Sunday, 12 July 2026

Blog

తెలంగాణ హైదరాబాద్

ప్రభుత్వం తరుఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వం తరుఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, జులై 20, పున్నమి ప్రతినిధి: ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం హరిబౌలీలోని శ్రీ అక్కన్న మాదన్న ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజలందరికీ ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ బోనాలు, లాల్ దర్వాజా బోనాలు కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాదు, యావత్ దేశానికి, ప్రపంచానికి తెలంగాణ జీవన విధానం, పల్లె సంస్కృతి, సాంప్రదాయాలను, ఇక్కడి ప్రజల స్ఫూర్తిని చాటి చెప్పే గొప్ప ఉదాహరణలు అని అన్నారు. జంట నగరాల్లో రాష్ట్ర పండుగగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున రూ.20 కోట్లు కేటాయించామని, నగరంలోని 2783 ఆలయాలకు చెక్కుల రూపంలో నిధులను అందజేసినట్లు ప్రకటించారు. కేవలం ఒక ప్రకటన కాదనీ, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేసే దృఢ సంకల్పం అని అన్నారు. ఆ అమ్మవారి చల్లని దీవెనలతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో, ఐటీ, పరిశ్రమల రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిపేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ సంక్షేమ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం 

నరసన్నపేటలో ఉచిత యోగా తరగతులు – ఆరోగ్యంపై అవగాహన పెంపొందిస్తున్న యోగా గురువులు

నరసన్నపేట, జూలై 20:నరసన్నపేట పట్టణంలోని పెద్దపేట వీధిలో ఉన్న యోగా భవన్ లో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉచిత యోగా తరగతులు నిర్వహించబడుతున్నాయి. ఈ తరగతుల్లో మహిళలు, పురుషులు, పిల్లలు కలిసి సుమారు 25 నుంచి 30 మంది వరకు యోగా సాధన చేస్తున్నారు.ఈ తరగతులను యోగా గురువులు సదాశివుని రవి మరియు వండాన సుప్రజలు సమర్థంగా నిర్వహిస్తున్నారు. యోగా శాస్త్రంలో భాగంగా ఆసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, ధ్యానం వంటి అంశాలను వీరు సులభంగా శిక్షణ ఇస్తున్నారు. శరీర ఆరోగ్యం, మానసిక శాంతి కోసం యోగా ఎంతో ఉపయోగపడుతుందంటూ వారు వివరించారు.తాజాగా ఈ తరగతి భాగంగా, ఆదివారం రోజున రాజారాంపురం బీచ్ లో యోగా సాధకులతో కలిసి ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. ప్రకృతి సన్నిధిలో జరిగిన ఈ యోగా కార్యక్రమం పాల్గొన్నవారిలో ఉత్సాహాన్ని నింపింది.“ప్రతి ఒక్కరూ యోగా సాధనతో ఆరోగ్యంగా జీవించాలి” అంటూ యోగా గురువులు పిలుపునిచ్చారు. ఈ ఉచిత తరగతుల గురించి మరిన్ని వివరాల కోసం 8142121246 నెంబర్‌కి సంప్రదించవచ్చని వారు తెలిపారు.

విశాఖపట్నం

అమ్మే నా దేవత

అమ్మంటే ఒక అదృష్టం అమ్మంటేఒక అపురూపం అమ్మంటే ఒక ఆనందం అమ్మంటే ఒక ఐశ్వర్యం అమ్మంటే ఒక అక్షర బీజం అమ్మంటే ఒక అపార శక్తి రూపం అమ్మంటే ఒక అనుబంధం అమ్మంటే ఒక అనురాగం అమ్మంటే ఒక ఔదార్యం అమ్మంటే ఒక ఆప్యాయత అమ్మంటే ఒక అక్షయపాత్ర అమ్మంటే ఒక దివ్య ఔషధం అమ్మంటే ఒక కమ్మని మకరందం అమ్మంటే ఒక అపూర్వ కానుక అమ్మంటే ఆకలి తీర్చే అన్నపూర్ణ అమ్మంటే ఒక అద్భుతం అమ్మంటే ఒక ఆశీర్వాదం అమ్మంటే ఒక అనంత ప్రేమ అమ్మంటే ఒక విజయ రథసారధి అమ్మంటే ఒక క్షీర సాగరం మదనం అమ్మంటే ఒక అమృత బాండం అమ్మఃటే ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లే ! అమ్మ లేకపోతే అన్నీ ఉన్న ఏమీ లేనట్లే!!

ఆంధ్రప్రదేశ్

వంట పాత్రలు విరాళంగా ఇచ్చిన లయన్ డా.ఎం.కె. మిశ్రో

శ్రీకాకుళం పట్నంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమానికి అవసరమైన కొన్ని వంట పాత్రలను లయన్స్ క్లబ్ సర్వీస్ ఛైర్పర్సన్, సామాజిక వేత్త, దివ్యాంగ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకుడు, సక్షం జిల్లా కన్వీనర్, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయిన లయన్ డా.ఎం.కె. మిశ్రో విరాళంగా అందించారు. ఈ వంట పాత్రలను బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ కొయ్యాన కిరణ్ కుమార్ కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంలో, లయన్ డా.ఎం.కె. మిశ్రో ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు సామాజిక సేవా రంగంలో ఎంతగానో మన్ననలు పొందుతున్నాయని పలువురు మాట్లాడారు. 💐🙏🚩🚩

అన్నమయ్య

“రైల్వే కోడూరు మండలం కండ్రిగ పంచాయతీ నందు సుపరిపాలనకు తొలి అడుగు – టీడీపీ పార్టీ ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి నేతృత్వంలో డోర్ టు డోర్ కార్యక్రమం”

రైల్వేకోడూరు (పున్నమి ప్రతినిధి) జూలై 19 రైల్వే కోడూరులో టీడీపీ బలోపేతం – ఇంటింటికీ సుపరిపాలన సందేశం”వి.వి. కండ్రిగ గ్రామానికి చెందిన ప్రభుత్వ సాయం – పాముల శ్రీనుకు 40 వేల రూపాయల సీఎం సహాయ నీది చెక్కు అందజేసిన ముక్కా రూపానంద రెడ్డి “అవసరమైన సమయంలో ప్రభుత్వ మద్దతు పాముల శ్రీనుకు వైద్య నిధి సహాయం రైల్వేకోడూరునియోజకవర్గంలోని వి.వి కండ్రిగ గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు, డోర్ టు డోర్ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పాల్గొన్నారు . ప్రజలతో నేరుగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించారు.ఈ సందర్భంగా రూపానంద రెడ్డి మాట్లాడుతూ ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు విని, వెంటనే పరిష్కరించడమే మంచి పాలనకు సూచిక.టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ప్రతి ఇంటికీ చేరాలి. అందుకే ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ప్రారంభించాం.మీ అభిప్రాయాలు, మీ అవసరాలే మా పాలనకు దిక్సూచి. ప్రజలతో ఉండడం వారి అభివృద్ధి కోసం పనిచేయడం మా బాధ్యత.”అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వి.వి కండ్రిగ గ్రామ వాస్తవ్యు పాముల శ్రీను గారికి వైద్య సహాయ నిమిత్తం 40 వేల రూపాయల చెక్కును అందించారు .ఈ కార్యక్రమంలో* నేతలు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కరేడు కన్నీటికి అడ్డుకట్ట వేసింది ఎవరు తొలి అడుగులో బోడే… వేగం పెంచిన తూమాటి

నెల్లూరు బ్యూరో ( జూలై పున్నమి) పచ్చని కరేడు భూములకు నోటిఫికేషన్ ఇచ్చి తమ పరం చేసుకోవాలన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వచ్చిన రైతులకు అండగా నిలిచిన తొలి వ్యక్తి బీసీ నేత బోడె రామచంద్ర యాదవ్ కాగా రైతుల ఆవేదనను వెంటనే గమనించి ఉద్యమానికి ఆజ్యం పోసిన నేత ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు. ఈ నెల నాలుగో తేదీన బోడె రామచంద్ర యాదవ్ రైతుల అందరిని సమీకరించి వారి కష్టాన్ని బయట ప్రపంచానికి తెలిపారు. రామాయపట్నం పోర్టు తదితర అంశాలపై గత ప్రభుత్వంలో పూర్తి అవగాహన ఉన్న తూమాటి మాధవరావు వెంటనే స్పందిస్తూ సమస్యను ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ఆయనతో రైతులను భేటీ చేయడంతో ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాంశమైంది. ఇదే సమయంలో ముందుగా సిపిఐ నేతలు కూడా రైతులకు మద్దతుగా తమ వంతు పాత్ర ఉందని ముందుకు రావడంతో అనుబంధంగా సిపిఎం కూడా ఒక చేయి వేసింది. దీంతో భూములను కాపాడుకోవాలనే రైతులకు భారీగానే ధైర్యం చేకూరింది. మరో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా తాము సైతం అంటూ మద్దతు ప్రకటించడంతో కరేడులో ప్రభుత్వ నోటిఫికేషన్ కు కదలిక లేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై తొలి వారం రోజులు దాగుడుమూతలతో వ్యవహరించిన స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూడా రైతుల ఆగ్రహాన్ని గమనించి వారికి అన్యాయం జరగనివ్వమని వారి అభీష్టం మేరకే నిర్ణయాలు ఉంటాయని ఆలస్యం గా నైనా తీపి పలుకులు పలకడంతో కరేడు సమస్యపై తొందరపాటు చర్యలు తీసుకుంటే ఇబ్బంది అనే హెచ్చరికలు ప్రభుత్వ దృష్టికి చేరుకున్నాయి. నూతన పరిశ్రమ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలు రైతులకు ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయని వీటిపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కరేడు లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు కందుకూరు వైసీపీ ఇంచార్జ్ బుర్ర మధుసూదన్ తెలపడంతో ఉద్యమం చేస్తున్న రైతులు కూడా మరింత సంఘటితమయ్యారు. ఈ విషయంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఇంటూరి స్పందన స్పష్టం చేసినా కూటమిలో కీలకంగా ఉన్న బిజెపి జనసేన నేతలు ఇంతవరకు అడ్రస్ లేకపోవడం గమనార్హం.. ప్రజల్లో తాము సైతం అంటూ రైతుల సంక్షేమమే లక్ష్యం అంటున్న జనసేన బిజెపి నేతలు కరేడు ఉద్యమం దరిదాపులకు రాకపోవడం ఆ పార్టీలకు ప్రధాన లోపంగా నష్టం జరిగేదిగా భావిస్తున్నారు. కరేడు సమస్యపై ప్రతిపక్ష పార్టీలు ఎవరు పార్టీకి వారు తమ అజెండాగా ఇప్పటివరకు వ్యవవరిస్తున్నారు తప్ప సంఘటితంగా ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అయితే మొదటగా ఈ సమస్యపై స్పందించి రైతుల ముందు అధికారులు నిలదీసిన రామచంద్ర యాదవ్ ఉద్యమానికి దూరమవుతున్నారని ప్రకటించడం మరో మలుపు. తాను లేవనెత్తిన సమస్యపై రైతులు తనతో కాకుండా ప్రతిపక్ష నేత జగన్ వద్దకి తీసుకుపోవడం ఆయనకు కష్టంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం .మొత్తం మీద రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఒక చిన్న గ్రామానికి చెందిన రైతులు ఈ స్థాయిలో సంఘటితంగా ముందుకు వచ్చి సమస్య మీద పోరు చేయడం ఇదే ప్రథమంగా భావించవచ్చు. రైతుల భూ ఉద్యమం లో కరేడు కి ఒక ముఖ్యమైన పేజీ ఉండొచ్చు.

భద్రాద్రి కొత్తగూడెం

గృహ హింస చట్టం పై అవగాహన అవసరం

గృహం చట్టలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం. రాజేందర్ అన్నారు. శనివారం మహమ్మద్ నగర్ గ్రామం తిప్పనపల్లి, చంద్రుగొండ మండలంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ మహిళల పట్ల నిత్యం ఏదో ఒక చోట అఘాత్యాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి వారి హక్కుల గురించి మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని, చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల వారు అనేక అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారని అన్నారు. గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా గ్రామ పెద్దలు, యువకులు, అంగన్వాడీ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమం అనంతరం నల్సా న్యూఢిల్లీ వారు ప్రవేశపెట్టిన ఆశ స్కీమ్ లో భాగంగా న్యాయమూర్తి ఇంటింటికి కరపత్రాలు పంచుతూ, బాల్య వివాహ నిర్మూలన స్టిక్కర్లను ఇంటి డోర్ లకు అంటించారు. ఈ కార్యక్రమంలో ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా, సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు డా”.వి. రమాదేవి, డిసిపివో యన్.ఐ.సి. ఆదురి శేషు, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ బానోత్ సందీప్, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 కేస్ వర్కర్ జి. భవాని, టిం ఇండియా ఇండియన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చండ్రుగోండ మండల అధ్యక్షుడు నాసిర్, స్టేన్నా, తదితరులు పాల్గొన్నారు

అన్నమయ్య

ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం.

