పున్నమి న్యూస్ ప్రతినిధికొవ్వూరు:తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కుమారదేవం గ్రామంలో గండిపోచమ్మ ఆలయమునకు దగ్గర ప్రమాదకరమైన మలుపులు ఉండటంవలన ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బందులు పడుచున్నారు,పైగా ఇసుక రీచ్ అక్కడే ఉండుటవలన లారీలు అధిక లోడ్ తో వేగంగా వెల్లుతావలన ఇసుక మలుపులలో పడి ఎక్కువ ప్రమాదాలు జరుగుచున్నవి,కావున రోడ్లు భవనాలు శాఖ వారు వెంటనే స్పందించి ఆలయమునకు ఇరు వైపులా స్పీడ్ బ్రేకర్లు వేయించవలసిందిగా వాహనదారులు వేడుకుంటున్నారు..
తెలంగాణలో భారీగా తగ్గిన పంట సాగు విస్తీర్ణం ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం 46% భూముల్లోనే పంట సాగు చేసిన రైతులు 132 లక్షల ఎకరాలు సాగు చేయాల్సి ఉండగా, కేవలం 61 లక్షల ఎకరాల్లోనే రైతులు పంట సాగు చేశారని నివేదిక విడుదల చేసిన వ్యవసాయ శాఖ ప్రధాన పంటైన వరి విస్తీర్ణం 62.78 లక్షల ఎకరాలు కాగా కేవలం 7.78 లక్షల(12.46%) ఎకరాల్లో మాత్రమే సాగు చేసిన రైతులు 48.93 లక్షల ఎకరాలు ఉండే పత్తి 38.57 లక్షల ఎకరాల్లో, 6.70 లక్షల ఎకరాలు ఉండే కంది 3.44 లక్షల ఎకరాల్లో, 5.21 లక్షల ఎకరాలు ఉండే మొక్కజొన్న 4.50 లక్షల ఎకరాల్లో, 4.20 లక్షల ఎకరాలు ఉండే సోయాబీన్ 3.31 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేసిన రైతులు వీటితో పాటు పప్పు ధాన్యాలు, నూనె గింజల పంట సాగు కూడా తగ్గిపోయిందని తెలిపిన వ్యవసాయ శాఖ ఊహించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్లనే పంట సాగు విస్తీర్ణం తగ్గిందని చెప్తున్న వ్యవసాయ శాఖ అధికారులు
చిట్వేలి జూలై 19 (పున్నమి ప్రతినిధి) ప్రమాదాలను అరికట్టాలంటే యువత వేగాన్ని తగ్గించాలని అప్పుడే ప్రమాదాలను అరికట్టవచ్చు లేకపోతే ప్రమాదాల బారిన పడి కుటుంబాలు బాధాకరంగా మారుతున్నాయని. మైనర్ లకు వాహనాలు ఇచ్చి వారు ప్రమాదాల బారిన పడి బాధపడే కన్నా వారికి వాహనం ఇవ్వకుంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని విచ్చలవిడిగా తల్లిదండ్రులు వాహనాలు ఇస్తే మైనర్ తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయబడతాయని చిట్వేలి ఎస్సై నవీన్ వెల్లడించారు. ఈ సందర్భంగా శనివారం, పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇస్తానుసారంగా తిరిగే వారిపై నిఖాపట్టామన్నారు. నిబంధనలు పాటిస్తూ ప్రతి వాహనదారుడికి వాహన పత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ ధరించడం కారుకు సీట్ బెల్ట్ పెట్టుకుని కారు నడపడం మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అన్న నిబంధనలను తెలుసుకోవాలన్నారు. అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. పోలీసులు ఫ్రెండ్లీ పోలీసెనని ప్రజలు తెలుసుకోవాలన్నారు. ప్రజల పట్ల పోలీసులు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదని ప్రజలకు ఫ్రెండ్లీగా ఉంటూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవలసిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా విధులు మేము నిర్వహిస్తామని మాకు సహకరించాలన్నారు. అధిక లోడు వాహనాలపై మనుషులను కూర్చోపెట్టుకొని ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆటోలో ఎంతమందిని కూర్చోబెట్టాలని ఆ నిబంధన మేరకే ఆటో నడపాలని అంతకుమించి పదిమంది 20 మందిని ఆటోలో ఎక్కించి తిరిగితే చట్టపరమైన చర్యలు తప్పమన్నారు. ప్రధాన రహదారి పాత బస్టాండ్ లో ట్రాఫిక్ ఫై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అలాగే సాయంత్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వదిలినప్పుడు విద్యార్థినీలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా బైక్ రేస్ చేస్తూ వచ్చే ఆకతాయిలపై నిఖా పెట్టామన్నారు. అటువంటి వారు కంటపడితే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. ఈ సందర్భంగా మండలంలోని 21 గ్రామపంచాయతీ లోని పరిస్థితులను క్షుణ్ణంగా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అమలాపురం వైపు నుండి వస్తున్న టిప్పర్ లారీ, యానం నుంచి ముమ్మిడివరం వెళ్తున్న పల్సర్ బండి డీకొన్నాయి. ఒక మోటార్ సైకిల్ పై నలుగురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నట్టు సమాచారం. ఈ ఘటన లో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మహిళ తల మొండెం వేరుగా పడింది. టి.