Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పోలిరెడ్డిపాలెం పంచాయతీలో పోలింగ్ ప్రశాంతంగా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోలిరెడ్డిపాలెం పంచాయతీలో పోలింగ్ ప్రశాంతంగా

వార్త ముఖ్యాంశాలు

  • దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాలెం పంచాయతీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
  • ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
  • మహిళలు, వృద్ధులు, యువత పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి ఓటు వేస్తున్నారు.

దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాలెం పంచాయతీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, యువత పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి ఓటు వేస్తున్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించారు.

అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో పోలింగ్ సజావుగా సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వేస్తుండటంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండటంపై గ్రామ ప్రజలు, అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *