Sunday, 12 July 2026

Blog

తెలంగాణ పెద్దపల్లి

భాద్యతగా పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది: సీపీ అంబర్ కిషోర్ ఝా

*భాద్యతగా పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది* *_రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా_* రామగుండం, జులై 22, పున్నమి ప్రతినిధి: వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి జోన్ పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సీపీ కి స్టేషన్ పోలీస్ అధికారులు పుష్ప గుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసుల వివరాలను తెలుసుకొని పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. స్టేషన్ లోని పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి భౌగోళిక పరిస్థితులు, ముఖ్యమైన ప్రదేశాలు, ఈ ప్రాంతంలోని మావోయిస్టులు, వారి కుటుంబ వివరాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఏవిదంగా నియంత్రణ చేయాలనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ స్టేషన్ రికార్డ్స్, హిస్టరీ షీట్స్, మండల భౌగోళిక స్థితి, నేరాల నమోదు, కేసుల స్థితిగతులు, కోర్టు క్యాలెండర్, సాంకేతికత మొదలగు వాటిని పరిశీలించారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాలని సిబ్బందిని ఆదేశించారు. పారదర్శకంగా పోలీసింగ్ ఉండాలని ప్రజలకు పోలీసు సేవలను వేగంగా అందించాలని సిబ్బందికి తెలిపినారు. గంజాయి రవాణా, వినియోగం నిరోధించేలా బాధ్యతగా పని చేయాలని అన్నారు. పెట్రోలింగ్ పెంచాలని, డయల్ 100 కాల్స్ పై సిబ్బంది వేగంగా స్పందించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు పని చేయాలని అన్నారు. సైబర్ నేరాలు జరగకుండా ప్రజలు సైబర్ మోసాలకు గురి కాకుండా అవగాహన కల్పించాలని కోరారు. భాద్యతగా పని చేసే సిబ్బందికి రీవార్డ్స్, ప్రోత్సాహకాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతో పాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులకు స్పందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, బిట్లు, పెట్రోలింగ్ పగడ్బందీగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ తెలిపారు. ఇదే క్రమంలో పోలీస్ కమిషనర్ అధికారులతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఇంచార్జ్ ఏసీపీ శ్రీనివాస్, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పోత్కపల్లి ఎస్ఐ డి. రమేష్, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ ఐ వెంకటేష్, సిసి హరీష్ ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, వాహన పత్రాలు తప్పనిసరి

*ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, వాహన పత్రాలు తప్పనిసరి* * చిట్వేల్ లో పలు వాహనాలు తనిఖీ చేసిన ఎస్ఐ నవీన్* చిట్వేల్ జూలై 22 ( పున్నమి న్యూస్) *ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని చిట్వేలి మండల ఎస్సై నవీన్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గుంటి శ్రీరాములు అంబేద్కర్ సర్కిల్ నందు ఆయన పలు వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై నవీన్ మాట్లాడుతూ టాటా మ్యాక్స్ లు, ఆటోలు, పలు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నడుపుతున్న డ్రైవర్లు తప్పనిసరిగా కాకి డ్రస్ ధరించాలని, అలాగే వాహనాలకు ఫిట్నెస్ పేపర్లు కరెక్ట్ గా ఉండాలని ఆయన తెలియజేశారు. పలు వాహనాలు తనిఖీ చేసి హెల్మెట్, వాహన పత్రాలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కి, ఆటోలకు, కాకి డ్రస్ కోడ్ పాటించిన వారికి జరిమానా విధించారు. అలాగే మండలంలో పలుచోట్ల మైనర్ పిల్లలు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ పై మితిమీరిన వేగంతో వెళ్తున్నారని, వేగంతో వెళ్లేటప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని వారిని గమనించి పట్టుకున్నప్పుడు మైనర్ పిల్లలకు వాహనం ఇచ్చిన యజమానులకు, వాహనం తోలిన వారిపై కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని లేకపోతే విచ్చలవిడిగా తయారవుతారని ప్రతిరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక, అలాగే సెలవుల్లో ఏం చేస్తున్నారో గమనించి ఏమన్నా తప్పు చేసేటప్పుడు ఇలా చేయకూడదని వారిని మందలిస్తే ఎటువంటి ఇబ్బందులు జరగవని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంగార్డులు మోహన్ రాజు, సుధాకర్ నాయుడు, జోరోపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు*