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉందుర్తి బాలు, బొమ్మి వినోద్, గొల్లపాలెం గ్రామానికి చెందిన ఖండవల్లి రాజు, క్రాప గ్రామానికి చెందిన నిడమోలు ఉమా మహేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న ముమ్మిడివరం పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
అమెరికన్ విస్ డమ్ పీస్ విశ్వవిద్యాలయం 27 జూలై 2025 న వివిధ రంగాలలో ప్రతిభ కలిగిన వారికి గౌరవ డాక్టరేట్ మరియు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేసే కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి శంకర్ ను ఆహ్వానించింది•పాండిచ్చేరి లోని హోటల్ అతిధి లో జరిగే ఈ కార్యక్రమము లో అమెరికన్ విస్ డమ్ పీస్ విశ్వవిద్యాలయానికి చెందిన పుస్తక ఆవిష్కరణ మరియు విభిన్న రంగాలలో ప్రతిభ కల వ్యక్తులకు గౌరవ డాక్టరేట్ పురస్కారాల ప్రధానము ఉంటుంది•ఈ కార్యక్రమంలో పాండిచ్చేరి శాసనసభ స్పీకర్ ఎమ్ ఎల్ ఏ ఎంబలం సెల్వం, 5 సార్లు గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన డాక్టర్ కరాటే శ్రీనాథ్, కోయంబత్తూర్ కు చెందిన ఆల్ ఇండియా ఏంటి విండోడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కతిర్వెల్, పాండిచ్చేరి కేంద్ర కారాగార పోలీస్ సూపరిండెంట్ భాస్కరన్, పాండిచ్చేరి నమ్మాళ్వార్ న్యాచురల్ ఫార్మర్స్ అసోసియేషన్ కో ప్రెసిడెంట్ రాజా వేణుగోపాల్, పాండిచ్చేరి ఠాగూర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన రేఖా రాజా, దేవి ప్రియ,నారాయణస్వామి,విమల,విఘ్నేశ్వరన్,షణ్ముగప్రియ తదితరులు పాల్గొంటారని ఆహ్వాన పత్రంలో విశ్వవిద్యాలయం పేర్కొంది.
అన్నమయ్య జిల్లా నందలూరు మండల లో గల గొబ్బిళ్ల అక్షర స్కూల్ నందు విద్యార్థులకు ఉన్నత చదువులపై అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఐఐటి విద్యార్థుల తో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ ఛైర్మెన్ త్రినాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు అనుగుణంగా అతి తక్కువ ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఉద్దేశంతో మా విద్యాసంస్థ ప్రయత్నిస్తుందని అన్నారు విద్యార్థులు కంఠస్థ తో విద్యను అభ్యసించకుండా ప్రయోగాత్మకంగా విద్యను అభ్యసించాలని ఉద్దేశంతో మా పాఠశాల నందు ఐఐటి విద్యార్థుల ద్వారా విషయాన్ని ఎలా అభ్యసించాలా అనే ధోరణిలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.జాతీయస్థాయిలో ఎన్.ఎస్.ఐ.స అక్షర పబ్లిక్ పాఠశాల సాధించిందని ఆయన అన్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యను ఎలా అభ్యసించాలి అని ఒక కరికులం తయారు చేస్తామని ఆయన అన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి లో విషాదం చోటు చేసుకుంది.శనివారం ఉదయం స్వామి దర్శనం కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన పామర్తి దినేష్(22) ఇంజనీరింగ్ విద్యార్ధి గోదావరిలో గల్లంతయాడు. స్నేహితులతో కలసి స్వామి దర్శనానికి వచ్చిన దినేష్ కు ఇలా జరగడంతో మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దినేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి లో విషాదం చోటు చేసుకుంది.శనివారం ఉదయం స్వామి దర్శనం కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన పామర్తి దినేష్(22) ఇంజనీరింగ్ విద్యార్ధి గోదావరిలో గల్లంతయాడు. స్నేహితులతో కలసి స్వామి దర్శనానికి వచ్చిన దినేష్ కు ఇలా జరగడంతో మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దినేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం హైస్కూల్ విద్యార్ధులు శనివారం స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.సూర్యకుమారి ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.