్లి ఎల్లమ్మ తల్లి జాతర

ఓబులవారిపల్లి జూలై 22 (పున్నమి ప్రతినిధి) శ్రీ యల్లమ్మ తల్లి జాతర సందర్భంగా ఓబులవారిపల్లి మండలంలోని మంగళంపల్లి గ్రామ ప్రజలు మరియు సర్పంచ్ ఆహ్వానం మేరకు తిరుణాల కార్యక్రమానికి *రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరై భక్తులు మరియు గ్రామ ప్రజలతో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు వీరికి ఘన స్వాగతం పలికి తమ ప్రేమాభిమానాలను వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో నాయుకులు, యువకులు, గ్రామ పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు.ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ* “ఈ గ్రామానికి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. మీ అభివృద్ధికి నేను ఎప్పుడూ అంకితభావంతో పనిచేస్తాను. ఇటువంటి తిరణాల కార్యక్రమాలు మన పల్లె సాంస్కృతిని చాటి చెబుతాయి”అని అన్నారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ”జాతరల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు నిలుపుకోవచ్చు. మంగళంపల్లి ప్రజల ఆదరణ నాకు ఎంతో ఆనందం కలిగించింది. మీ ఆశీస్సులతో మరిన్ని అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తాను.” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు, కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం జలాశయం వద్ద మోగిన సైరన్

– శ్రీశైలం జూలై 22 పున్నమి న్యూస్ శ్రీశైలం జలాశయం వద్ద మోగిన సైరన్ ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద ఉధృతి. నిండు కుండలా మారిన శ్రీశైలం జలాశయం. సైరన్ మోగించి మత్స్యకారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. ఏ క్షణమైనా జలాశయం గేట్లు ఎత్తి ఎందుకు అధికారులు సిద్ధం. ఈ ఏడాది రెండవ సారి గేట్లు తెరవనున్న జలాశయం అధికారులు. – శ్రీశైలం

ఆంధ్రప్రదేశ్

బంగారుచోరీ కేసులో ఇద్దరు దొంగలు అరెస్ట్

ఓబులవారిపల్లె జూలై 22వ పున్నమి న్యూస్ మండల పరిధిలోని సి ఓ కంబపల్లి హరిజనవాడలో బంగారం చోరీ కేసులో దొంగలించిన ఇద్దరు మహిళలను అరెస్టు చేసి వారి వద్ద నుండి బంగారం రికవరీ చేసినట్లు రాజంపేట ఏ ఎస్ పి మనోజ్ హెగ్డే తెలిపారు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న ఓరంపోటు పంచాయతీలోని కమ్మపల్లి దళితవాడ గ్రామంలో బొమ్మ ఈశ్వరమ్మ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు నగలు దొంగతనానికి పాల్పడ్డారు ఈనెల 14వ తేదీన దొంగతనం జరిగింది ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఈశ్వరమ్మ ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు ఈశ్వరమ్మకు సమీప బంధువులైన రామసుబ్బమ్మ రమాదేవి బంగారు దొంగ లించినట్లు గుర్తించి వారి వద్ద నుండి తొమ్మిది తులాలు బంగారు దాదాపు నాలుగు లక్షల రూపాయలు విలువచేసే బంగారు ను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు ఎస్సై పి మహేష్ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ పెద్దపల్లి

రేపటి రాష్ట్ర వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపు

రేపటి రాష్ట్ర వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపు మంథని, జులై 22, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జూలై 23న నిర్వహించే రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయడానికి విద్యార్థి లోకమంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ, డీఈవో పోస్టులను భర్తీ చేయాలని,బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని,అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి.ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని, విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని, ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ లతో ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యా రంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు బందెల రాజకుమార్, నాయకులు రజినీకాంత్, గణేష్, రోహిత్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు..

అన్నమయ్య

కార్తీక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్

ఓబులవారిపల్లి జూలై 22 (పున్నమి ప్రతినిధి) ఓబులువారిపల్లి మండలం, చెన్నరాజుపాడు పంచాయతీ సోమకుల వారి పల్లి గ్రామ వాస్తవ్యులు భశినేని చెంగల్ రాయుడు గారి కుమారుడు 10 వ తరగతి చదువుతున్న కార్తీక్ గారు అకస్మత్తుగా మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు అరవ శ్రీధర్ అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమం లొ ఎన్డీఏకుటమి నాయుకులు పాల్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

శ్రీ సత్య సాయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా కొత్తూరు గ్రామంలో ఘనంగా పల్లకి సేవ

శ్రీకాకుళం జిల్లా, జూలై 20:శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆదివారం బ్రహ్మీ ముహూర్తంలో నరసన్నపేట జోన్ పరిధిలోని పిన్నింటిపేట శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో SV కొత్తూరు గ్రామంలో స్వామి వారి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా గ్రామంలో భక్తులు ఇంటింటా రంగవల్లులతో స్వాగతం పలికారు. పిన్నింటిపేట సాయి భక్తజన బృందం ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి వారి పల్లకీ సేవను నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా ఇరువురి నారాయణ దంపతులకు “అమృత కలశాలు” అందజేయడం జరిగింది.ఈ సేవా కార్యక్రమాన్ని స్థానిక భక్తులు అధిక సంఖ్యలో హర్షోత్సాహాలతో పాల్గొని విజయవంతం చేశారు. పాల్గొన్న ప్రతి భక్తుడిపై స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని సమితి కన్వీనర్ శ్రీ పొట్నూరు రత్నాకర్ రావు ఆకాంక్షించారు.ఓం శ్రీ సాయిరాం 🙏

ఆంధ్రప్రదేశ్

ఓం శ్రీ సాయి రాం 🙏 గ్రామ గ్రామాల్లో పర్తి వాసుని పల్లకి సేవలు🙏🏻

💐స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అనగా తేదీ20-07-2025 ఆదివారం బ్రహ్మీ ముహూర్తంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జోన్ పిన్నింటిపేట శ్రీ సత్య సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో SV కొత్తూరు గ్రామంలో శ్రీ సత్య సాయి నాధుని పల్లకి సేవ మరియు ఇరువురి నారాయణ లకు అమృత కలశంలు ఇవ్వడంజరిగింది…గ్రామంలో ఇంటింటా ముందర భక్తులురంగవల్లికలు కలసలతో అలంకరించారు.స్వామి వారి పల్లకి సేవ పిన్నింటి పేట సాయి భక్తజన బృందం చే చాలా చక్కగా చేయడం జరిగింది.. స్వామి యొక్క ఆశీస్సులు పాల్గొన్న భక్తులందరిపై మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను…ఇట్లు సమితి కన్వీనర్ గారు పొట్నూరు రత్నాకర్ రావు ఓం శ్రీ సాయి రాం 🙏

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.