Sunday, 12 July 2026

Blog

ఖమ్మం

ఉచిత శిక్షణ కార్యక్రమం ని ప్రారంభం చేసిన దేవకీ వాసు దేవా రావు

వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్- ఖమ్మం ( @vihekhammam ) ఆధ్వర్యంలో MJPTBCWRDC (మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీ) విద్యార్థినులకు.. Tally with GST ప్రత్యేక ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం చేశారు ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగాదేవకీ వాసుదేవరావ్ పాల్గొని ప్రారంభించారు

భద్రాద్రి కొత్తగూడెం

మైనర్ కుతురు ను కొట్టిన తండ్రి పై కేసు నమోదు..

పున్నమి ప్రతినిధి(జూలై23) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండల సారాపాక గ్రామంలో మైనర్ బాలిక (8) ను తండ్రి అయిన మిర్యాల రమేష్ కొట్టుతున్నడని టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారం గా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 కోఆర్డినేటర్ బానోత్ సందీప్, కేస్ వర్కర్ జి. భవాని, డిస్ట్రిక్ట్ ఛైల్డ్ ప్రోటేక్షన్ యునిట్ పివో యన్.ఐ.సి. అదూరి శేషయ్య, అవూట్ రీచ్చ్ వర్కర్ యస్. లతా, ఐసిడిఎస్ సుపర్ వైజర్ సక్కుబాయి తదితరులు బుర్గంపాడు, సారాపాక లోని బాలిక ఇంటికి రెస్కు కు వెళ్లి చేయగా బాలిక తన తల్లి తో కలిసి తన అమ్మమ్మ ఇంటికి కురివి వెళ్లినట్టు తెలిసింది. బాలిక తో విడియో కాల్ లో మాట్లాడిన ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా జరిగిన విషయం తెలుసుకుని, బాలిక తండ్రి పై పోలీస్ కేసు నమోదు కు ఆదేశాలు ఇచ్చారు. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో సుపర్ వైజర్ సక్కుబాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బుర్గంపాడు మేడ ప్రసాద్ ఫిర్యాదు స్వీకరించి క్రైమ్ నెంబర్ 206/2025 క్రింద యఫ్.ఐ.ఆర్. నమోదు చేశారని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా తెలిపారు. 18 సంవత్సరాల లోపు బాల బాలికలను ఎవరైన కొట్టిన, ఛైల్డ్ మ్యారేజ్లు చేసిన, ఛైల్డ్ లేబర్ గా పని చేయిస్తున్న టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు కాల్ చేసి ఫిర్యాదు చేయలని, కాలర్ యొక్క వివరాలు పూర్తిగా గోప్యంగా వుంచబడుతాయని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా తెలిపారు.

చిత్తూరు

ఎస్పీ మణికంఠ చందోలు మర్యాదపూర్వకంగా కలిసిన ప్రొబేషనరి ఎస్ఐ లు

చిత్తూరు, జులై 23 ( పున్నమి ప్రతినిధి ) : చిత్తూరు జిల్లా కు కేటాయించబడిన 8 మంది ప్రొబేషనరి ఎస్. ఐ లు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కి పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఎస్పీ ప్రొబేషనరీ ఎస్సైలతో మాట్లాడుతూ… ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలి, విధులను నిజాయితీగా నిర్వర్తించాలి, చట్టపరమైన అవగాహన పెంపొందించుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంటుకు గౌరవం తీసుకురావాలి, ప్రజల విశ్వాసం సంపాదించాలి, బాధ్యతాయుతంగా పని చేయాలని సూచనలు చేశారు.

ఖమ్మం

రాష్ట్ర ప్రభుత్వం రైతు ల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహారిస్తుంది కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నదని కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా మధిర రూరల్ మండలం మాటూరు రెవిన్యూ పరిధిలో దశాబ్దాలుగా బలహీనవర్గాలు షెడ్యూల్ కులాలు సాగు చేసుకుంటున్న భూములు కెసిఆర్ ప్రభుత్వ హయాంలో సుమారు 200 ఎకరాలకు పైగా భూములు ధరణి పోర్టల్ తప్పుల కారణంగా వక్ఫ్ భూములుగా నమోదు అయిన నేపథ్యంలో రైతులు న్యాయస్థానంలో న్యాయపోరాటం చేస్తున్నారు . ఈ క్రమంలో నాగపూర్ అమరావతి జాతీయ రహదారి విస్తరణలో సుమారు పది ఎకరాల భూమి రహదారి విస్తరణ పనులకు సేకరించిన నేపథ్యంలో రైతులు పరిహారం ఇప్పించాలని అధికారులకు మొరపెట్టుకున్న టైటిల్ డిస్ప్యూట్ పెండింగ్ ఉన్నదని తెలిసినా అధికార యంత్రాంగం కేంద్రం సదరు భూములకు ఇచ్చిన పరిహారాన్ని వక్ఫ్ బోర్డు లో ఏక పక్షం గా జమ చేయడం దుర్మార్గం అని అన్నారు.నిబంధనలకు విరుద్ధం . ప్రాజెక్టు విస్తరణలో భూములు కోల్పోయి పరిహారం అందక రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం ధరణి పోర్టల్ లో తప్పులు దొర్లాయని వాటన్నిటిని సరిదిద్ది వాస్తవమైన హక్కుదారులకు పట్టాలిస్తామని చెప్పి ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఉదారంగా వ్యవహరించి ఇచ్చినటువంటి న్యాయమైన పరిహారాన్ని సుమారు రెండు కోట్ల రూపాయలను అనాలోచితంగా వక్ఫ్ బోర్డులో ఎలా జమ చేశారో చెప్పాలన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి కేంద్రం ఇచ్చిన పరిహారాన్ని వాస్తవ రైతులకు ఇవ్వాలని కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేసారు.

