Tuesday, 14 July 2026

Blog

ఖమ్మం

మూత బడిన మద్యం మాంసం దుకాణాలు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి ) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మద్యం, మాంసం దుకాణాలు మూత బడ్డాయి. 79 స్వాతంత్ర్య దినోత్సవం సంధరబ్బముగా జిల్లా వ్యాప్తంగా ఈ దుకాణాలు మూత బడ్డాయి. కాగా మద్యం మాంసం ప్రియులు ముందు జాగ్రత్త గా గురువారం రోజే వారికి కావాల్సినంత మద్యం, మాంసం ని కొనుగోలు చేసుకున్నారు. రోజు కంటే గురు వారం కొంచెం ఎక్కువ మొత్తం లో వ్యాపారం జరిగినట్లు మద్యం, మాంసం దుకాణదారులు తెలిపారు.

అన్నమయ్య

పేదల దుఃఖంలో ‘నేనున్నాను’ — సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ముక్కా సాయి వికాస్ రెడ్డి

చిట్వేల్, ఆగస్టు — పున్నమి ప్రతినిధి పేదలు ఆపదలో ఉన్న వేళ ‘నేనున్నాను’ అని అండగా నిలవడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి మనసుకు నిదర్శనమని టిడిపి నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి అన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన స్వయంగా ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. “పేదల కష్టసమయంలో పక్కన నిలబడటం మా ధర్మం. రాష్ట్ర ప్రజల కోసం సీఎం గారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు” అని ముక్కా సాయి వికాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కూటమి ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ఏఎస్ఐ ఉస్మాన్ ఘనీ ఖాన్‌కు విశిష్ట సేవా పతకం

రాయచోటి, ఆగస్టు 14: శాంతి భద్రతల పరిరక్షణలో అంకితభావంతో చేసిన విశిష్ట సేవలకు కేంద్ర ప్రభుత్వం అందించే Police Medal for Meritorious Service కు అన్నమయ్య జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ (2072) నాయబ్ ఉస్మాన్ ఘనీ ఖాన్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు ఘనీ ఖాన్‌ను అభినందించారు. 1987లో కానిస్టేబుల్‌గా పోలీసు సేవ ప్రారంభించిన ఘనీ ఖాన్, మదనపల్లి వన్‌టౌన్, మదనపల్లి తాలూకా, మొలకలచెరువు, బి.కొత్తకోట, గుడిపాల, ఎర్రావారిపాలెం, సీఐ సెల్ తదితర స్టేషన్లలో సేవలందించారు. సర్వీస్ కాలంలో 70 నగదు రివార్డులు, 50 జి.ఎస్.ఈలను అందుకున్న ఘనీ ఖాన్, ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు.

ఖమ్మం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) భారత దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సం దర్భముగా బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ ఖమ్మం జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కభారతీయ పౌరుడు దేశం పట్ల ప్రేమ గౌరవం తో ఉండాలి అని ఈ సం దర్భముగా గల్లా సత్యనారాయణ అన్నారు. ప్రియతమా ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానము లో నిలిపిన మహోన్నత శక్తి అని అయన అన్నారు

తెలంగాణ

నకిరేకల్ పట్టణంలో బోనాల పండుగ సంబరాలు

నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నకిరేకల్ పట్టణంలోని ముత్యాలమ్మకు గురువారం (14ఆగస్ట్ 2025) నాడు బోనాలు ఇవ్వడం (సమర్పించడం ) జరిగింది. పట్టణంలోని భక్తులు ఆలయంకు ఉదయం నుండే అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. బోనాల పండుగను తెలంగాణా ప్రజలు ఆషాడ మాసం, శ్రావణమాసంలలో జరుపుకుంటారు. బోనం అర్ధం భోజనం, ఎల్లమ్మ దేవతను ప్రత్యక్షంగా పూజిస్తారు. పాలు, బెల్లం, అన్నంతో తయారుచేసిన నైవేద్యాన్ని మట్టి లేదా రాగికుండలతో తలపై పెట్టుకొని ఆకుండను పసుపు, కుంకుమ, వేపరిమ్మలతో, తెల్లముగ్గుతో అలంకరిస్తారు. ఆకుండపై ఒక దీపం ఉంచుతారు. పూర్వకాలంలో దుష్టశక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దానికి బదులుగా కోళ్లు, గొర్రెలు బలి ఇస్తున్నారు. బోనాలు మోస్తున్న మహిళలను అమ్మవారు అవహిస్తారని భక్తుల విశ్వాసం, డప్పుమోతలుతో ఊరేగింపుగా మహిళలు బోనమెత్తుకొని అమ్మవారి గుడికి వచ్చి బోనం సమర్పిస్తారు.ఈపండుగలో అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిభింభించే వేషాలు వేసుకొని, చేతిలో కొరడాతో, ఒంటినిండా పసుపు కుంకుమ, కాళ్లకు గజ్జెలు కట్టుకొని, ఎర్రని గోఛీ ధరించి డప్పుల మోతకు అనుగుణంగా లయబద్ధంగా ఆడుతారు. ముత్యాలమ్మ ఆలయంకు ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

జోగులాంబ గద్వాల

మల్లమ్మ కుంట రిజర్వాయర్కు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి.

అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గం ఆర్డీఎస్ రైతుల దశాబ్దాల కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. మల్లమ్మ కుంట రిజర్వాయర్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి. కృతజ్ఞతలు తెలియజేసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి, డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో తుమ్మిళ్ల లిఫ్టు కింద మల్లమ్మ కుంట రిజర్వాయర్ కు అనుమతి ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అలంపూర్ నియోజకవర్గం ప్రజల తరుపున సంపత్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసారు. మల్లమ్మ కుంట రిజర్వాయర్ కింద భూమిపోయిన రైతులను కూడా ఆదుకోవాలని సరైన నష్టపరిహారం ఇచ్చే విధంగా కృషిచేయాలని సీఎంను ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి సూచనల మేరకు వింజమూరు ప్రభుత్వ వైద్యశాల వీధికి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసిన స్థానిక తెలుగుదేశం నాయకులు గువ్వల కృష్ణా రెడ్డి..!!

వింజమూరు,ఆగస్టు14, పున్నమి న్యూస్ ప్రతినిధి// జాతీయ రహదారి నుండి వింజమూరు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళు దారికి ఇరువైపుల ఎమ్యల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి సూచనలతో, టీడీపీ సీనియర్ నాయకులు గువ్వల కృష్ణా రెడ్డి దాతృత్వంతో 20 విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా జాతీయ రహదారి నుండి ఈ మార్గంలో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలంటే రాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి ప్రజలు సమస్యను వివరించడంతో వెంటనే ఆయన స్పందించి వింజమూరు మండలం సీనియర్ నాయకులు గువ్వల కృష్ణా రెడ్డి ద్వారా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ సమస్య పరిష్కారం కావడంతో, ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జోగులాంబ గద్వాల

” హర్ ఘర్ తిరంగ్ ” కార్యక్రమంలో భాగంగా… జాతీయ జెండా వితరణ చేసిన బిజెపి నేతలు.

అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ పట్టణ కేంద్రంలో జాతీయ జెండాల వితరణ చేసిన బిజెపి నేతలు. బీజేపీ అలంపూర్ మండల మరియు పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు అలంపూర్ పట్టణ అధ్యక్షులు శరత్, మండల అధ్యక్షులు ఈశ్వర్ కలిసి, జాతీయ జెండాల వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ…స్వాతంత్ర్య దినోత్సవం (15 ఆగస్టు) సందర్భంగా, భారతదేశ గౌరవానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాకం ప్రతి ఇంటి వద్ద ఎగరడం లక్ష్యంగా, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ పట్టణ కేంద్రంలో జాతీయ జెండాల పంపిణీ చేపట్టాం అన్నారు. దేశభక్తి, ఐక్యత భావనను ప్రజల్లో మరింత పెరగాలన్నారు. “హర్ ఘర్ తిరంగా” పిలుపును విస్తరించడం యువత, మహిళలు ,రైతులు, కార్మికులకు జాతీయ పతాకం ప్రాముఖ్యతను తెలియజేశారు. “జాతీయ పతాకం మన గర్వం. ఇది మన స్వేచ్ఛ, త్యాగం, ఐక్యతకు ప్రతీక. ప్రతి ఇంటి వద్ద ఈ జెండా ఎగరడం ద్వారా దేశభక్తి తరతరాలకు చేరుతుంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్, రాష్ట్ర ఓబిసి మోర్చా ప్రోగ్రామ్ కన్వీనర్ జంగం నాగమల్లయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి నరేష్, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దిలేటి, పట్టణ మాజీ అధ్యక్షుడు వినీత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాలతో అరకోటి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ..!చెక్కులను పంపిణీ చేసిన, నియోజకవర్గంలోని మండల నాయకులు..!ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబాలు..!!

వింజమూరు ఆగస్టు14 : పున్నమి న్యూస్ ప్రతినిధి/// ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల కు సంబంధించిన 33 మంది బాధిత కుటుంబాలకు సుమారు 51 లక్ష 78 వేల 655 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను, ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాలతో నియోజకవర్గంలోని నియోజకవర్గంలోని మండల నాయకులు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో బాధితులకు పంపిణీ చేశారు.గురువారం వింజమూరు లోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వింజమూరు మండలం శంకవరం గ్రామానికి చెందిన అలపాటి శ్రీలత గారికి సీఎం సహాయ నిధి నుండి 12 లక్షల 82, వేల120 రూపాయలు మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి , మరియు మండల పార్టీ నాయకులు, గ్రామపార్టీ అధ్యక్షులు భూమిరెడ్డి నరసింహారెడ్డి చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా అందని వైద్యానికి బాధితులు, కార్పొరేట్ వైద్యశాలలలో వైద్యం అందించుకొని, అత్యధికంగా ఖర్చు చేసుకొని, చిన్న భిన్నం అవుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు, సీఎం సహాయనిధి వారి కుటుంబాలకు భరోసాను కల్పిస్తుందని తెలిపారు. మునుపెన్నడు లేని విధంగా పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే సుమారు రెండు కోట్ల రూపాయల సీఎం సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి ప్రజల ఆదరభిమానాలను సూరగుంటుంది అని తెలిపారు. కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిందన్నారు. జగన్ ఇలాకాలో తెలుగుదేశం పార్టీ పాగా వేసిందన్నారు. ఉదయగిరి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, దుత్తలూరు మండల కన్వీనర్, వెంకటరత్నం, సీనియర్ నాయకులు మంచాల శ్రీనివాసులు నాయుడు, యారవ కిష్టయ్య నాయుడు,మాజీ సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు, సొసైటీ డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి, పాములపాటి మాల్యాద్రి, మండల ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసుల యాదవ్, చేబ్రోలు వసంతరావు, దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి, శనివరపు నాగిరెడ్డి, కటకం ప్రసన్నకుమార్ భూమి రెడ్డి నరసింహారెడ్డి, వెంకటరెడ్డి బాధిత కుటుంబాలు బాధితులు ఇతర నాయకులు అభిమానులు తదితరులు ఉన్నారు.

జోగులాంబ గద్వాల

108 అంబులెన్స్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి.

అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ ప్రభుత్వ హాస్పిటల్ లో 108 అంబులెన్స్ ను తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సిద్దప్ప. 108 అంబులెన్స్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మరియు జిల్లా ప్రజలకు సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప అన్నారు. గురువారం రోజు ఆసుపత్రి యందు ఉన్న 108 అంబులెన్స్ ను తనిఖీ చేశారు. విధిలో భాగంగా మెడికల్ ఎక్విప్మెంట్ అన్ని ఎలా పనిచేస్తున్నాయి అనే దానిపైన ఒక్కొక్క మెడికల్ ఎక్విప్మెంట్ ని చెక్ చేయడం జరిగింది, మల్టీ ఛానల్ మానిటర్ మరియు బిపి ఆపరేటర్ మరియు లారింజస్కోప్, ధర్మామీటర్, సికాలర్, ఏఈడి మిషన్ మరికొన్ని పరికరాలను వాటి పనితీరును పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్దప్ప మాట్లాడుతూ…. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా 108 అంబులెన్సు సిబ్బంది అప్రమత్తంగా ఉండి జిల్లా ప్రజలకు సేవలు అందించాల్సిందిగా ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.