Sunday, 12 July 2026

Blog

ఖమ్మం

మాతృ భూమి భారత్.: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జ్యేష్ఠ స్వయం సేవక్ సత్యం జీ

మాతృభూమి భారత్ ను విదేశీ బానిసత్వ సంకెళ్ళనుంచి విముక్తి చేయడానికి తమ జీవితాన్ని సమర్పించిన మహనీయులు పూజ్యులు శ్రీ బాలగంగాధర తిలక్ శ్రీ చంద్రశేఖర్ అజాద్ లకు నమస్సుమాంజలి తమమేథస్సు శక్తిసామర్ధ్యాలు భారత మాతసేవకేననిఎలుగెత్తిచాటారు ఒకరు స్వాతంత్రం నా జన్మ హక్కు అని గర్జిస్తే మరొకరు ఆ తల్లి తండ్రి గురువు దైవము భరతమాతేననితన పేరే స్వాతంత్ర్య మని నినదించిశరీరాన్ని హూనం చేసుకున్న వీరవరేణ్యుడొకరు మహనీయులు పుణ్యప్రదం మన స్వాతంత్ర్యం

ఖమ్మం

విజయ డైరీ అభివృద్ధి కి ప్రణాళిక :తుమ్మల

ఖమ్మం పున్నమి ప్రతినిధి పాడి పంటలని ప్రోత్స హించడమే ప్రభుత్వ లక్ష్యం అని వ్యవసాయసహకార, మార్కెంటిగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావ్ అన్నారు. ఖమ్మం లోని విజయ డైరీ తనిఖీ చేసారు. ఈ సందర్భముగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లోమంత్రి మాట్లాడుతూ 50 ఎల్ల క్రితం విజయ డైరీ ప్రారంభం అయింది అని ప్రస్తుతం ఈ భవనం ని ఆధునికరించాలి అని అన్నారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా విద్యుత్ కొనుగోలు చెయ్యాల్సిన అవసరం ఉండదు అన్నారు. నగర పాలక సం స్థ ద్వారా తాగునీటి సరఫరా కి ప్రతిపదనలు రూపొందించాలి అని అధికారులని ఆదేశించారు. డైరీ చుట్టూ పక్కల నుండి మురుగు నీరు లోపల కి వస్తుంది అని దీనికోసం దైవర్షన్ డ్రైన్, ప్రహరీ నిర్మించుకోవాలి అని సూచించారు. చిల్లింగ్ యూనిట్ల ఆధునికరణ కి చర్యలు తీసుకోవాలన్నారు. రాస్ట్రం లో పాడి ఉత్పత్తు లు తగ్గిపోవడం వల్ల ఇతర రాష్ట్ర లనుండి దిగుమతి చేసుకోవలసి వస్తుంది అని వివరించారు, యూరియా తో తయారు చేసే కల్తీ పాలు ఎక్కువ అవుతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ విజయ డైరీ ద్వారా రోజు 5 లక్షల లీటర్ ల పాలు సేకరిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా పాడి రైతు ల కోసం అనేక సం క్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. కలెక్టర్ అనుదీప్ దూరి శెట్టి మాట్లాడుతు విజయ డైరీ సమస్య ల మీద అధికారూలతో సమీక్సిస్తాను అని చెప్పారు. మేయర్ పునకొల్లు నీరజ, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ ఆగస్ట్యా, ఆర్డీఓ నర్సింహా రావు, డిడి రవికుమార్, మేనేజర్ మురళి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మిక్కిలి నేని నరేంద్ర తదితరులు ఉన్నారు

ఖమ్మం

నేడు విద్యా సంస్థ ల బంద్ కి SFI, AISF lu పిలుపు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సం స్థలలో ఫీజ్ ల నియంత్రనకి ప్రత్యేక చట్టాన్ని తీసుకొని రావాలి, పెండింగ్ లో ఉన్న ఫీజ్అ రియం బర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ SFI, AISF లతో పాటు వామ పక్ష విద్యార్థి సంఘాలు నేడు బంద్ కి పిలుపు ఇచ్చాయి. ఖమ్మం లోని పలు విద్యా సంస్థలు ముందు గానే ఈరోజు సెలవు ప్రకటించాయి

ఖమ్మం

విపత్తుల సహాయార్థం కలెక్టరేట్ లో 1077 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

ఖమ్మం పున్నమి ప్రతినిధి విపత్తుల నివారణర్ధం కలెక్టరేట్ లో ని కంట్రోల్ రూమ్. లో టోల్ ఫ్రీ నెంబర్ 1077 ని ఏర్పాటు చేసినట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలిపారు. కంట్రోల్ రూమ్. లో 24 గంటలు మూడు షిప్ట్ లలో విధులు నిర్వహించెందుకు సిబ్బంది ని కేటాయించి నట్లు ఆయన తెలిపారు. అధిక వర్షాలు, వరదలు, పిడుగు పాటు సహా తదితర విపత్తులు సంభవించిన ప్పుడు సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యొచ్చు అని కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలిపారూ

ఖమ్మం

తెలంగాణ లో మూడు రోజులు భారీ వర్షాలు

పున్నమి ఖమ్మం ప్రతినిధి రానున్న మూడు రోజులలో తెలంగాణ భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతాయి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కొమరాంభీమ్ అసిఫా బాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లా ల్లో అతి భారీ వర్షలు, పడుతాయి అని ఈ జిల్లా లకి రెడ్ అలెర్ట్ జారిచేసారు. ఆదిలాబాద్, నిజామా బాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి ములుగు, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి అని ఈ జిల్లా లకి అరేంజ్ అలెర్ట్ జారీ చేశారు

ఆంధ్రప్రదేశ్

హరిహర వీరమల్లు విజయం కోసం చిట్వేలి శివాలయంలో ప్రత్యేకత పూజలు

చిట్వేలి: జూలై 22 ( పున్నమి న్యూస్ ) ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొణిదల పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు విడుదల అవుతున్న సందర్భంగా అఖండ విజయం సాధించాలని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో చిట్వేలి శివాలయంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలు జరిగాయి ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర స్థానిక నాయకులు మాదాసు నరసింహులు, మద్దూరి మన్మధ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లోనూ మరొకవైపు సినిమాల్లోనూ బిజీ బిజీగా గడుపుతున్నారని మనం అనుకుంటున్నామే గాని రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకి ఎప్పుడు ప్రాధాన్యత గానే ఉంటాయన్నారు దేశభక్తితో కూడిన ఈ భారీ సినిమా నిర్మాణానికి సహకరించిన నిర్మాత ఏ ఎం రత్నంకు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కి వారు కృతజ్ఞతలు చెప్పారు బుధవారం సాయంత్రం కోడూరులో జరగబోయే భారీ ర్యాలీకి చిట్వేల్ మండలం నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు

యాదాద్రి భువనగిరి

ఆగస్టు 13 న హైదరాబాద్ లో చేయూత పెన్షన్ దారుల మహాగర్జన.

యాదాద్రి భువనగిరి జిల్లా, పున్నమి ప్రతినిధి సిద్దయ్య ఆగస్టు 13 న హైదరాబాద్ లో చేయూత పెన్షన్ దారుల మహాగర్జన. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చేయూత పెన్షన్ లన్ని తక్షణమే పెంచాలి. – ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ వివరణ :- కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు రూ 6000, మరియు వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు నేత, గీత,బీడీ కార్మికులతో పాటు అన్ని రకాల చేయుత పెన్షన్లను రూ.4000 పెంచాలని డిమాండ్ చేస్తూ మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ఆగస్టు 13 న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో పెన్షన్ దారుల మహాగర్జనను నిర్వహిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. భువనగిరి పట్టణంలోని AR గార్డెన్స్ లో వికలాంగుల, వృద్ధుల, వితంతువుల,వికలాంగుల, చేయూత పెన్షన్ దారుల జిల్లా మహాసభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ” ఎమ్మార్పీఎస్ ఉద్యమం మాదిగల కోసమే ఏర్పడిన అనేక సామాజిక సమస్యల మీద పోరాటం చేస్తూ అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడిందని అన్నారు.అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకం,వికలాంగులు, వృద్దులు, వితంతువులు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు పెంచాలని పోరాడి విజయం సాధించిందని అన్నారు.ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు,తెల్లరేషన్ కార్డులకు రూ 6 కిలోల బియ్యం పెంపు, మహిళ అత్యాచారాల నిరోధానికి 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అక్ట్ పునరుద్ధరణ మొదలగు వాటి మీద పోరాడి పాలకుల మెడలు వంచి సాధించడం జరిగిందని అన్నారు.అదే విధంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు రూ.4000 నుండి రూ 6000 వరకు మరియు వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత బీడీ కార్మికులతో పాటు అన్ని రకాల చేయుత పెన్షన్లు రూ 2000 నుండి 4000 పెంచాలని కండరాల క్షీణత కలిగిన వారికి రూ 15000 పెన్షన్లు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.పెన్షన్ దారులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి 19 నెలల గడిచినా నెరవేర్చకుండా ఘోరంగా మోసం చేయడం జరిగిందని అన్నారు.ఆగస్టు 13 న లక్షలాది మంది పెన్షన్ దారులతో మహా గర్జనను నిర్వహించి తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు.ప్రతి గ్రామం నుండి చేయూత పెన్షన్ దారులు స్వచ్ఛందంగా కదలి రావాలని పిలుపునిచ్చారు.రేపటి నుండి ప్రతి గ్రామంలో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీలను ఏర్పాటు చేసి దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలని ఉద్యమ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాసీమ్, జిల్లా అధ్యక్షులు ధరణికొట నర్సింహ్మా, ఎమ్మార్పియస్ జిల్లా ఇంచార్జీ బిర్రు మహేందర్ మాదిగ, కో ఇంచార్జీ పల్లెర్ల సుధాకర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ, ఎమ్మార్పియస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ, ఎమ్మార్పియస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ, దళిత ఐక్య వేదిక చైర్మన్ భట్టు రాంచంద్రయ్య, వి ఎచ్ పీయస్ నాయకులు గిద్దె రాజేష్, సింగారం రమేష్, లోడి ధనుంజయ్య గౌడ్,సందేల శ్రీనివాస్ మాదిగ, బండారి శివశంకర్,రజిత, పద్మ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

*నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం*

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిద్దయ్య భువనగిరి ఇన్నర్ వీల్ క్లబ్ వారి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం SLNS కాలేజీ ఎదురుగాగల వివేరా హాల్ లో జరిగిందిఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ చైర్మన్ K స్వర్ణ లత గారు విచ్చేసి కార్యక్రమన్ని జరిపించారు ప్రెసిడెంట్ గా Smt E లావణ్య, సెక్రటరీ ga వెంకమ్మ సిస్టర్, ట్రీసుర్ P స్వాతి వైస్ ప్రెసిడెంట్ drఆశ్లేష జాయింట్ సెక్రటరీ భాగ్య గారు ISO ga సుభాషిణి గారు ఎడిటర్ గా ఉమాదేవి ప్రమాణం చేశారు ఈ సందర్బంగా వికలాంగుల సైకిల్ బహుకరించడం జరిగింది మరియు ఆశ వర్కర్ లకు చీరాల పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి dr జయశ్రీ, బండారు జయశ్రీ జ్యోతి సునీత సుమిత్ర Dr అనురాధ Dr ప్రశాంతి గారు మరియు రోటరీ , రెడ్ క్రాస్ సభ్యులు రెడీక్రాస్ వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ గారు డైరెక్టర్ s SP ఉపేంద్ర గారు Sp స్పందన గారు బలరాం రెడ్డి హమీద్ గారు పాల్గొన్నారు

యాదాద్రి భువనగిరి

గొర్ల కాపరులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి-GMPS*

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిద్దయ్య *గొర్ల కాపరులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి-GMPS* జూలై 22 భువనగిరి న్యూస్: గొర్రెల కాపరులు తమ డిమాండ్ల పరిష్కారానికై రాజకీయాలకతీతంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని GMPS రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్,కార్యదర్శి ఉడుత రవీందర్ పిలుపునిచ్చారు.మంగళవారం రాయిగిరి లింగబసవ గార్డెన్లో జరిగిన గొర్రెలు,మేకల పెంపకందారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలకు ముఖ్య అతిథిలుగా హాజరై మాట్లాడుతూ గొర్లు మేకలకు మేత,నీరు,వైద్యం,గొర్రెలకు ఉచిత భీమా,గొర్ల కాపరులకు 50సం.లకు పింఛన్లు,సబ్సిడీ రుణాలు,పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో,చదువుకున్న యువతీ,యువకులు ఉపాధి అవకాశాలు కల్పించాలని అమరజీవి దొడ్డి కొమురయ్య పోరాట స్పూర్తితో పోరాడాలన్నారు.గొల్ల కుర్మల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక సంఘం గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం GMPS అన్నారు.అధికారం చేపట్టిన వంద రోజుల్లో గొల్ల కురుమలకు రెండు లక్షల రూపాయలు నగదు బదిలీ చేస్తామని కామారెడ్డి బిసి డిక్లరేషన్ కాంగ్రెస్ మేనిఫెస్టో 15,16 పేజిలలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 18 నెలలు అయినా అమలు చేయలేదని,పదేళ్లుగా సొసైటీలకు ఎన్నికలు జరపలేదని,రెండున్నర సం.లుగా గొర్రెలు,మేకలకు డీవార్మింగ్,8నెలలుగా మందుల సరఫరా పూర్తిగా నిలిచి పోయిందని,తొమ్మిది నెలలుగా గోపాలమిత్రలకు వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు.రోగాలతో గొర్లు మేకలు చనిపోతున్నాయని ప్రభుత్వం నుండి ఎలాంటి మందులు అందడం లేదని పోరాటాల ద్వారానే పరిష్కారం అవుతాయని అన్నారు.దయ్యాల నర్సింహా అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆలేటి యాదగిరి,ఉమ్మడి జిల్లా డైరెక్టర్లు కల్లూరి మల్లేష్, బండారు నర్సింహ్మ,జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజు,బొమ్మల రామారం సింగిల్ విండో చైర్మన్ గూదె బాలనర్సయ్య,జిల్లా వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ బొలగాని జయరాములు,వడ్డెబోయిన వెంకటేష్,ఈర్లపల్లి ముత్యాలు ఉపాధ్యక్షులు బుడుమ శ్రీశైలం,సహాయ కార్యదర్శి కొండె శ్రీశైలం,మద్దెపురం బాలనర్సయ్య,బుగ్గ చంద్రమౌళి,జోగు శ్రీనివాస్, ర్యాకల శ్రీనివాస్,కడెం బీరప్ప,పాక జహాంగీర్,దేవునూరి బాలయ్య,క్యాసాని నవీన్, నరాముల గణేష్,నారి వెంకటేష్,నారి మల్లేష్,బీమనబోయిన బాలరాజు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