ప్రకాశం

ట్రాఫిక్ సమస్య

నడిరోడ్డుపై తోపుడు బండ్లు… నగరంలో ట్రాఫిక్ జామ్ పున్నమి ప్రతినిధి, జూలై 23,ప్రకాశం జిల్లా, పామూరు: ముందుకెళ్ళేందుకు దారి లేదు, వెనక్కి తిరిగేందుకు అవకాశం లేదు.ఇది శుక్రవారం పట్టణంలోని విరువూరు రోడ్,సీఎస్ పురం రోడ్ కూడళ్ళలో ట్రాఫిక్ పరిస్థితి.నడిరోడ్లపైకి తోపుడు బండ్లు వచ్చి నిలబడుతూ ఉండడంతో భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఇటీవల ప్రధాన రహదారులను ఆక్రమించుకుని ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తూ వచ్చిన పంచాయితీ శాఖ విరువూరు రోడ్ లో మాత్రం పూర్తి స్థాయిలో తొలగింపును చేపట్టకుండా ఆగిపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది.దీంతో వాహనాలన్నీ రెండు వైపులా రోడ్లపై నిలబడిపోతున్నాయి.భారీ వాహనాలైతే కూడలిలోని మూల మలుపు వద్ద టర్నింగ్ తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి.విరువూరు రోడ్ లో పంచాయితీ శాఖ ఆక్రమణల తొలగింపు చర్యలు మధ్యలో ఎందుకు ఆపేయవలసి వచ్చిందో అర్థం కావడం లేదని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పంచాయితీ శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజలు సదరు శాఖలను హెచ్చరించారు.

ఖమ్మం

నీట్ పై తెలంగాణ ప్రభుత్వం కి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

ఖమ్మం పున్నమి ప్రతినిధి నీట్ పరిక్ష విషయం లో స్థానికత విషయానికి పరిష్కారం వెతకాలి అని, విద్యార్థుల ని ఇబ్బందులకి గురించేయ్యొద్దు అని తెలంగాణ ప్రభుత్వం కి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీట్ పరీక్ష రాయడానికి ముందు 4 ఏళ్ళు చదివితేనే స్థానికత వర్తిస్తుంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. తదుపరి విచారణ ఆగస్టు 5 కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు

ఖమ్మం

రేపు తాండ్ర వినోద్ రావు ఆత్మీయ సమావేశం

ఖమ్మం పున్నమి ప్రతినిది భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు జన్మదినం సందర్భముగా గురువారం ఖమ్మం లోని నర్సింహా స్వామి టెంపుల్ రోడ్ నందు గల సరిగమప ఫంక్షన్ హల్ నందు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు వినోద్ రావు క్యాంప్ కార్యలయ ఇంచార్జ్ పోతుల వీర చంద్ర శేఖర్ తెలిపారు.

అన్నమయ్య

చిట్వేలి లోసమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం

చిట్వేలి లోసమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం చిట్వేలి (పున్నమి ప్రతినిధి )జులై 23 చిట్వేల్ లోని మండల వ్యవసాయ కార్యాలయం నందు సమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యాక్రమం కి ముఖ్య అతిధి గా సహాయ వ్యవసాయ సంచాలకులు, రైల్వే కోడూరు శ్రీ ఎస్. మణి హజరు కావడం జరిగింది. ప్రజలు తమకు కావలసిన సమాచారం ప్రతి శాఖ నందు సంబంధిత పౌర సమాచార అధికారి కి దరఖాస్తు చేసి సమాచారం ను పొందవచ్చునని తెలిపారు.ఈ సందర్బముగా సమాచార చట్టం 2005 విధి విధానాలు వివరించడం జరిగింది.. ఈ కార్యక్రమం లొ మండల వ్యవసాయ అధికారి, చిట్వేల్ శ్రీ జి సుధాకర్, వి ఏ ఏ, వి హెచ్ ఏ లు, ఏపీ సీఎం ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు

అన్నమయ్య

చిట్వేలి లోసమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం

చిట్వేలి (పున్నమి ప్రతినిధి )జులై 23 చిట్వేల్ లోని మండల వ్యవసాయ కార్యాలయం నందు సమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యాక్రమం కి ముఖ్య అతిధి గా సహాయ వ్యవసాయ సంచాలకులు, రైల్వే కోడూరు శ్రీ ఎస్. మణి హజరు కావడం జరిగింది. ప్రజలు తమకు కావలసిన సమాచారం ప్రతి శాఖ నందు సంబంధిత పౌర సమాచార అధికారి కి దరఖాస్తు చేసి సమాచారం ను పొందవచ్చునని తెలిపారు.ఈ సందర్బముగా సమాచార చట్టం 2005 విధి విధానాలు వివరించడం జరిగింది.. ఈ కార్యక్రమం లొ మండల వ్యవసాయ అధికారి, చిట్వేల్ శ్రీ జి సుధాకర్, వి ఏ ఏ, వి హెచ్ ఏ లు, ఏపీ సీఎం ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు

ఖమ్మం

రైతన్న ల సమస్య లను వెంటనే పరిష్కరించాలి. BKS డిమాండ్

భారతీయ కిసాన్ సంఘ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పగడవరపు శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో బుధవారం జాయింట్ కలెక్టర్ ని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు కలిసి పలు సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. ఈనెల 15వ తారీకు నేలకొండపల్లిలో జరిగిన ఖమ్మం జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ విస్తృత కార్యకర్తల సమావేశంలో చేసిన రెండు తీర్మానాల కాపీలను కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా భారతీయ కిసాన్అ సంఘ్ధ్య క్షులు శ్రీ పగడవరపు శ్రీనివాసరావు గ మాట్లాడుతూ… * సీతారామ ప్రాజెక్టు ద్వారా కారేపల్లి కామేపల్లి ఏన్కూరు మండలాలకు నీళ్లు ఇవ్వాలని ఆ మండలాలు పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి ఉన్నాయని అన్నారు.. పాత ప్లాన్ ప్రకారం కాలువలు తొవ్వి అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీని అటువైపు నీరు ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఏజెన్సీ రైతులపై ప్రబుత్వం వివక్షను చూపడం దురదృష్టకరం అని ఈ మేరకు జిల్లా సమావేశం చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి అందించాలని కోరారు * ⁠అదే విధంగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున సాగవుతున్న సీడ్ మొక్కజొన్న రైతులకు కంపెనీలకు మధ్య దళారీలు తీవ్రంగా మోసం చేస్తున్నారని కాబట్టి నేరుగా కంపెనీలే సీడ్ మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు విత్తనాల నుంచి నేరుగా వారి ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని భారతీయ కిసాన్ సంఘ్ చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి గౌరవ జాయింట్ కలెక్టర్ ద్వారా అందించడం జరిగింది. దానితోపాటు కూసుమంచి మండలం చేగుమ్మ గ్రామంలో భక్త రామదాసు కాలువ నష్టపరిహారం ఇవ్వని కారణంగా రైతు కాలువ పూడ్చడం తొ కాలువ నీళ్లు రైతుల పొలాల నుండి పోతూ నష్టం జరుగుతుందని ఈ సమస్యపై వెంటనే దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరడం జరిగింది * ⁠అదేవిధంగా తనికెళ్లలో చేలకు వెళ్లే డొంకా పూర్తిగా బురదమయమై నీళ్లు నిలబడి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృశ్య రోడ్డు వేయాలని కోరడం జరిగింది.. * ⁠చింతకాని మండలం తిమ్మినేనిపాలెం లో గతంలో ఉన్న డొంకను కొంతమంది ఆక్రమించి రైతులను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది. * అదేవిధంగా కొనిజర్ల మండలం రామనర్సయ్య నగర్ సంబంధించి సీడ్ విత్తనాలు పండించిన రైతులను ఆరు నెలల నుండి డబ్బులు ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న మధ్యవర్తి సైదాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సదురు రైతులకు నగదు ఇప్పించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ ఖమ్మం జోన్ కార్యదర్శి మందనపు రామారావు జిల్లా కార్యదర్శి తాళ్లూరు శ్రీనివాసరావు జిల్లా సహాయ కార్యదర్శి తూము అప్పారావు కొనిజర్ల మండల అధ్యక్షుడు సత్యనారాయణ శ్రీనివాస్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.