Sunday, 12 July 2026

Blog

కాకినాడ

శ్రీ ప్రజ్ఞ జూనియర్ కళాశాల లో ఘనంగా FLAIR-2k25 వేడుకలు కాకినాడ జిల్లా జగ్గంపేట సమీపంలో జెడ్ రాగంపేట లోని శుభమస్తు ఫంక్షన్ హల్ నందు శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థ చైర్మన్ బండారు నాగబాబు,డైరెక్టర్ బండారు శ్వేత నేత్రుత్వంలో కాలేజ్ ప్రిన్సిపాల్ అభి ఆధ్వర్యంలో శ్రీ ప్రజ్ఞ కాలేజీ 2k25 వేడుకలును ఘనంగా నిర్వహించారు,గత సంవత్సరంలో ప్రారంభించి 2024- 25 ఇంటర్ ఫలితాలులో స్టేట్ 3 వ ర్యాంక్ సాధించి జగ్గంపేట నియోజకవర్గం లో అత్యున్నత విద్యాసంస్థగా శ్రీ ప్రజ్ఞ నెలకొంది,శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థలో విద్యార్థిని విద్యార్థులకు ఎప్పటికి అప్పుడు తనది అయిన సైలిలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులుతో,విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందిస్తూ తల్లి తండ్రులు ఆదరణలు శ్రీ ప్రజ్ఞ పొందుతుంది,

శ్రీ ప్రజ్ఞ జూనియర్ కళాశాల లో ఘనంగా FLAIR-2k25 వేడుకలు కాకినాడ జిల్లా జగ్గంపేట సమీపంలో జెడ్ రాగంపేట లోని శుభమస్తు ఫంక్షన్ హల్ నందు శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థ చైర్మన్ బండారు నాగబాబు,డైరెక్టర్ బండారు శ్వేత నేత్రుత్వంలో కాలేజ్ ప్రిన్సిపాల్ అభి ఆధ్వర్యంలో శ్రీ ప్రజ్ఞ కాలేజీ 2k25 వేడుకలును ఘనంగా నిర్వహించారు,గత సంవత్సరంలో ప్రారంభించి 2024- 25 ఇంటర్ ఫలితాలులో స్టేట్ 3 వ ర్యాంక్ సాధించి జగ్గంపేట నియోజకవర్గం లో అత్యున్నత విద్యాసంస్థగా శ్రీ ప్రజ్ఞ నెలకొంది,శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థలో విద్యార్థిని విద్యార్థులకు ఎప్పటికి అప్పుడు తనది అయిన సైలిలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులుతో,విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందిస్తూ తల్లి తండ్రులు ఆదరణలు శ్రీ ప్రజ్ఞ పొందుతుంది, ఆదివారం నిర్వహించిన వేడుకలులో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలు పలువురు ని ఆకర్శించాయి, ఈ సందర్బంగా శ్రీ ప్రజ్ఞ చైర్మన్ బండారు నాగబాబు మాట్లాడుతూ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే స్టేట్ మూడవ ర్యాంక్ సాధించింది అని ఈ సందర్బంగా తెలుపుతూ రానున్న విద్యాసంవత్సరానికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న విద్యార్థికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని నాగబాబు తెలియజేసారు.అనంతరం 2024-25 పరీక్షలు లో ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు షిల్డ్ ని ప్రదానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో ఇంచార్జ్ ఆనంద్, పులిగ పవన్, ఉపాధ్యాయులు,శ్రీ ప్రజ్ఞ సిబ్బంది పాల్గొన్నారు.

ఆదిలాబాదు కరీంనగర్ కామారెడ్డి తెలంగాణ నాగర్‌కర్నూల్ పెద్దపల్లి మెదక్ వరంగల్ హైదరాబాద్

నేడు తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్

*నేడు తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు అలర్ట్* హైదరాబాద్‌, జులై 21, పున్నమి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలపై విస్తృత వర్షాల ప్రభావం ఉండనున్నట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్‌ నగరంతోపాటు మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్‌, నల్గొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆదివారం రాత్రి హైదరాబాద్‌ లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. నగరంలోని కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్‌పేట్, అమీర్‌పేట్, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షాల దృష్ట్యా జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్‌, విద్యుత్‌, రెస్క్యూ విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో జాతీయ విపత్తు నిర్వహణ బృందాన్ని కూడా సిద్ధంగా ఉంచారు. నదులు, వాగులు, చెరువుల సమీపాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాలు మరో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్‌ పై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకూడదనీ, ఎగువ ప్రాంతాల నుంచి నీరు వస్తే అప్రమత్తంగా ఉండాలనీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనీ, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని సంబంధిత అధికారులు ముందస్తు సూచనలు జారీ చేశారు.

ఆదిలాబాదు

ప్రమాణ స్వీకార కార్యక్రమనికి రానున్నట్లు తెలిపిన మంత్రి సీతక్క గారు*

*మంత్రి సీతక్కాను ఆహ్వాన పత్రికను అందజేసిన మాజీ ఎంపీ సోయం బాపూరావు గారు* * ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్టియు భవన్ లో ఈనెల 27వ తేదీన మాజీ ఎంపీ సోయం బాపూరావు గారు రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దింతో కార్యక్రమనికి రావాలని మంత్రి సీతక్కను మంత్రి కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేయ్యగా, మంత్రి సీతక్క గారు మాజీ ఎంపీ సోయం బాపూరావు గారిని శాలువాతో సన్మానించి పూల బొకేను అందజేశారు. కాగా మంత్రి సీతక్క గారు కార్యక్రమానికి వస్తున్నట్లు తెలిపారని మాజీ ఎంపీ సోయం బాపూరావు తెలిపారు. మాజీ ఎంపీ వెంట మాజీ ఎమ్మెలే ఆత్రం సక్కు కరీం నగర్ గ్రంథాలయ చేర్మెన్ సత్తు మల్లేష్ అక్కేపెల్లి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

*ఆధార్‌లో సమూల మార్పులు…వివరాల్లోంచి తండ్రి/భర్త పేరు తొలగింపు* *పుట్టిన తేదీకి బదులు పుట్టిన సంవత్సరం మాత్రమే!* *యూఐడీఏఐ ఉత్తర్వులు.. ఇప్పటికే అమల్లోకి

హైదరాబాద్‌: ఆధార్‌లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి.మొబైల్‌ సిమ్‌, బ్యాంకు ఖాతా, పాస్‌పోర్టు, ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలు.. ఇలా ఎన్నో అవసరాలకు గుర్తింపుగా తీసుకునే ఆధార్‌ కార్డులపై ఇక నుంచి తండ్రి/భర్త పేరు ఉండదు. ఆధార్‌లో పేరు కింద ఉండే ఈ వివరాలను తొలగించారు. నిజానికి మొదట్లో తండ్రి/భర్త పేరు అని ఉండేది. తర్వాత కేరాఫ్‌ అని మార్చారు. ఇప్పుడు పూర్తిగా తొలగిస్తూ ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)’ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కొత్త ఆధార్‌ నమోదులో తండ్రి/భర్త వివరాలు సమర్పించాలని కోరబోమని యూఐడీఏఐ తెలిపింది. అలాగే పుట్టినతేదీకి బదులు ఇకనుంచి కేవలం పుట్టిన సంవత్సరాన్నే నమోదు చేస్తారు. దీనికి సంబంధించి యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్‌ హిమాన్షు ఉత్తర్వులు జారీచేశారు. కొత్త మార్పులను గతంలోనే పేర్కొనగా.. ఈ నెల 18 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే తండ్రి/భర్త పేరు ఉన్న ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేస్తే ఆ పేర్లు తొలగించబడతాయి. అలాగే పుట్టినతేదీ స్థానంలో పుట్టిన సంవత్సరం మాత్రమే వస్తుంది. 18 ఏళ్లలోపు ఉండే పిల్లల (మైనర్ల) ఆధార్‌లోనే మాత్రమే కేరాఫ్‌ స్థానంలో వారి తండ్రి పేరు ఉంటుంది.

అన్నమయ్య

చిట్వేల్ మండలం మలేమార్పూరం పంచాయతీ నందు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ పార్టీ ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి

చిట్వేలి మండలం పున్నమి ప్రతినిధి జూలై 20 మలేమార్పూరం గ్రామం లొ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలపై స్పందించిన కూడా చైర్మన్ రూపానంద రెడ్డి చిట్వేలు మండలంలోని మలేమార్పూరు గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం భాగంగా డోర్ టు డోర్ ప్రచారాన్ని రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్న నేపథ్యంలో సుపరిపాలనకు తొలి అడుగు లో భాగంగా ప్రభుత్వం తరఫున ప్రజలకు అందిస్తున్న పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో రూపానంద రెడ్డి అభినందిస్తూ తమ మద్దతును వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీరు, రహదారులు, వృద్ధాప్య పెన్షన్లు, విద్యుత్ సదుపాయాలు వంటి సమస్యలపై ప్రజలు ప్రస్తావించగా, ఆయా అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ప్రజల మద్దతుతో తన ప్రయాణం విజయవంతంగా సాగుతోందని, ప్రతి ఓటును నమ్మకంగా నిలబెట్టుకునే విధంగా పనిచేస్తామని ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. గ్రామస్తులు పార్టీపై చూపుతున్న విశ్వాసం తమకు కొత్త శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు,గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.

