ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 30 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ మేకపాటి శాంతకుమారి సోమవారం తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరిన భవనం పరిస్థితిని పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రంథాలయ భవనం ప్రమాదకరంగా మారడంతో పాఠకులు భయపడుతున్నప్పటికీ వస్తుండటం అభినందనీయమన్నారు. గ్రంథాలయాన్ని పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. గ్రంథాలయ సెస్ నిధులతో పాటు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గ్రామస్థులు, దాతల సహకారంతో కొత్త భవనం నిర్మిస్తామని చెప్పారు. విద్యార్థులు, యువత ప్రయోజనాల కోసం అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ అరుణ్ కుమార్, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.
గ్రంథాలయ పునర్నిర్మాణానికి గ్రామస్థులు, దాతల భాగస్వామ్యం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 30 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ మేకపాటి శాంతకుమారి సోమవారం తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరిన భవనం పరిస్థితిని పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రంథాలయ భవనం ప్రమాదకరంగా మారడంతో పాఠకులు భయపడుతున్నప్పటికీ వస్తుండటం అభినందనీయమన్నారు. గ్రంథాలయాన్ని పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. గ్రంథాలయ సెస్ నిధులతో పాటు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గ్రామస్థులు, దాతల సహకారంతో కొత్త భవనం నిర్మిస్తామని చెప్పారు. విద్యార్థులు, యువత ప్రయోజనాల కోసం అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ అరుణ్ కుమార్, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

