స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో విద్యార్థులకు తడి, పొడి చెత్త విభజనపై అవగాహన
కడప, సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి):
స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా కడప నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ శ్రీ రాకేశ్ చంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం నగర పరిధిలోని గాంధీనగర్ స్కూల్ వద్ద విద్యార్థులకు తడి చెత్త, పొడి చెత్త విభజనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్తను ఇంటి వద్దనే వేర్వేరుగా సేకరించి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాల్సిన ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసే ప్రక్రియను స్వయంగా నిర్వహించి, చెత్త విభజనపై అవగాహన కల్పించారు.
విద్యార్థులు తమ ఇళ్లలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కూడా తడి, పొడి చెత్త విభజనపై అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నగర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, పబ్లిక్ హెల్త్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.