కడప

చిట్వేల్ నుంచి కోడూరు కి వెళ్లాలంటే మీ బండి సామాన్లు బాగుండాలి అంకుల్

చిట్వేల్ జూలై 20 (పున్నమి ప్రతినిధి ) *చిట్వేలి కోడూరు రహదారికి మోక్షమెప్పుడు..* – ప్రమాద భరితంగా చిట్వేలి కోడూరు రహదారి – రోడ్డు సరిలేక దెబ్బతింటున్న వాహనాలు. – వాహనాల్లో ప్రయాణించే ప్రయాణీకులను ఆసుపత్రి పాలు చేస్తున్న రహదారి. చిట్వేలి నుండి కొడూరుకు వెళ్లాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు వర్షాకాలం మొదలు కావడంతో బొప్పాయి కోతలు మొదలయ్యాయి. మామిడి తదితర వాణిజ్య రవాణాకు చాలా కష్టతరంగా మారింది. అనారోగ్య రీత్యా ఈ మార్గం గుండా తిరుపతి పట్టణానికి వైద్య సేవల నిమిత్తం వెళ్లాలంటే అస్తవ్యస్తంగా ఉన్న రహదారి ప్రయాణం క్షతగాత్రులకు, అనారోగ్య పీడితుల మరింత ప్రమాద భరితంగా మారింది ఈ రహదారి. ప్రభుత్వ అధికారులు, నాయకులు దృష్టి సారించి త్వరితగతిన రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేసి సమస్యకు పరిష్కారం చూపుతారని మండల ప్రజలు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

బాధితులను పరామర్శించిన యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య

పోలాకి, జూలై 20:పోలాకి మండలం చెల్లాయివలస గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న తర్ర సావిత్రమ్మ గారిని, వాహన ప్రమాదంలో గాయపడి కాలు శస్త్రచికిత్స చేయించుకున్న గేదెల నరసింహులు గారిని, ఇటీవల మరణించిన అలిగి రాములమ్మ కుటుంబ సభ్యులను యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య గారు పరామర్శించారు. బాధితుల కుటుంబాలను ఆయన మనోబలం నింపుతూ, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబాల అవసరాలను గమనించి తమవంతుగా సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇది ప్రజల్లో హృదయాన్ని తాకిన చర్యగా ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, మండల అధ్యక్షులు కణితి కృష్ణారావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కల్లేపల్లి లక్ష్మణరావు, చింతు రామకృష్ణ, మండల యూత్ ఉపాధ్యక్షులు పాసిన రమణ, బమ్మిడి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజల మేలు కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని డాక్టర్ కృష్ణ చైతన్య తెలిపారు.

కడప

సిద్దవటం : కక్షతోనే మిధున్ రెడ్డిపై అక్రమ కేసు

ఎంపీ మిథున్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్షతోనే అక్రమ కేసు బనాయించిందంటూ సిద్ధవటం వైసిపి మండల కన్వీనర్ సింగం నీలకంఠారెడ్డి,మండల వైస్ ఎంపీపీ నారపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ధ్వజమెత్తారు.ఆదివారం సిద్ధపటంలో వారు మాట్లాడారు.ఏపీలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే CM చంద్రబాబు లక్ష్యమన్నారు. మద్యం కుంభకోణం అంటూ నాన్న యాగి చేయడం దుర్మార్గమన్నారు. వైయస్ఆర్సీపీ హయాంలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయన్నారు. బీహార్ రాష్ట్రం కంటే అధ్వానంగా ఏపీలో రెడ్ బుక్కు పాలన నడుస్తుందన్నారు. హామీలు గాలికి వదిలేసి ప్రజా సంక్షేమాన్ని ఆటకెక్కించారని దుయ్య బడ్డారు. హామీలు ఇవ్వడం తర్వాత గాలికి వదలడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కట్టుకదలతో అల్లుతున్న మద్యం అక్రమ కేసు న్యాయస్థానాల్లో నిలబడదని వారు తేల్చి చెప్పారు.

