పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని భీమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ ఈవో వేద పండితులు బ్రాహ్మణుల సమక్షంలో సాంప్రదాయ బద్ధంగా పూజలు జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే అది శ్రీనివాస్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు బ్యారేజీలు ప్రాజెక్టులు నిండాలని రైతులు సాగుచేసిన పంటలు సమృద్ధిగా పండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు



