Sunday, 12 July 2026

Blog

ఆంధ్రప్రదేశ్

తొలి అడుగు పై ప్రజలు హర్షం

సిద్ధవటం జూలై22 సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే వైసిపి గోబెల్స్ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందంటూ మండల టిడిపి అధ్యక్షులు మోహన్ రెడ్డి తెలిపారు మండలంలోని పెద్దపల్లి గ్రామపంచాయతీ కను మ లో పల్లె గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పిన వాగ్దానాల ప్రకారం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరువైతుంటే వైసిపి గోబెల్స్ ప్రచారాలు మానుకోవాలని తల్లికి వందనం దీపం పథకం, అన్నా క్యాంటీన్లు యువతకు ఉద్యోగాలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, రైతు సంక్షేమం మహిళా సంక్షేమ ఇవన్నీ అమలు అవుతుంటే వైసిపికి వణుకు పుట్టి మాపై గోబల్స్ ప్రచారాలు మానుకోవాలని మీరు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది అని అన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ దశరథ నాయుడు, రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వహణ కార్యదర్శి శ్రీనివాస నాయుడు మాజీ మార్కెట్ చైర్మన్ సయ్యద్ జవహర్ భాష, ముస్లిం మైనారిటీ అధ్యక్షులు డాక్టర్ వీరభద్రుడు సర్పంచ్ ప్రతినిధి తుర్ర ప్రతాప్ నాయుడు బీసీ సెల్ నియోజకవర్గ కార్యదర్శి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

సింగనమాల వీధి లో నిలువ ఉన్న నీరు

చిట్వేలి జులై 22 పున్నమి న్యూస్ సింగనమాల వీధి లో నిలువ ఉన్న నీటి లో గంబూషియా ఫిష్ వదలడం జరిగినది మలేరియా డెంగీ చీకున్ గున్య కలుగ చేయు .. దోమలు, లార్వా ను చంపుతాయి ఈ కార్యక్రమం లో మెడికల్ ఆఫీసర్, సబ్ unit ఆఫీసర్… ఆరోగ్య విస్తరణ అధికారి సూపెర్వైసోర్ Mlhp Anm and ఆశలు పాల్గున్నారు

అన్నమయ్య

లబ్ధిదారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ముక్కా రూపానంద రెడ్డి విక్టరీ స్కూల్ విద్యార్థులతో తల్లికి వందనం పథకం గురించి చర్చించిన ముక్కా రూపానంద రెడ్డి

రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంరిలీఫ్ ఫండ్) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల కోడూరు పట్టణం విక్టరీ స్కూల్ ఆవరణ నందు స్వయంగా అందజేశారు పంపిణీ చేసిన మొత్తం రూ.3,95,903/- కాగా, లబ్ధిదారుల వివరాలు 1..బొదనపు ఖదీర్ సాహెబ్ (మరణం) C/o బొదనపు మొహబూబ్ బీ, కోడూరు – ₹1,10,305/- 2..వాది వెంకట కృష్ణయ్య కోడూరు – ₹42,193/- 3..డానరిచేని శశికళ కోడూరు – ₹37,292/- 4..మిట్ట వీధి మునిరత్నం కోడూరు – ₹20,000/- 5..పటాన్ మొహమ్మద్ యాసీర్ కోడూరు – ₹90,276/- 6.ఎలిశెట్టి సుబ్రహ్మణ్యం రెడ్డివారిపల్లి – ₹95,837/- లబ్ధిదారులు అందుతున్న ప్రభుత్వ సహాయానికి హర్షం వ్యక్తం చేస్తూ, ముక్కా రూపానంద రెడ్డి గారి సేవా దృక్పథాన్ని ప్రశంసించారు,ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ “పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య మరియు ఆర్థిక సమస్యలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఆశాజ్యోతి లాంటిది. ప్రతి కుటుంబంలో వెలుగును నింపాలన్నదే మా లక్ష్యం. సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుంది.”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లొ ఉపాధ్యాయులు, ఎన్డీఏ కుటమి నాయుకులు పాల్కొన్నారు

అన్నమయ్య

కేరళ మాజీ సీఎం ,సిపిఎం అచ్యుతానందన్ !రైల్వే కోడూరులో సిఐటియు కార్యకర్తలు ఘనంగా  నివాళి నేటి రాజకీయాలకు ఆయన ఆదర్శం!

రైల్వేకోడూరు జూలై 22 (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా రైల్వే కోడూర్, సిఐటియు  ఆధ్వర్యంలో  మంగళవారం సాయంత్రం, సిఐటియు ఆఫీసులో, కేరళ మాజీ సీఎం, సిపిఎం పార్టీ అచ్యుతానందం మృతికి, ఆయన చిత్రపటానికి, సీనియర్ కార్మిక నాయకులు, మోడీ సుబ్బరామయ్య, పూలమాలయసి, ఘనంగా, నివాళులర్పించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, జిల్లా నాయకులు,  ఏపీఎండిసీ జేఏసీ పోరాట కన్వీనర్, ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ, సిపిఎం పార్టీ పొలిటి బ్యూరో మెంబర్ అచ్యుతానందన్ , పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాను, ఏడుసార్లు ఎమ్మెల్యే గాను, మూడుసార్లు కేరళ విపక్ష నేతగా పని చేసిన అచ్యుతానందన్.. 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పాలన అందించారు.1923 అక్టోబర్ 20న అలప్పుజ జిల్లాలోని పున్నప్రాలో పేద కుటుంబంలో జన్మించారు.  చిన్నతనంలోనే, తల్లిదండ్రులు చనిపోవడం, ఏడో తరగతి  చదువు మానేసి,  అన్నటైలరింగ్  సహ కార్మికుడిగా, తర్వాత, కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో కార్మికుడిగా చేరి, కార్మిక సంఘం గా ఏర్పాటు చేశాడు . పున్నమినార్ భూ పోరాటంలో, కీలక పాత్ర పోషించారు.అయిదుసంవత్సరాలు,జైలుజీవితం గడిపారు.  కుల వివక్షత, మహిళా హక్కుల కోసం, పోరాడారు అన్నారు.అచ్యుతానందన్. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన1938లో స్టేట్ కాంగ్రెస్లో చేరారు.  ఆ విధానాలు నచ్చక,ఆ తర్వాత దానికి గుడ్ బై చెప్పి 17 సంవత్సరాల వయసులో 1940లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా  జాయిన్ అయ్యారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి 1957లో CPIకేరళ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1964లో  సిపిఐ జాతీయ మండలి నుండి వైదొలిగి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)ను స్థాపించిన 32 మంది సభ్యులలో ఆయన ఒకడిగా ఉన్నారు. వారిలో ఆఖరి  వారు ఇతను.1980 నుంచి 1992 మధ్య ఆయన కేరళ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పని చేశారు.వరుసగా మూడుసార్లు కేరళ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2006 నుంచి 2011 వరకు కేరళ సీఎంగా పని చేశారు. 2016 నుంచి 2021 వరకు క్యాబినెట్ హోదాతో పరిపాలనా సంస్కరణల కమిషన్ ఛైర్మన్గా సేవలు అందించారు. భూ సంస్కరణ లు అమలు చేశారు. 10 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చారు, 102 సంవత్సరాలు  ఎక్కువ కాలం బ్రతికిన వారిలో ఒకరు, 85 సంవత్సరాలు తన జీవితాన్నే  ప్రజల కోసం, కార్మికులు కష్టజీవుల కోసం  నమ్మిన సిద్ధాంతం  సోషలిజం కమ్యూనిస్టు పార్టీ కోసం ఆఖరి వరకు  కొనసాగారన్నారు. నీతి నిజాయితీ, క్రమశిక్షణ నిరాడంబర, ఆదర్శంగా, జీవించారన్నారు. విలువలు లేనినేటి రాజకీయ తరాలకు, ఆయన జీవితం ఆదర్శం అన్నారు.అనారోగ్యం, వయోభారం కారణంగా గుండెపోటుతో మరణించారు తాను అల్పెరగని పోరటం చేసిన కామ్రేడ్ అచ్యుతానందన్ గారి సేవలు మరువలేని వారు కొనియాడారు .పార్టీకి తీరనిలోటు తెలిపారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో, సిపిఎం పార్టీ, శాఖా కార్యదర్శి, లింగాల యానాదయ్య, సిఐటియు, మండల కార్యదర్శి, పి జాన్ ప్రసాద్, ఓబులవారిపల్లి మండల కార్యదర్శి, నగరిపాటి పెంచలయ్య, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, మండల కన్వీనర్,బండారు రాజశేఖర్,విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్  నాయకులు, ఎం సుబ్బరాయుడు, పకృతి వ్యవసాయం, ఓబులవారిపల్లి మండలం, నాయకులు, బుజ్జియా ఆటో వర్కర్స్ యూనియన్, నాయకులు, చెన్నూరు మురళి, ఎర్రి పోగు సుబ్బరాయుడు, రైతు సంఘం నాయకులు, సి.సుభాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు, ఎస్.లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

ప్లాస్టిక్ వాడకం మీద నిషేధం ఏది..?

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరము తో పాటు జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు ప్లాస్టిక్ కవర్లు వినియోగం తో పాటు విక్రయించే వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది. ఖమ్మం నగర కార్పొరేషన్ అధికారులు తు తు మంత్రం గా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున చిన్న చితక షాప్ ల మీద దాడులు జరిపి వారి మీద జరిమానా లు వేస్తున్నారే తప్ప భారీ గా ప్లాస్టిక్ కవర్లు అమ్మి సొమ్ము చేసుకునే వారి మీద చర్యలు తీసుకోకపోవడం లో ఆయా వ్యాపారస్తులు అధికారులకి మాములు ముట్టచెప్తున్నారనే అనుమానం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు

అన్నమయ్య

కోడూరు ప్రజలు డ్రైనేజీ సమస్యలపై వెంటనే స్పందించిన ముక్కా రూపానంద రెడ్డి త్వరలో మరమ్మత్తులకు హామీ..

రైల్వే కోడూరు జూలై 22 (పున్నమి ప్రతినిధి) ప్రజల అభిప్రాయాలు మేరకు పలు కాలనీలలో డ్రైనేజీ సమస్యలపై వెంటనే స్పందించిన రూపానంద రెడ్డి కోడూరు పట్టణం అభివృద్ధి కార్యక్రమాలకు అతి త్వరలోనే శ్రీకారం.కోడూరు పట్టణం గాంధీనగర్ నందు ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం విజయవంతం సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా కోడూరు పట్టణం గాంధీనగర్ నందు కార్యక్రమం నిర్వహించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం గడుస్తున్న నేపథ్యంలో చేపట్టిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమానికి భారీ ప్రజాదరణ అందుతోంది. గత 20 సంవత్సరాలుగా పెండింగ్ పడిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్క సంవత్సర కాలంలో పుంజుకున్నాయి అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి అండ ఆదరణ ఇదే రకంగా ఉంటే మునుముందు మేము మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయుకులు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

తెలంగాణ మంచిర్యాల

సహారా కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన బాధితులు

*సహారా కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన బాధితులు* మంచిర్యాల, జులై 22, పున్నమి ప్రతినిధి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సహారా ఇండియా కార్యాలయం ముందు మంగళవారం ప్లే కార్డ్స్ పట్టుకొని డిపాజిట్ దారులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ సింగరేణి విశ్రాంత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, అసంఘటిత రంగంలో పనిచేసే కూలీలు తమ రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా కూడబెట్టిన లక్షలాది రూపాయల డబ్బులను భవిషత్తులో తమ కూతుర్ల పెళ్లిళ్ల కోసం, కొడుకుల చదువుల కోసం, చిన్న ఇల్లు కట్టుకోవడానికి ఆసరాగా ఉంటాయనే ఉద్దేశ్యంతో సహారా ఇండియాలో డిపాజిట్ చేశామని తెలిపారు. డిపాజిట్ చేసిన పాలిసీలు మెచ్యూరిటీ పూర్తి అయ్యి సంవత్సరాలు గడుస్తున్నా, చెప్పులు అరిగేలా సహారా ఆఫీస్ ల చుట్టూ తిరిగినా డిపాజిట్ డబ్బులను చెల్లించడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నేడు కార్యాలయం ముందు ఆందోళనకు దిగామని, తమ డిపాజిట్ లను వెంటనే చెల్లించకపోతే తమ కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మ హత్యలు చేసుకోవడమే శరణ్యమని బాధితులు విలపించారు. సహారా బాధితుల సమస్యలపై స్థానిక ప్రజా ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలు స్పందించి న్యాయం చేసే విధంగా కృషి చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ సందర్భంగా సహారా కార్యాలయంలోని సిబ్బందికి సహారా ఇండియా పాలిసీలు మెచ్యూరిటీ పూర్తయిన ఖాతాదారులకు వెంటనే డబ్బులు చెల్లించే విధంగా కృషి చేయాలని, లేని ఎడల సహారా ఇండియా కార్యాలయాల ముందు శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని బాధితులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సహారా బాధితుల సంఘం నాయకుడు, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, సహారా బాధితులు దండు రాజమౌళి, జి.ప్రభాకర్, ఎం. కాంతయ్య, పి. చంద్రకాంత్, ఎస్. భీమేష్, బాలు, తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

రైతు కూలీలతో పొంగులేటి మాట మంతి

పున్నమి ప్రతి నిధి కర్ణాటక రాష్ట్రం రాయచూర్ రూరల్ కురుమూరు రాంపూర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి రైతులు , రైతు కూలీలతో చర్చించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిన 11 సంవత్సరాల నరేంద్ర మోడీ సువర్ణ పరిపాలన ,అవినీతిరహిత పరిపాలన గురించి వారికి వివరించి వారి కష్టసుఖాలను తెలుసుకొన్న జాతీయ నాయకులు తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల సహా ఇంచార్జ్ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి

ఖమ్మం

రైతు కూలీలతో పొంగులేటి మాట మంతి

పున్నమి ప్రతి నిధి కర్ణాటక రాష్ట్రం రాయచూర్ రూరల్ కురుమూరు రాంపూర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి రైతులు , రైతు కూలీలతో చర్చించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిన 11 సంవత్సరాల నరేంద్ర మోడీ సువర్ణ పరిపాలన ,అవినీతిరహిత పరిపాలన గురించి వారికి వివరించి వారి కష్టసుఖాలను తెలుసుకొన్న జాతీయ నాయకులు తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల సహా ఇంచార్జ్ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి

హైదరాబాద్

రాజ్ నాధ్ సింగ్ ని కలిసిన రామచంద్ర రావు

కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ రాజనాథ్ సింగ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్.రాంచందర్ రావు గారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఎన్.వీ.సుభాష్ గారు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.