పెండింగ్ లో ఉన్న 8300 వేలకోట్లు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి* *ప్రవేట్ విద్యాసంస్థలు ఫీజుల దోపిడి అరికట్టాలి*

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిద్దయ్య *భువనగిరి , చౌటుప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి* *ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి* *_____ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ లావుడియ రాజు* *కలెక్టరేట్ వద్ద ఉద్రిగత* *ఎస్ఎఫ్ఐ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట ఘర్షణ* *పెండింగ్ లో ఉన్న 8300 వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతోటి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుంచి 8300వేల కోట్ల స్కాలర్షిప్లో పెండింగ్లో ఉన్నాయి విడుదల చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు గత పది సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేయకుండా కాలయాపన చేసింది ప్రభుత్వ విద్యారంగాన్ని బ్రస్టు పట్టించింది, నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేరుతోటి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న స్కాలర్షిప్లు విడుదల చేయడంలో చిత్తశుద్ధి కనబడటం లేదు తన తన మేనిఫెస్టోలోని అధికారులు వస్తే ఎడారిలోనే ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు దాని ఊసి కూడా ఎత్తడం లేదు ఒకవైపు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల బలవపదం చేస్తామంటున్న ప్రభుత్వం మరోవైపు ఎలాంటి అనుమతులు లేని ప్రైవేట్ విద్యాసంస్థలను స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించడం సిగ్గుచేటు అదేవిధంగా జిల్లాలో ప్రవేటు విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్న అధికారులు చూసి చూడంగానే వివరిస్తున్నారు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవేటు విద్యాసంస్థలు తొత్తుగా వ్యవహరిస్తున్న పారిపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు లేవు,విద్యార్థులకు ఇప్పటివరకు రెండు దుస్తుల, పూర్తిస్థాయిలో పుస్తకాలు ఇవ్వలేదు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో పూర్తిగా శిథిల వ్యవస్థలో ఉన్నాయి తెలంగాణ విద్యా సంస్థలు అంటేనే గురుకులం చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో రోజుకు ఫుడ్ పాయిజన్ గురవుతున్న కనీసం అధికారులు పరామర్శించడం గాని సమీక్షించడం కానీ జరపడం లేదు, గురుకులాల మీద చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు గురుకులాలకు సొంత భవనాలు లేక అద్దె కొనసాగుతున్నాయి అద్దె భవనాలు కూడా కిరాయికి కట్టలేక యజమానులు తాళాలు వేసే పరిస్థితి ఉన్నది సంక్షేమ హాస్టళ్లకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలకు బస్ సౌకర్యం లేదు బస్ సౌకర్యం లేక విద్యార్థులు నడుచుకుంటూ ఆటోలకు పాఠశాలకు వెళ్తున్నారు జిల్లాలో ప్రభుత్వ విద్యా రంగం బలోపేతంపై జిల్లా కలెక్టర్ గారు విద్యార్థి సంఘాల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని లేనియెడల జిల్లా అధికారులను ఎమ్మెల్యేలను జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించడం జరుగుతున్నది, విద్యార్థులకు పోలీసులకు తోపులాటతో చాలామంది విద్యార్థులకు గాయాలకు జరిగాయి ప్రజా ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకొస్తున్నామని చెప్పిన, అధికారులు విద్యార్థుల వచ్చి సమస్యలను తెలుసుకునే సమయం కూడా లేకుండా విద్యార్థుల మీద పోలీసుల లాటి చార్ట్ చేయడం సిగ్గుచేటు ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకోవాలని లేనియెడల విద్యార్థులే ప్రతిఘటించాల్సిన పరిస్థితి వస్తుందని కావున ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాము ఇంక ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, కాసుల నరేష్, ఈర్ల రాహుల్ ,జిల్లా సహాయ కార్యదర్శి తీగుళ్ల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు పుట్టల ఉదయ్, ధరావత్ జగన్, బుగ్గ ఉదయ్, ఈర్ల కార్తీక్, ఎండి నేహాల్, హిందు రాణి, గాయత్రి, శ్రావణ్ రెడ్డి, మైసూర్ల నరేందర్ మహేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు….*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.