ఆంధ్రప్రదేశ్

సాయి వికాస్ విద్యాసంస్థల్లో బహుమతుల ప్రధానం

సాయి వికాస్ విద్యాసంస్థల్లో బహుమతుల ప్రధానం 2024 25 ఎస్ ఎస్ సి ఫలితాల లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు మండల స్థాయిలో 1,2,3 బహుమతులు పొందిన విద్యార్థులకు శ్రీ సాయి వికాస్ విద్య సంస్థలు యజమాన్యం మొదటి బహుమతులు అందించి విద్యార్థుల్లో ప్రేరణ కలిగించారు. స్థానిక చిట్వేల్ నందు శ్రీ సాయి వికాస్ ఉన్నత స్థానం సాధించిన విద్యార్థులు తమ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు యొక్క అభినందన సభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం లో బహుమతులు పొందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు కరస్పాండెంట్ తిరుమల రెడ్డయ్య నాయుడు, మాట్లాడుతూ విద్యార్థులు యొక్క విద్య ప్రగతితో పాటు నైతికవిలువలు కూడా పెరగాలని అటువంటి విద్యార్థులు సమాజానికి చాలా అవసరమని వ్యక్తం చేస్తూ 2024 2025 విద్యా సంవత్సరములో ఎస్ ఎస్ సి పరీక్షల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన బహుమతులు అందించడం జరిగింది . ఆ బహుమతులు అందుకున్న విద్యార్థులు యు, జోశ్విత, కే సిరి, ఎస్ మస్తాన్,

తెలంగాణ పెద్దపల్లి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 రూపాయల 50 పైసలకు ఇటుక సరఫరా

*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 రూపాయల 50 పైసలకు ఇటుక సరఫరా* *_ధర నిర్ణయంపై ప్రకటన విడుదల చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష_* పెద్దపల్లి, జులై 22, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకలను ఒక్కో ఇటుక 5 రూపాయల 50 పైసలకు సరఫరా చేసేందుకు ఇటుక బట్టీల యాజమానులు నిర్ణయించారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటుక బట్టీల యాజమానులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి పెద్దపల్లి జిల్లాలో ఉన్న 102 ఇటుక బట్టీల నుంచి తక్కువ ధరకు ఇటుక సరఫరా చేయాలని వారిని ఒప్పించడం జరిగింది. మొదటి విడత కింద పెద్దపల్లి జిల్లాకు ప్రభుత్వం 9 వేల 421 ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు చేయగా ఇప్పటివరకు 6 వేల 18 ఇండ్లను లబ్ధిదారులకు మంజూరు చేసామని, 3 వేల 847 గృహాలకు మార్కింగ్ చేసి బేస్మెంట్ పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 12, 000 ఇటుకల అవసరం అవుతాయని, ఒక్కో ఇటుక 5 రూపాయల 50 పైసలకు సరఫరా చేసేందుకు జిల్లాలో ఉన్న 102 ఇటుక బట్టీల యాజమాన్యుల సమావేశంలో నిర్ణయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి, శ్రీరాంపూర్, పాలకుర్తి, కమాన్ పూర్ మండలాల్లోని లబ్ధిదారులకు పెద్దపల్లి మండలంలో తయారు చేసిన ఇటుక బట్టీల నుంచి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లోని లబ్ధిదారులకు సుల్తానాబాద్ మండలంలో తయారుచేసిన ఇటుక బట్టీల నుంచి సరఫరా అవుతుందని అన్నారు. ధర్మారం మండలంలోని ఇటుక బట్టీలు ధర్మారం మండలానికి, రామగిరి, రామగుండం మండలాల్లో తయారు అయ్యే ఇటుక బట్టీల నుంచి రామగిరి, మంథని ముత్తారం, మంథని మండలాలకు ఇటుకల సరఫరా అవుతాయని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అవసరమైన ఇటుకలను ప్రతి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి ద్వారా ఒకేసారి లిఫ్ట్ చేయుటకు వాహన సంఖ్యతో పర్మిట్ లెటర్ ఎంపీడీవో ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను పూర్తి స్థాయిలో త్వరగా నిర్మించుకోవాలని, ఈ ప్రక్రియను పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి, పిడి హౌసింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఖమ్మం

నున్న రవి సంతాపం

సంతాప సందేశం: భారతీయ జనతా పార్టీ ఖమ్మం వన్ టౌన్ ప్రధాన కార్యదర్శి పొట్టి మూతి వాణి గారి మాతృమూర్తి గూడ జానకమ్మ గారి మరణం పట్ల చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని జానకమ్మ గారికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 🙏వారి కుటుంబ సభ్యులకు మరియు టూ టౌన్ ప్రధాన కార్యదర్శి సోదరి పొట్టిమూతి వాణి గారికి మాతృమూర్తి మరణం వారికి తీరని లోటు వాణి గారికి మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను

ఖమ్మం

బిజెపి విజయం తథ్యం

“ఇది నాయకుల ఎన్నిక కాదు… కార్యకర్తల ఎన్నిక!” * “ప్రతి గ్రామాన్ని బీజేపీ కోటగా మార్చండి. * “రుణమాఫీ మాయ, పల్లె ప్రగతి గాలిమాట. * “ఇంటింటికీ మోదీ అభివృద్ధి సందేశం తీసుకెళ్లండి. * “కార్యకర్తలే పార్టీ విజయానికి పునాది కావాలి. * భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు • బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి బీజేపీ కార్యకర్త ఒక ఛాలెంజ్‌గా తీసుకొని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన ప్రత్యేక కార్యశాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇది నాయకుల ఎన్నిక కాదు… కార్యకర్తల ఎన్నిక!” అని … గ్రామ అభివృద్ధికి నిధులు వచ్చేది మన ప్రభుత్వాల నుంచే అని స్పష్టం చేశారు. గ్రామీణ స్థాయిలో ప్రతీ స్థానంలో బీజేపీ పోటీచేయాలని, ప్రతి ఓటు జాతీయ అభివృద్ధికి పునాదిగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లండి గత రెండేళ్లుగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామీణ పాలన పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. “నరేంద్ర మోడీ ప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేయకపోతే గ్రామాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది,” అని గుర్తు చేశారు. ప్రతి గ్రామానికి వెళ్లి, ఇంటింటికీ చేరి మోదీ ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. బలమైన కార్యాచరణ ద్వారానే బీజేపీ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించగలదని స్పష్టం చేశారు. ఈసారి ఓటుతో గ్రామాన్ని గెలిపించాలి… దేశాన్ని ముందుకు నడిపించాలి,” అని ఆయన నినాదం ఇచ్చారు. *కి“పల్లె ప్రగతి” మాయమాటగా మిగిలింది . * జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ కేవలం మాటల్లోనే మిగిలిపోయిందని అన్నారు. ఖమ్మం జిల్లాలో లక్షలాది మంది రైతులు ఇప్పటికీ రెండెకరాలకుపైగా రుణ భారం మోస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు వరి బోనస్ విషయంలో ప్రభుత్వం న్యాయం చేయలేదని, ఎండాకాలంలో కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటికీ చెల్లింపులు రాకపోవడం సరికొత్త మోసమని చెప్పారు. విత్తనాల విషయంలోనూ నకిలీ విత్తనాలతో వ్యవసాయం దెబ్బతింటోందని, అసలు విత్తనాలు దొరకని పరిస్థితిని తీవ్రంగా విమర్శించారు. “వాణిజ్య వర్గాల పక్షపాతం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యుత్ కొరతలు, సాగునీటి సమస్యలు గ్రామీణ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో మూడుమంది మంత్రులు ఉన్నా కూడా పరిస్థితి యథాతథంగా ఉండడం ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రతిబింబిస్తోంది,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇల్లు, యువశక్తి కార్డులు, రేషన్ పథకాలు వంటి సంక్షేమ పథకాలను కూడా కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం ద్వారా ప్రభుత్వం దారితప్పిన పాలన సాగిస్తున్నదని ఆరోపించారు. నిజమైన అర్హులను పట్టించుకోకుండా అనర్హులకు లబ్ధులు చేకూర్చుతున్నారని విమర్శించారు. “క్షేత్రస్థాయిలో పని చేయండి – గెలుపే లక్ష్యం” నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ – “ఇప్పటికైనా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి. ఇంటింటికీ చేరాలి. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, మోసాలను ప్రజలకు వివరించాలి. బీజేపీని ఒక్కొక్క స్థానంలో గెలిపించే దిశగా కృషి చేయాలి,” అని పిలుపునిచ్చారు. ఈ కార్యశాలలో జిల్లా కన్వీనర్ ఇవి రమేష్,రాష్ట్ర నాయకులు గెంటాల విద్యాసాగర్ రావు, దొంగలు సత్యనారాయణ, సన్నీ ఉదయ్ ప్రతాప్,దేవికి వాసుదేవరావు,దిద్దుకూరి వెంకటేశ్వరావు,నున్నా రవి, నంబూరి రామలింగేశ్వరరావు, పుల్లారావు యాదవ్ గార్లు మరియు మండల అధ్యక్షులు రాష్ట్ర జిల్లా కన్వీనర్లు ప్రబారీలు నాయకులు పాల్గొన్నారు

కాకినాడ

పదవ తరగతి విద్యార్ధి ప్రతిభ

స్థానిక కాకినాడ పి ఆర్ బాయ్స్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి జయ సూర్య పెట్రోల్ బైక్ లను దొంగిలించకుండా ఒక మెషిన్ కనుగొన్నడు. ఒక రిమోట్ సహాయంతో బైక్ ని స్టార్ట్ చేయడం, బైక్ ని ఎవరు కూడా ముట్టకుండా సైరాన్ అమర్చాడు. ఈ విషయాన్నీ ఉపాధ్యాయులు కె. సతీష్ బాబు ప్రధానోపాధ్యాయులు కు తెలుపగా అందరు ఆ విద్యార్థిని అభినందించారు. ఈ రోజులు లో ఇదీ ఎంతో లాభాకరమని అందరు అభివర్ణించారు.

ఖమ్మం

స్థానిక సం స్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ కి బీజేపీ సిద్ధం

తెలంగాణ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల జడ్పిటిసి ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో ఉన్న 20 జెడ్పిటిసి 288 ఎంపీటీసీ స్థానాలలో పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ కసరత్తు ప్రారంభించిందని బలమైన అభ్యర్థులను అన్ని స్థానాలలో నిలిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికలలోనే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే మీ మండలాలలో జడ్పిటిసి ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలను మీ వారికి కేటాయిస్తామని చీకటి ఒప్పందం కుదుర్చుకొని గెలుపును కొనుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఇంటికి మోడీ సంక్షేమ పథకాలు చేరాయని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా మోడీ సంక్షేమ పథకాలు అనుభవిస్తున్నారని ప్రతి పల్లెలో సిసి రోడ్లు వీధి దీపాలు మరుగుదొడ్లు, ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ రైతు వేదికలు స్మశాన వాటికలు ఆయుష్మాన్ భారత్ ముద్ర లోన్స్ వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రతి పేద వారికి చేరాయని ప్రజలందరూ బిజెపి వైపు చూస్తున్నారని స్థానిక సంస్థల ఎన్నికలలో

ఖమ్మం

చిన్న వర్షానికే బయట పడ్డ ఖమ్మం అభివృద్ధి

ఖమ్మం ని మేము అభివృద్ధి చేసాం అంటే మేము అభివృద్ధి చేసాం అని గొప్పగా చెప్పుకుంటున్న నాటి బి ఆర్ ఎస్ నాయకులు కానీ నేటి కాంగ్రెస్ నాయకులు కానీ ఒక్క సారి వర్షా కాలం బయట కి వచ్చే చుస్తే మీరు ఎ మాత్రం అభివృద్ధి చేసారన్నది మీకే అర్ధం అవుతుంది అని బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యావర్గ సభ్యులు ఎల్లరావ్ గౌడ్ లు అన్నారు. మంగళవారం నాడు వర్షాలు కి రోడ్డు మీద నిలిచిన నీటిని వీటి వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల ని వారు పలకరించారు.

ఖమ్మం

చిన్న వర్షానికే బయట పడ్డ ఖమ్మం అభివృద్ధి

ఖమ్మం ని మేము అభివృద్ధి చేసాం అంటే మేము అభివృద్ధి చేసాం అని గొప్పగా చెప్పుకుంటున్న నాటి బి ఆర్ ఎస్ నాయకులు కానీ నేటి కాంగ్రెస్ నాయకులు కానీ ఒక్క సారి వర్షా కాలం బయట కి వచ్చే చుస్తే మీరు ఎ మాత్రం అభివృద్ధి చేసారన్నది మీకే అర్ధం అవుతుంది అని బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యావర్గ సభ్యులు ఎల్లరావ్ గౌడ్ లు అన్నారు. మంగళవారం నాడు వర్షాలు కి రోడ్డు మీద నిలిచిన నీటిని వీటి వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల ని వారు పలకరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.