Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

బ్రహ్మోత్సవాల్లో భారత్ స్కౌట్స్ సేవలు అభినందనీయం- చైర్మన్ కొట్టే సాయి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బ్రహ్మోత్సవాల్లో భారత్ స్కౌట్స్ సేవలు అభినందనీయం- చైర్మన్ కొట్టే సాయి

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 05, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఫిబ్రవరి 15 నుండి 23వ తేదీ వరకు నిర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆశేషంగా తరలివచ్చిన భక్తులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అందించిన సేవలు ప్రశంసనీయమని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్…
  • దేవస్థానం పరిపాలన భవనంలోని చైర్మన్ కార్యాలయంలో గురువారం నాడు స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు.
  • గత 31 సంవత్సరాలుగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలందించడం అభినందనీయమన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 05, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఫిబ్రవరి 15 నుండి 23వ తేదీ వరకు నిర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆశేషంగా తరలివచ్చిన భక్తులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అందించిన సేవలు ప్రశంసనీయమని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తెలిపారు. దేవస్థానం పరిపాలన భవనంలోని చైర్మన్ కార్యాలయంలో గురువారం నాడు స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. గత 31 సంవత్సరాలుగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలందించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరిగే అన్ని ఉత్సవాలకు స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను వినియోగించుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రోవర్ జిల్లా కార్యాలయ కమిషనర్ టి. రమేష్ బాబు, స్కౌట్ మాస్టర్లు ఎస్.కె. అజారుద్దీన్, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, గైడ్ కెప్టెన్ జ్యోతి, స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *