పున్నమి – కే. ఆనంద్ (అనకాపల్లి బ్యూరో )
యలమంచిలి కాపు జాతి సంక్షేమం, అభివృద్ధి, ఐక్యత, భద్రత కోసం పనిచేస్తున్న కాపు సంక్షేమ భరోసా కేంద్రాల యలమంచిలి పట్టణ కన్వీనర్‌గా టి.వి.ఎస్. ప్రకాష్ నియమితులయ్యారు. అనకాపల్లి జిల్లా వెంకటాపురంలోని భరోసా కేంద్రం వద్ద జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ ఆయనను సాదరంగా ఆహ్వానించి బాధ్యతలు అప్పగించారు. కాపు జాతి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ప్రకాష్ తెలిపారు. భరోసా కేంద్రాల సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవసరమైన వారికి అండగా నిలవాలని కర్రి వెంకటరమణ సూచించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రకాష్‌కు పలువురు అభినందనలు తెలిపారు.


