లక్ష్మీనగర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
రూ.68 వేలతో లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకున్న నంద్యాల నాగరాజు
పున్నమి ప్రతినిధి | కడప, సెప్టెంబర్ 16:
కడప నగరంలోని శ్రీ లక్ష్మీనగర్‌లో వినాయక చవితి పండుగ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లడ్డూ వేలం పాటలో నంద్యాల నాగరాజు రూ.68,000లకు లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా నంద్యాల నాగరాజు మాట్లాడుతూ, విఘ్నేశ్వరుడైన శ్రీ గణపతి దేవుని ఆశీస్సులతో తమ కుటుంబ సభ్యులకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు, సంపద, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలకు మరింతగా సేవ చేసే అవకాశం కలగాలని, రాజకీయ రంగంలో ప్రజా సేవకు మరిన్ని అవకాశాలు లభించాలని గణనాథుడిని కోరుకున్నట్లు చెప్పారు.
లడ్డూ ప్రసాదాన్ని వేలం పాటలో కైవసం చేసుకున్న అనంతరం వినాయక కమిటీ సభ్యులు నంద్యాల నాగరాజును ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా ఆయన నివాసానికి లడ్డూ ప్రసాదాన్ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
“విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి కృపతో ప్రతి ఇంటా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలి. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను” అని నాగరాజు ఆకాంక్షించారు.
నంద్యాల నాగరాజు
A1 అంబులెన్స్ సర్వీస్, కడప
YSR TUC City President, Kadapa



