*మళ్ళి కొండపల్లి పై టీడీపీ జెండా ఎగరేద్దాం*
సమిష్టి కృషితో మరోసారి ప్రభంజనం సృష్టిద్దాం
ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరిద్దాం…
ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య గారు
కొండపల్లి పట్టణం,
వచ్చే మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమిష్టి కృషితో కొండపల్లి పై తెలుగుదేశం పార్టీ జెండా మళ్లీ ఎగరేయాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య గారు. కొండపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ సర్వ సభ్య సమావేశం బుధవారం రాత్రి కొండపల్లి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జంపాల సీతారామయ్య గారు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి కార్యకర్త పసుపు సైనికుడిగా పనిచేసి మరోసారి ప్రభంజనాన్ని సృష్టించాలని అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరిం చి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇక్కడ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు.నాయకులు, కార్యకర్తలు పార్టీకి కట్టుబడి వారికి గెలుపుని బహుమతిగా ఇవ్వాలని అన్నారు.ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరా వు, పార్టీ అధ్యక్షుడు కరిమికొండ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.