చిట్వేలి (పున్నమి ప్రతినిధి) జూలై 19 రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం ప్రభుత్వ కార్యాలయాల యందు “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిట్వేల్ నందు “ప్లాస్టిక్ వాడకానికి స్వస్తి పలుకుదాం”అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మానవులు నేడు విచక్షణారహితంగా ప్లాస్టిక్ ని వాడడం వలన పర్యావరణం సమతుల్యం దెబ్బతింటుందని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గ రాజు అన్నారు.తెలుగు ఉపాధ్యాయురాలు బి.విజయలక్ష్మి విద్యార్థులకు ఒక చిన్న కృత్యం ద్వారా ప్లాస్టిక్ మరియు పేపర్ యొక్క జీవిత కాలం గురించి వాటి నష్టాల గురించి చక్కగా ప్రదర్శించడం జరిగింది. అలాగే జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఎ.కళావతి, టి.సుహాసిని ఎ.శివన్నారాయణ లు విద్యార్థులచే పర్యావరణాన్ని ప్లాస్టిక్ భూతం నుంచి ఎలా కాపాడాలో నినాదాల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ తరువాత విద్యార్థులచే ప్లాస్టిక్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలో, ఎలాంటి వస్తువులు ఉపయోగించాలో , ప్లాస్టిక్ ని విరివిగా ఉపయోగించడం వలన సంభవించే దుష్పరిణామాల గురించి వివరించడం జరిగింది.ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన జీవితం కోసం ఎలాంటి వస్తువులు వాడాలో విద్యార్థులు చూపించడం జరిగింది. విద్యార్థుల యొక్క ప్రదర్శన వారు చేసిన నినాదాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు, జీవ శాస్త్ర ఉపాధ్యాయులు లక్ష్మీ కళావతి,సుహాసిని,శివ నారాయణ,చిన్న బాబు మొదలగు ఉపాధ్యాయ బృందంతో పాటు ICDS సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు..

తెలంగాణ పెద్దపల్లి

జూలై 24 జాబ్ మేళా నిర్వహణ…. పెద్దపల్లి జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతిరావు

జూలై 24 జాబ్ మేళా నిర్వహణ…. పెద్దపల్లి జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతిరావు పెద్దపల్లి, జులై 19, పున్నమి ప్రతినిధి: నిరుద్యోగ యువతీ, యువకులకు పెద్దపల్లి జిల్లా నందు కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ లో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 24న గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రూమ్ నెం.225 పైన నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ సంస్థలో (67) పోస్టులకు ఇంటర్యులు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి పోస్టుల పేరు సేల్స్ ఎక్సిక్యూటివ్ (60) ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (04), హెచ్ ఆర్ మేనేజర్స్ (02) ఆఫీస్ బాయ్ (01) లు ఖాళీలు ఉన్నాయని ఇట్టి పోస్టులకు విద్యా అర్హత ఎస్ఎస్సి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ లేదా ఎంబీఏ, ఆపై చదివిన వారు అర్హులని, వీరి వయస్సు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉండాలని తెలిపారు. ఇట్టి పోస్టులకు యువతీ, యువకులు అర్హతలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు జూలై 24న ఉదయం 11 గంటలకు సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం రూమ్ నెం.225 పైన గల జిల్లా ఉపాధి కార్యాలయం, వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9391420932, 8985336947, 8121262441 నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతిరావు ఆ ప్రకటనలో తెలిపారు.

అన్నమయ్య

“స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమం నిర్వహించిన జిల్లా పోలీసులు..

రాయచోటి జులై 19: (పున్నమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ. నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రతి మూడవ శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించబడుతున్న “స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు జిల్లా వ్యాప్తంగా.. పోలీసు అధికారులు సిబ్బంది కలిసి.. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, సబ్ డివిజన్ అధికారుల కార్యాలయాలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ల కార్యాలయాలు, అన్ని పోలీస్ స్టేషన్లలో శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు.జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, జిల్లాలోని పోలీసు అధికారుల కార్యాలయాలు, పోలీసు స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్త, వ్యర్థాలను తొలగించి పరిసరాలు పరిశుభ్రం చేశారు. గుణపం, పారలు చేతబట్టి పిచ్చి మొక్కలు తొలగించారు. చెట్లకు పాదులు తీసి నీరు పోశారు.”స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం ప్రతి నెలా మూడో శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. పరిసరాల పరిశుభ్రత గురించి, ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు. ముఖ్య కూడళ్లలో మానవహారంగా ఏర్పడి స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రతిజ్ఞ చేపించారు. అన్నమయ్య జిల్లా పోలీసులు “స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరగడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.