Thursday, 14 May 2026
  • Home  
  • APK ఫైల్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

APK ఫైల్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

, SPSR నెల్లూరు , నవంబర్ (పున్నమి ప్రతినిధి) నకిలీ APK ఫైళ్లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా యస్‌.పి. డా. అజిత వేజెండ్ల, IPS తెలిపారు. కావలి 1టౌన్‌లో నమోదైన ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలు సాంకేతిక సాయం తీసుకొని జార్ఖండ్‌లోని జాంతారా జిల్లాలో ముగ్గురు ముద్దాయిలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.21.90 లక్షలు స్వాధీనం చేసుకోగా, రూ.1,23,855/- అకౌంట్‌లో ఫ్రీజ్ చేశారు. 9 మొబైల్‌లు, ల్యాప్‌టాప్, సిమ్‌లు, బ్యాంక్ పుస్తకాలు తదితర వస్తువులు స్వాధీనం అయ్యాయి. ముద్దాయిలు RTO ఈ-చలానా పేరుతో APK ఫైల్ పంపి ఫోన్ హ్యాక్ చేసి UPI ద్వారా డబ్బులు దోచుకున్నట్టు విచారణలో బయటపడింది. ప్రజలు తెలియని APK ఫైళ్లు, టెలిగ్రామ్ ప్రకటనలు, లింకులు క్లిక్ చేయకూడదని యస్‌.పి. హెచ్చరించారు. మోసం జరిగిన వెంటనే 1930 లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేస్తే నష్టం చాలా వరకు నివారించవచ్చని సూచించారు. కేసు చేధనలో భాగమైన కావలి 1టౌన్ పోలీసు సిబ్బందిని యస్‌.పి. అభినందించారు.

, SPSR నెల్లూరు , నవంబర్ (పున్నమి ప్రతినిధి)

నకిలీ APK ఫైళ్లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా యస్‌.పి. డా. అజిత వేజెండ్ల, IPS తెలిపారు. కావలి 1టౌన్‌లో నమోదైన ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలు సాంకేతిక సాయం తీసుకొని జార్ఖండ్‌లోని జాంతారా జిల్లాలో ముగ్గురు ముద్దాయిలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.21.90 లక్షలు స్వాధీనం చేసుకోగా, రూ.1,23,855/- అకౌంట్‌లో ఫ్రీజ్ చేశారు. 9 మొబైల్‌లు, ల్యాప్‌టాప్, సిమ్‌లు, బ్యాంక్ పుస్తకాలు తదితర వస్తువులు స్వాధీనం అయ్యాయి.
ముద్దాయిలు RTO ఈ-చలానా పేరుతో APK ఫైల్ పంపి ఫోన్ హ్యాక్ చేసి UPI ద్వారా డబ్బులు దోచుకున్నట్టు విచారణలో బయటపడింది. ప్రజలు తెలియని APK ఫైళ్లు, టెలిగ్రామ్ ప్రకటనలు, లింకులు క్లిక్ చేయకూడదని యస్‌.పి. హెచ్చరించారు. మోసం జరిగిన వెంటనే 1930 లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేస్తే నష్టం చాలా వరకు నివారించవచ్చని సూచించారు.
కేసు చేధనలో భాగమైన కావలి 1టౌన్ పోలీసు సిబ్బందిని యస్‌.పి. అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.