కడప

సిద్దవటం : కక్షతోనే మిధున్ రెడ్డిపై అక్రమ కేసు

ఎంపీ మిథున్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్షతోనే అక్రమ కేసు బనాయించిందంటూ సిద్ధవటం వైసిపి మండల కన్వీనర్ సింగం నీలకంఠారెడ్డి,మండల వైస్ ఎంపీపీ నారపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ధ్వజమెత్తారు.ఆదివారం సిద్ధపటంలో వారు మాట్లాడారు.ఏపీలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే CM చంద్రబాబు లక్ష్యమన్నారు. మద్యం కుంభకోణం అంటూ నాన్న యాగి చేయడం దుర్మార్గమన్నారు. వైయస్ఆర్సీపీ హయాంలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయన్నారు. బీహార్ రాష్ట్రం కంటే అధ్వానంగా ఏపీలో రెడ్ బుక్కు పాలన నడుస్తుందన్నారు. హామీలు గాలికి వదిలేసి ప్రజా సంక్షేమాన్ని ఆటకెక్కించారని దుయ్య బడ్డారు. హామీలు ఇవ్వడం తర్వాత గాలికి వదలడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కట్టుకదలతో అల్లుతున్న మద్యం అక్రమ కేసు న్యాయస్థానాల్లో నిలబడదని వారు తేల్చి చెప్పారు.

అన్నమయ్య

ఆదివారం కొత్త కోడూరు సందర్శించిన ఇంచార్జ్ కూడ చైర్మన్ ముక్కారూపానంద రెడ్డి మరియు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గ్రామ ప్రజల సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్న నేతలు

రైల్వేకోడూరు (పున్నమి ప్రతినిధి) జూలై 20 గ్రామ ప్రజల అభ్యర్థనపై వెంటనే స్పందించిన ముక్కా రూపానంద రెడ్డి ,అరవ శ్రీధర్ కొత్త కోడూరులో సమస్యలను స్వయంగా పర్యవేక్షించిన ముక్కా రూపానంద రెడ్డి మరియు అరవ శ్రీధర్ వెంటనే ప్రారంభమైన అభివృద్ధి చర్యలుగంగమ్మ దేవస్థానం, మసీద్ అభివృద్ధి కి హామీ ఇచ్చిన ముక్కా రూపానంద రెడ్డి ధార్మిక ప్రదేశాల్లో మౌలిక వసతులఅభివృద్ధికిచర్యలుతీసుకుంటానన్న కూడ చైర్మన్, ఎమ్మెల్యేరెండు రోజులు క్రితం రైల్వే కోడూరు పార్టీ కార్యాలయానికి విచ్చేసిన రైల్వే కోడూరు మండలం, న్యూ కోడూరు గ్రామ ప్రజలు, గ్రామ సమస్యలను వివరించి తమ గ్రామాన్ని సందర్శించాల్సిందిగా పార్టీ నేతలను కోరారు. దీనిని పురస్కరించుకుని రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ కలిసి న్యూ కోడూరు గ్రామాన్ని సందర్శించారు.గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న కరెంటు కోత, డ్రైనేజీ రోడ్డు సమస్యలు, మంచినీటి లోపం వంటి సమస్యలను స్వయంగా పర్యవేక్షించిన నేతలు, అక్కడి సమస్యలపై తక్షణ స్పందించారు. వెంటనే గ్రామానికి అవసరమైన స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయించడం, చెడిపోయిన కరెంట్ వైర్లను సరిచేయించడం వంటి పనులు ప్రారంభించడాన్ని ప్రజలు హర్షంతో స్వాగతించారు. అలాగే మిగిలిన సమస్యలపై కూడా త్వరితగతిన ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూస్తామని, గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ చైర్మన్ రూపానంద రెడ్డి హామీ ఇచ్చారు.పిలిచిన వెంటనే స్పందించి, గ్రామానికి వచ్చి తక్షణమే చర్యలు చేపట్టిన నేతల సేవాభావానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల పక్షాన నిలుస్తున్న నేతలు పార్టీ పట్ల నమ్మకాన్ని మరింత పెంచుతున్నారని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కూటమినేతలు పాల్గొన్నారు.అనంతరం ముక్కా రూపానంద రెడ్డి అదే గ్రామంలో ఉన్న గంగమ్మ తల్లి దేవస్థానం మరియు మసీద్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు,అభివృద్ధిఅవసరాలగురించివివరంగాతెలుసుకున్నారు.దేవాలయం మరియు మసీద్ పరిసరాల్లో తగిన సౌకర్యాల కొరత, మౌలిక సదుపాయాల అవసరాలు వంటి అంశాలను స్థానికుల నుంచి స్వయంగా తెలుసుకున్న ఆయన, తాను ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసేవిధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహాయం అందిస్తానని రూపానంద రెడ్డి స్పష్టం చేశారు.అధ్యాత్మిక స్థలాల అభివృద్ధితో పాటు సామాజిక సమగ్రతకు కృషి చేయడమే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమం లొ ఎన్డీయే కుటమి నాయుకులు, ప్రజలు పాల్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.